...
...
Next Story

Podarillu September 30 Episode: పొదరిల్లు.. చక్రికి దెబ్బ మీద దెబ్బ.. పెళ్లి కాలేదన్న మహా.. లక్కీపై మనసు పడ్డ విక్కీ

Podarillu Serial September 30 Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 30 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. గోపిక విషయంలో చక్రికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ వచ్చి నిలదీయడంతో మహాతో అసలు తనకు పెళ్లి జరిగిందా అని చక్రి నిలదీస్తాడు.

Published on: Sep 30, 2026, 08:07:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో బృందావనంలో పెద్ద చిచ్చే రేగడం చూడొచ్చు. గోపిక తన ఇంటికి వచ్చి కాలర్ పట్టుకొని శాపనార్థాలు పెట్టడంతో చక్రి షాక్ తింటాడు. మరోవైపు ఆఫీసులో లక్కీపై విక్కీ మనసు పారేసుకుంటాడు. దీంతో చక్రి అన్నివైపుల నుంచి ఇరుక్కుంటాడు.

చక్రి కాలర్ పట్టుకొని గోపిక శాపనార్థాలు.. పెళ్లయిందన్న చక్రి

Podarillu September 30 Episode: పొదరిల్లు.. చక్రికి దెబ్బ మీద దెబ్బ.. పెళ్లి కాలేదన్న మహా.. లక్కీపై మనసు పడ్డ విక్కీ
Podarillu September 30 Episode: పొదరిల్లు.. చక్రికి దెబ్బ మీద దెబ్బ.. పెళ్లి కాలేదన్న మహా.. లక్కీపై మనసు పడ్డ విక్కీ

చక్రిని గోపిక నిలదీసే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ మొదలైంది. తాను నచ్చలేదా.. బాగా లేనా.. ఎందుకు ఆశ పెట్టి ఇప్పుడు దూరం చేసుకుంటున్నావ్ అని నిలదీస్తుంది. అయితే చక్రి మాత్రం తనకు పెళ్లయిందని, బస్టాప్ కు తన వెంట వచ్చే అమ్మాయే తన భార్య అని చెబుతూ పెళ్లి ఫొటోలు చూపిస్తాడు.

దీంతో గోపిక మరింత రెచ్చిపోతుంది. చక్రి కాలర్ పట్టుకుంటుంది. అతనికి శాపనార్థాలు పెడుతుంది. నా ఏడుపు ఉసురు నీకు కచ్చితంగా తగులుతుంది.. నువ్వు నడిపే కారు కిందే పడి నువ్వు చస్తావ్.. నీతో పెళ్లి అని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేస్తావా అంటూ ఏడుస్తూ వెళ్తుంది.

గోపికను బతిమాలుతూ వెంట వెళ్లిన మాధవ

చక్రిని గోపిక శాపనార్థాలు పెట్టడం విని ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. కేశవ, కన్నా మెల్లగా జారుకోగా.. నారాయణకు ఏం జరుగుతుందో అర్థం కాదు. దీంతో మాధవనే గోపికను బతిమాలుతాడు. ఆమె వెంట వెళ్తాడు. ఏడవద్దు.. చక్రి అలాంటి వాడు కాదు.. వాడికి పెళ్లి జరిగింది అని చెబుతాడు. అయినా గోపిక మాత్రం పట్టించుకోదు. ఆమె ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని టెన్షన్ పడిన మాధవ.. గోపిక వెంట ఆటోలో ఆమె ఇంటికి వెళ్తాడు.

లక్కీపై మనసు పారేసుకున్న విక్కీ.. దగ్గరయ్యేందుకు ప్లాన్

తన క్యాబిన్ లో నుంచే మహాను చూస్తూ మురిసిపోతుంటాడు. ఆమెకు ఎలాగైనా దగ్గర కావాలనుకొని ఓ ఫైల్ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటాడు. ఆమెకు పెన్ను ఇస్తాడు.. వెక్కిళ్లు వస్తే నీళ్లు ఇస్తాడు.. ఏదో ఒకరకంగా లక్కీకి దగ్గరగా ఉండాలనుకుంటాడు. అది చూసి విక్కీ నీపై మనసు పారేసుకున్నాడని మహా కొలీగ్ ఆమెతో అంటుంది. కానీ ఆమె మాత్రం తిట్టి అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తుంది.

మహాకు కన్నా ఫోన్.. గోపిక గురించి చెప్పి..

అదే సమయంలో కన్నా.. మహాకు ఫోన్ చేస్తాడు. దీంతో ఆమె దూరంగా వెళ్లి మాట్లాడుతుంది. ఇంట్లో జరిగిన విషయం కన్నా చెబుతాడు. గోపిక ఇంటికే వచ్చేసిందని, అన్నయ్యను నిలదీసిందని అంటాడు. చక్రి అన్నయ్య చాలా ప్రమాదంలో ఉన్నాడని చెబుతాడు. బాగా జరిగింది.. ఆయనకు అలాగే జరగాలి అని మహా అంటుంది. కానీ కన్నా టెన్షన్ పడుతుండటంతో తాను చూసుకుంటానని హామీ ఇస్తుంది.

చక్రి టెన్షన్.. క్లాస్ పీకిన మాధవ.. వివరణ ఇచ్చిన చక్రి

మరోవైపు ఇంట్లో చక్రి టెన్షన్ పడుతూ ఉంటాడు. కోపంగా వెళ్లిన గోపిక ఏం చేసుకుంటుందో అన్న ఆందోళన అతనిలో కనిపిస్తుంది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తుంది. అప్పుడే కేశవ రావడంతో అతనితోనూ అదే విషయం చెబుతాడు. మరి ఎందుకు ఆ అమ్మాయికి అలా ఆశలు రేపావని నిలదీస్తాడు. మహాను ఉడికిద్దామని చూస్తే ఇలా జరిగిందని చక్రి అంటాడు.

ఆ వెంటనే మాధవ కూడా ఇంటికి వచ్చి చక్రికి క్లాస్ పీకుతాడు. ఇంట్లో నాన్నలాగా నువ్వూ తయారయ్యావా.. ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. నువ్వూ ఓ పెళ్లి చేసుకొని మరో అమ్మాయి వెంట పడతావా.. నీపై ఆశలు పెంచుకొని ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది.. ఎందుకిలా చేశావని నిలదీస్తాడు. దీంతో ఆ నారాయణతో తనకు పోలికేంటి అని చక్రి అంటాడు.

తనకు పెళ్లి కాలేదన్న చక్రి.. మహాకు క్లాస్

అందరి ముందే చక్రి చెలరేగిపోతాడు. అసలు తనకు పెళ్లే కాలేదని అంటాడు. అయినా పెళ్లయినట్లుగా మహాగారు ఎప్పుడైనా నాతో ఉన్నారా.. తమకు పెళ్లయిందని ఆమె ఎప్పుడైనా చెప్పారా.. చివరికి తన బాస్ ఇంటికి వచ్చినా నన్ను కజిన్ అని పరిచయం చేసింది.. అలాంటిది ఈ కజినే ఆమె భర్త అని నేను ఎలా చెప్పుకోవాలి.. నేను పెళ్లయిందని ఎందుకు చెప్పుకోవాలి.. నా మెడలో బోర్డు తగిలించుకొని తిరగాలా.. మ్యారేజీ సర్టిఫికెట్ సంకన పెట్టుకొని తిరుగుతూ నన్ను ఇష్టపడిన అమ్మాయికి చూపించాలా.. నాకూ పెళ్లి చేసుకోవాలి.. ఆనందంగా గడపాలన్న ఆశ ఉండదా.. మహా గారు ఎప్పుడైనా నా భార్యలాగా వ్యవహరించారా.. అలాంటప్పుడు నేను మరో అమ్మాయిని ఎందుకు చూడొద్దు.. అసలు నేను ఏ తప్పూ చేయలేదు అంటూ చక్రి తన మనసులో ఉన్న బాధనంతా వెల్లగక్కుతాడు. అదంతా విని మహా షాక్ తింటుంది.

చక్రికి గోపిక ఫ్రెండ్స్ వార్నింగ్

ఆ తర్వాత చక్రి ఇంటికి గోపిక ఫ్రెండ్స్ వస్తారు. ఎందుకు ఆమెను మోసం చేశావ్ అని నిలదీస్తారు. ఆమె గదిలోకి వెళ్లి డోరు తీయడం లేదు.. ఆమెకు ఏమైనా జరిగితే నిన్ను వదలం అని వాళ్లు ఇచ్చి వెళ్లిపోతారు.

దీంతో మాధవ చక్రికి మరింత క్లాస్ పీకుతాడు. అప్పుడే చక్రి కూడా మరోసారి మహాను నిందిస్తూ.. అసలు మనకు జరిగింది పెళ్లేనా.. ఒకవేళ ఆమె పెళ్లయిందని చెబితే వెంటనే గోపిక దగ్గరికి వెళ్లి క్షమాపణ చెబతాను అని చక్రి అంటాడు. దీంతో మహా తమకు పెళ్లి కాలేదని అనడంతో అందరూ షాక్ తింటారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks