Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. బృందావనంలో అన్నదమ్ములందరూ ప్రేమలో మునిగి తేలుతుంటారు. ముఖ్యంగా మాధవ, మనీషా లవ్ స్టోరీ ఇంట్రెస్టింగా సాగింది. మాధవకు భాష కష్టాలు మొదలవుతాయి. మనీషాకు మెల్లగా తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తుంటాడు.
మహాలక్ష్మి మాట విని చక్రి స్టెప్పులు.. నీళ్లు చల్లిన కేశవ

కౌన్సిలింగ్ గురించి లాయర్ ఫోన్ చేసి చెప్పినా తాను రావడం కుదరదని చెప్పినట్లు చక్రితో మహా చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. ఆ మాట విని చక్రి ఎగిరి గంతేస్తాడు. వెంటనే కేశవను బయటకు తీసుకెళ్లి.. చూశావా మహా మనసు మారుతోంది.. కౌన్సిలింగ్ కు రాలేనని చెప్పిందట అంటూ ఆనందంతో స్టెప్పులేస్తాడు. అంత లేదు.. కౌన్సిలింగ్ కు వెళ్తే మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తారు.. అందుకే నేరుగా కోర్టుకే వస్తానని చెప్పి ఉంటుందని చక్రి ఆనందంపై కేశవ నీళ్లు చల్లుతాడు.
దీంతో చక్రి ముఖం వాడిపోతుంది. అయినా సరే తనకు అంతా మంచే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతోందంటూ అతడు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. మహా వచ్చి అతన్ని కోపంగా చూస్తుంది. అప్పుడే చక్రికి గోపిక ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కట్ చేసినా మహాను ఉడికించడానికి చెప్పు గోపీ.. తిన్నావా గోపీ అంటూ ఏదో మాట్లాడుతుంటాడు. దీంతో మహా ఉడుక్కుంటూ లోనికి వెళ్లిపోతుంది.
మహా ముందు గోపీ అంటూ లవర్‌కి చక్రి ఫోన్..
చూశావా తాను గోపికతో మాట్లాడుతున్నానంటే మహా ఉడుక్కుంటోంది అని కేశవతో అంటాడు చక్రి. ఆ తర్వాత లోనికి వెళ్లి పని చేసుకుంటున్న మహా ముందు మళ్లీ గోపికకు ఫోన్ చేస్తాడు చక్రి. చెప్పు గోపీ.. ఏం చేస్తున్నావ్ గోపీ అంటూ మాట్లాడుతుంటాడు. అతన్ని చూసి మహాకు మండిపోతుంది. చక్రి వేషాలు చూడలేక మహా లోనికి వెళ్లి తలుపేసుకుంటుంది.
నారాయణకు క్లాస్ పీకిన మహా
{{/usCountry}}చూశావా తాను గోపికతో మాట్లాడుతున్నానంటే మహా ఉడుక్కుంటోంది అని కేశవతో అంటాడు చక్రి. ఆ తర్వాత లోనికి వెళ్లి పని చేసుకుంటున్న మహా ముందు మళ్లీ గోపికకు ఫోన్ చేస్తాడు చక్రి. చెప్పు గోపీ.. ఏం చేస్తున్నావ్ గోపీ అంటూ మాట్లాడుతుంటాడు. అతన్ని చూసి మహాకు మండిపోతుంది. చక్రి వేషాలు చూడలేక మహా లోనికి వెళ్లి తలుపేసుకుంటుంది.
నారాయణకు క్లాస్ పీకిన మహా
{{/usCountry}}ఆ తర్వాత బయట కూర్చొన్న నారాయణ దగ్గరికి మహా వస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ముందు ఇక్కడి నుంచి లోనికి పదా అంటుంది. నీకు ఇక్కడేం పని.. నువ్వే లోనికి వెళ్లు అని మహాతో అంటాడు నారాయణ. నేను వెళ్తే బీడీ తాగుదామనే కదా.. మందు, బీడీలు తాగితే ఇప్పటికే నీ బాడీలో ఫుల్లుగా ఉన్న కొలెస్ట్రాల్ మరింత పెరుగుతుంది అని మహా తిడుతుంది.
ఏం కాదులే అమ్మా.. అయినా నేను చనిపోయినా ఏడవడానికి ఓ అమ్మ, మోయడానికి నలుగురు కొడుకులు ఉన్నారని నారాయణ అనడంతో మహా ఎమోషనల్ అవుతుంది. మరోసారి అలా మాట్లాడకు అని చెప్పి మహా లోనికి వెళ్లిపోగా.. నారాయణ నవ్వుతాడు.
మాధవను టీజ్ చేసిన తమ్ముళ్లు, మహా.. మనీషా పేరు చెప్పి..
ఆ తర్వాత రాత్రి భోజనం చేయడానికి సిద్ధమైన అందరూ మాధవను టీజ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఏం చేశావన్నయ్యా అని కన్నా అడుగుతాడు. పప్పు పులుసు, కందగడ్డ ఫ్రై అని చెబుతాడు. అంటే మధ్యాహ్నం తిన్నవే మళ్లీ తినాలా అని ఒకరు.. ఆ ఉప్పు పులుసే మళ్లీ తినాలా అని మహా అంటారు. ఉప్పు ఎక్కువైందా అని మాధవ అడిగితే.. నువ్వు మధ్యాహ్నం తినలేదా అని చక్రి అడుగుతాడు. కన్నా వెళ్లి మాధవ బాక్స్ తీసుకొస్తాడు.
అందులో అన్నీ అలాగే ఉండటంతో అన్నను చక్రి ఆటపట్టిస్తాడు. మనీషా లంచ్ తీసుకొచ్చిందా అని అడుగుతాడు. దీంతో మాధవ సిగ్గు పడతాడు. బన్సీ తీసుకొచ్చాడని చెబితే.. మరో పేరు చెప్పన్నయ్యా అని కేశవ అంటాడు. అందరూ కలిసి మాధవను ఆటపట్టిస్తుంటే.. నారాయణ కూడా వచ్చి పెద్ద కొడుకును మరింత టీజ్ చేస్తాడు. మనీషాతో ఎలా మాట్లాడావ్.. హిందీలో మాట్లాడావా అని అడుగుతారు. మనీషానే తెలుగు నేర్చుకుంటోందని మాధవ చెబుతాడు. వీడికి హిందీ ఎలాగూ రాదని ఆ అమ్మాయే తెలుగు నేర్చుకుంటోందేమో అని నారాయణ అంటాడు.
మనీషాతో మాధవ చాటింగ్.. తెలుగు పాఠాలు
తినడం పూర్తయిన తర్వాత మాధవకు మనీషా మెసేజ్ చేస్తుంది. ఎమోజీలతో కాసేపు ఇద్దరూ చాట్ చేసుకుంటారు. ఆ తర్వాత బాగా మెక్కారా అని మనీషా ఓ వాయిస్ మెసేజ్ పంపుతుంది. అది విన్న మాధవ షాక్ తింటాడు. మెక్కారా అని అనకూడదు అంటూ మనీషాకు కాల్ చేస్తాడు. అన్నం తిన్నారా అని అడగాలి అంటాడు. ఆ తర్వాత తెలుగు పాఠాలు చెబుతాడు. తనకు వచ్చీరాని హిందీలో ఏం తిన్నానో.. ఏం వంట చేశానో మాధవ చెప్పడం నవ్వు తెప్పిస్తుంది.
లవర్లతో అన్నదమ్ములు ఫోన్లలో బిజీ.. కన్నా, చక్రిని చితకబాదిన మహా
ఓవైపు మాధవ మనీషాతో ఫోన్ మాట్లాడుతుండగానే.. అటు బయట చక్రి, కేశవ కూడా ఫోన్లలో బిజీగా ఉంటారు. అది చూసిన కన్నా.. మహా దగ్గరికి వెళ్లి అందరి గురించి చెబుతాడు. దీంతో మహా బయటకు వచ్చి చూస్తే ఓవైపు చక్రి, మరోవైపు కేశవ ఫోన్లలో బిజీగా ఉంటారు. మహాను చూడగానే చక్రి తన ఫ్రెండ్ ఫోన్ కట్ చేసి గోపికతో మాట్లాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటాడు.
ఇక లాభం లేదనుకొని లోనికి వెళ్లి ఓ కర్ర తీసుకొచ్చి లవర్ కావాలారా నీకు.. అమ్మాయి కావాలా అంటూ కన్నా వెంట పడీ మరీ కొడుతుంది. అతడు చక్రి వెనుక వెళ్లి దాక్కుంటే.. మహా కావాలని చక్రిని కూడా చితకబాదుతూ తన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇంట్లో ఓ చిన్న పిల్లాడు ఉన్నాడని పట్టించుకోకుండా అందరూ లవర్లతో ఫోన్లు మాట్లాడతారా అంటూ చక్రి, కేశవలకు క్లాస్ పీకుతుంది.
గోపిక బర్త్‌డేకి చక్రి.. బటన్స్ తీసేసిన మహా
ఆ తర్వాత గోపిక బర్త్ డేకి పిలిచిందని, వెళ్తున్నాననంటూ చక్రి షర్ట్ ఐరన్ చేసి పెట్టుకుంటాడు. అది చూసిన మహా మరింత ఉడుక్కుంటుంది. చక్రి లోనికి వెళ్లగానే షర్ట్ బటన్స్ అన్నీ కట్ చేస్తుంది. తర్వాత షర్ట్ చూసిన చక్రి షాకవుతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.