...
...
Next Story

Podarillu September 28 Episode: పొదరిల్లు.. చచ్చిపోతానంటూ చక్రికి గోపిక వార్నింగ్.. తనకు పెళ్లయిందన్న చక్రి.. మహాకు షాక్

Podarillu Serial September 28th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 28 ఎపిసోడ్ లో చక్రి పూర్తిగా ఇరుక్కుంటాడు. గోపిక నేరుగా అతని ఇంటికే వెళ్లి చచ్చిపోతానంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో మహా, మాధవ కూడా షాక్ తింటారు.

Published on: Sep 28, 2026, 08:04:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో చక్రి సరదా ప్రేమ చివరికి అతని మెడకు గట్టిగా చుట్టుకుంటుంది. మహాను ఉడికించడానికి చూస్తే అది కాస్తా చావు వరకూ వెళ్తుంది. దీంతో చక్రితోపాటు ఇంట్లో వాళ్లు కూడా ఈ ప్రేమ విషయంలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

చక్రిని నిలదీసిన గోపిక.. ఫ్రెండ్‌గానే చూశానంటూ..

Podarillu September 28 Episode: పొదరిల్లు.. చచ్చిపోతానంటూ చక్రికి గోపిక వార్నింగ్.. తనకు పెళ్లయిందన్న చక్రి.. మహాకు షాక్
Podarillu September 28 Episode: పొదరిల్లు.. చచ్చిపోతానంటూ చక్రికి గోపిక వార్నింగ్.. తనకు పెళ్లయిందన్న చక్రి.. మహాకు షాక్

చక్రికి గోపిక ఫోన్ చేసి పార్టీ నుంచి మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయావంటూ నిలదీసే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. నిన్న నా బాయ్‌ఫ్రెండ్ గానే నేను చూశాను.. ఐ లవ్ యూ అని గోపిక అంటుంది. కానీ నేను మాత్రం నిన్ను ఫ్రెండ్ గానే చూశాను.. నీపై ఎలాంటి ఫీలింగ్ లేదని చక్రి స్పష్టం చేస్తాడు.

మరి ఎందుకు ఫోన్లలో మాట్లాడావు.. ఎందుకు పార్టీకి పిలవగానే వచ్చావని గోపిక అడుగుతుంది. రావద్దనే అనుకున్నాను.. కానీ బాధపడతావని వచ్చానని చక్రి అంటాడు. నువ్వు చిన్న పిల్లవి.. ఇలాంటివి వద్దు అని చెప్పి పెట్టేస్తాడు.

కేశవ కోసం శైలు సున్నుండలు.. కలిసిపోయిన జంట

మరోవైపు కేశవ కోసం శైలు వస్తుంది. అతని కోసం తన తల్లి చేసిన సున్నుండలు తీసుకొస్తుంది. మా అమ్మ చేసిందని శైలు చెప్పడంతో మొదట తినడానికి కేశవ భయపడతాడు. అందులో ఏమైనా కలిపితే అంటాడు. మా అన్న కోసం చేసినవి.. ఎందుకు కలుపుతుంది.. నీపై ప్రేమతో తెచ్చాను.. ఇంట్లో దొంగతనం చేశాను అని శైలు చెబుతుంది.

అటు నారాయణ జ్వరంతో బాధపడుతుంటాడు. అప్పుడే ఇంటికి వస్తుంది మహా. అతని ఒళ్లు కాలిపోతూ ఉంటుంది. హాస్పిటల్ కు వెళ్దామంటే అతడు రానంటాడు. దీంతో కనీసం టీ అయినా తాగమంటూ టీ, బన్ను తీసుకొచ్చి ఇస్తుంది. వద్దంటే తినిపించబోతుంది. దీంతో నారాయణ తానే తీసుకొని తింటాడు. తర్వాత తడి బట్టను నారాయణ నుదిటిపై వేసి అతనికి సేవలు చేస్తుంది. జ్వరంతో ఎంత ఉందో చూడటానికి థర్మామీటర్ కోసం చక్రికి ఫోన్ చేస్తుంది.

కానీ చక్రి ఫోన్ స్విచాఫ్ వస్తుంది. అప్పటికే ఇంట్లో ఉన్న కన్నాను మహా తిడుతుంది. ఆయన అంత జ్వరంతో బాధపడుతుంటే పట్టించుకోరా అంటుంది. అప్పుడే చక్రి రావడంతో అతనికి కూడా క్లాస్ పీకుతుంది. ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశారని నిలదీస్తుంది. నాకు వేరే పనేం లేదనుకుంటున్నారా అని విసుక్కొని చక్రి లోనికి వెళ్తాడు. తర్వాత చక్రి ఫోన్ ను కావాలనే ఫ్లైట్ మోడ్ లో పెట్టాడని కన్నా గమనిస్తాడు. అదే విషయం మహాకు చెబుతాడు.

మాధవ కోసం మనీషా రసగుల్లా.. సైకిల్‌పై లిఫ్ట్

మరోవైపు మాధవ కోసం మనీషా వెళ్తుంది. అతనికి కోసం తానే చేసిన రసగుల్లా తీసుకెళ్తుంది. నాకు రసగుల్లా అంటే ఇష్టమని నీకెలా తెలుసంటే.. మహాలక్ష్మి చెప్పిందని అంటుంది. తర్వాత రసగుల్లా తిన్న మాధవ.. ఆమెను ఇంటి దగ్గర దిగబెడతానంటాడు. సైకిల్ పై ఆమెకు లిఫ్ట్ ఇస్తాడు. దీంతో ప్రేమ జంట సిగ్గు పడుతూ, మురిసిపోతూ సైకిల్ పై వెళ్లే సీన్ ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు.

చక్రిని ఆటపట్టించిన మహా

ఆ తర్వాత ఇంట్లో చక్రి బాధగా కూర్చొంటాడు. దీంతో అతన్ని మహా ఆట పట్టిస్తుంది. వెంటనే గోపిక ఫోన్ చేసి ఇలా లీవ్స్ పెట్టొద్దని చెప్పు అంటూ కన్నాకు ఆర్డర్ వేస్తుంది. ఒక్క రోజు కనిపించకపోయే సరికి ఎలా బాధపడతున్నాడో చూడంటూ ఆమె ఎగతాళి చేస్తుంది. కానీ చక్రి మాత్రం తనకు అది తప్ప మరో పని లేదనుకున్నారా అని సీరియస్ గా అంటాడు.

చక్రి ఇంటికి గోపిక.. పెళ్లయిందన్న చక్రి

అయితే చక్రిని మరచిపోలేకపోతున్న గోపిక.. కన్నాను కలిసి తన అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లాలని అడుగుతుంది. దీంతో అతడు ఆమెను నేరుగా ఇంటికే తీసుకొస్తాడు. గోపికను చూసి ఇంట్లో వాళ్లందరూ షాకవుతారు. ఆమెను బయటకు తీసుకెళ్లిన చక్రి.. తనకు పెళ్లయిందని, బస్టాప్ కు తన వెంట వచ్చే అమ్మాయే తన భార్య అని చెబుతాడు. దీంతో తాను చచ్చిపోతానంటూ గోపిక ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఆమెను చూసి మాధవ, మహా షాక్ తింటారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks