...
...
Next Story

Podarillu September 24 Episode: పొదరిల్లు- మహా కాళ్లు పట్టుకున్న కేశవ- చక్రికి అక్కలా మహాలక్ష్మి-విక్కీ, చక్రిల గిఫ్ట్స్

Podarillu Serial September 24th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 24వ ఎపిసోడ్‌‌లో బస్టాఫ్‌లో గోపిక వైపే సీరియస్‌గా చూస్తుంది మహా. గోపిక వచ్చి మాహాలక్ష్మిని చక్రి గురించి అడుగుతుంది. కాల్ చేసి అడుక్కోమని మహా చెబుతుంది. మహా ఇచ్చిన ప్రజంటేషన్ బాగుందని విక్కీ గిఫ్ట్ ఇచ్చి కాఫీకి పిలుస్తాడు.

Published on: Sep 24, 2026, 09:16:18 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అన్నదమ్ములు ముగ్గురు లవర్స్‌తో ముచ్చట్లు పెట్డడంపై మహాలక్ష్మి కోప్పడుతుంది. చక్రిని కొడుతుంది. మీకెందుకండి మంట. మీరెవరో నేనెవరో అని చక్రి అంటాడు. ఇంటిని లవర్స్ పార్క్ చేసిందే మీరు. చదువుకునే పిల్లాడి ముందు ఏంటిదని కన్నాను కొడుతుంది. కేశవకు కూడా పడతాయ్.

మహా కాళ్లు పట్టుకున్న కేశవ

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 24 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 24 ఎపిసోడ్

నారాయణ ముసుగు కప్పుకుని పడుకుంటాడు. అదంతా చూసిన మాధవ కూడా భయపడి పడుకుంటాడు. చక్రి, కన్నా కూడా పారిపోయి పడుకుంటారు. కేశవ దొరికిపోయాడా అని మాధవ అంటాడు. బాగా అని చక్రి అంటాడు. కేశవ దగ్గరికి వెళ్లి తిడుతుంది. దాంతో మీ కాళ్లు పట్టుకుంటానండి అని కేశవ భయపడిపోతాడు. వెళ్లి పడుకుంటాడు.

మరుసటి రోజు ఉదయం రాత్రి కోపం తెచ్చుకుంది మీ గురించి కాదు. కన్నాగాడు వచ్చి లవర్ ఉంటే బాగుండు అన్నాడు. అది ఓ కారణం అని మహా అంటుంది. చక్రి కూడా మరో అమ్మాయితో మాట్లాడటం కూడా కారణం కదా అని మాధవ అంటాడు. ఆయన ఎవరితో మాట్లాడితే నాకేంటీ. కన్నా ముందు మాట్లాడకుంటే చాలని మహా అంటుంది.

కన్నా వచ్చి ప్లేట్ పడేస్తే.. మహా కోపంగా చూస్తుంది. దాంతో ప్లేట్ కడుగుతాడు కన్నా. ఎవరి ప్లేట్స్ వారే కడుక్కోవాలని వదిన చెప్పిందని కన్నా అంటాడు. మహాకు లంచ్ బాక్స్ ఇస్తాడు మాధవ. మరి మీకేదని మహా అడిగితే.. నాకు వద్దంటాడు. మనీషా తీసుకొస్తుందని కన్నా, మహా ఆటపట్టిస్తారు. మిమ్మల్ని చూసుకునేందుకు బిహార్ నుంచి ఒకరు వచ్చారని మహా అంటుంది.

చక్రికి అక్క కదా

ఇంక అంత క్లోజ్ కాలేదే. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు అని గోపిక అంటుంది. చక్రి ఇంకా రాకపోవడంపై మహా, కన్నాను అడుగుతుంది గోపిక. నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. అడిగితే చెబుతాడుగా అని కోప్పడుతుంది మహా. అవును మీరు రోజు వీళ్లతోపాటే వస్తారు. ఆయనతో మీకు ఏమవుతారు అని గోపిక అడుగుతుంది. తెలుసుకుని ఏం చేస్తావని మహా అంటుంది.

అర్థమైందిలెండి. మీరు చక్రి వాళ్ల అక్క కదా అని గోపిక అంటే.. కాదు వాళ్ల అత్తను అని కోపంగా అంటుంది మహా. గోపిక వెళ్లిపోతుంది. దానికి సైటా. నేను అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా. అదే ఆంటీలా ఉందని కోపంగా ఫీల్ అవుతుంది మహా. ఇంతలో చక్రి వస్తాడు. పలకరిస్తాడు. ఎలా వచ్చావో అలాగే వెళ్లు. నీకే మంచిదని కన్నా అంటాడు.

మహాకు విక్కీ గిఫ్ట్

వినిపించికోకుండా చక్రి ఓవర్ చేస్తాడు. గోపిక దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు. అదంతా చూసిన మహాలక్ష్మి బస్ వచ్చేంతవరకు ఉండలేను. వెళ్లిపోతాను అని వెళ్లిపోతుంది మహా. అది చూసిన చక్రి కూడా వర్క్ ఉందని వెళ్తాడు. కన్నా వెళ్లకు అని, మూడ్ సరిగా లేదని ఎంత చెప్పిన చక్రి వినడు. మరోవైపు ఆఫీస్‌లో మహాలక్ష్మి ప్రజంటేషన్ చాలా బాగుందని ఫ్రెండ్ దివ్య అంటుంది.

ఇంతలో విక్కీ కూడా వచ్చి మెచ్చుకుంటాడు. అప్రిసియేషన్ గిఫ్ట్ అని బహుమతి ఇస్తాడు విక్కీ. నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతాడు. నీ కారణంగా నా డ్రీమ్ నెరవేరిందని. థ్యాంక్స్ చెబుతాడు మహాలక్ష్మి. పార్టీ లేదా పుష్ప. కాఫీకి వెళ్దామా. నేను తీసుకెళ్లే ప్లేస్ నీకు చాలా నచ్చుతుందని విక్కీ అంటాడు. సరేననని మహాలక్ష్మి చెబుతుంది.

విక్కీ వెళ్లిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది. ఇలాంటి ప్రజంటేషన్స్ నేను కూడా చాలా ఇచ్చాను. కానీ, ఇలా స్వీట్ బాక్స్ ఇవ్వడాలు, కాఫీకి రమ్మని పిలవడాలు చేయలేదు. నీ విషయంలో ఇంత పర్సనల్ థింకింగ్ ఏంటో. ఇప్పుడులాంగ్ డ్రైవ్. తర్వాత కాఫీ. ఆ తర్వాత డేటింగ్ అని దివ్య తన డౌట్ చెబుతుంది. పిచ్చిదానిలా మాట్లాడకని వెళ్లిపోతుంది మహా.

గోపికకు చక్రి కాస్ట్‌లీ గిఫ్ట్

మరోవైపు కేశవ దగ్గరికి వెళ్లిన చక్రి కారులో ఏసీ పనిచేయట్లేదని, త్వరగా చేయమని రుబాబు చేస్తాడు. కేశవ చేయనంటాడు. దాంతో జ్యూస్ తీసుకొస్తారా అని రిక్వెస్ట్ చేస్తాడు. కేశవ సరేనని ఒప్పుకుంటాడు. అసిస్టెంట్‌ను పట్టుకుని జ్యూస్ తీసుకురావడానికి చక్రి వెళ్తాడు. కారు రిపేర్ చేస్తాడు కేశవ. ఇంతలో శైలు వస్తుంది. ఫోన్ ఎందుకు తీయట్లేదని గొడవ పెట్టుకుంటుంది.

చక్రి వస్తాడు. శైలును వెళ్లిపోమ్మని చూస్తేనే చిరాకుగా ఉందని కేశవ అంటాడు. ఆ తర్వాత విక్కీ గురించి మహా చెబితే గోపిక బర్త్ డే ఉందని, కాస్ట్‌లీ గిఫ్ట్ తీసుకెళ్తానని చక్రి అంటాడు. ఆ కోపంతో చక్రి ఇస్త్రీ చేసుకున్న షర్ట్ బటన్స్ తీసేస్తుంది మహా. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks