...
...
Next Story

Podarillu September 7 Episode: పొదరిల్లు.. మాధవ, జయంతి నిశ్చితార్థం.. ఆపుతానన్న కేశవ.. శైలుతో గొడవ.. జయంతితో చక్రి, మహా

Podarillu Serial September 7th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 7 ఎపిసోడ్ లో మాధవ నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతాయి. అయితే పెద్ది ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం శైలుయే అని తెలుసుకొని కేశవ ఆమెతో గొడవ పడతాడు.

Published on: Sep 7, 2026, 08:15:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మాధవ పెళ్లి చుట్టూ తిరిగింది. పెళ్లి విషయంలో పెద్ది ఏమాత్రం వెనక్కి తగ్గడు. దీంతో చేసేది లేక జయంతిని కలిసి మాట్లాడతారు చక్రి, మహాలక్ష్మి. అటు శైలుతో కేశవ గొడవ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

మహాను మరింత ఉడికించిన చక్రి

Podarillu September 7 Episode: పొదరిల్లు.. మాధవ, జయంతి నిశ్చితార్థం.. ఆపుతానన్న కేశవ.. శైలుతో గొడవ.. జయంతితో చక్రి, మహా
Podarillu September 7 Episode: పొదరిల్లు.. మాధవ, జయంతి నిశ్చితార్థం.. ఆపుతానన్న కేశవ.. శైలుతో గొడవ.. జయంతితో చక్రి, మహా

గోపిక పేరు చెప్పి మహాను చక్రి మరింత ఉడికించే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. ఇక నుంచి తాను బస్సులో కాకుండా బండిపై వెళ్తానని ఆమె అంటుంది. బస్టాప్ లో కొందరి పనులు చూడలేకపోతున్నానని చెబుతుంది.

ఇదే అదునుగా ఆమెను మరింత ఉడికించేలా చక్రి మాట్లాడతాడు. తన గోపిక తాను కనిపించకపోతే తెగ బాధపడుతుందని అంటాడు. దీంతో మహా ముఖం మరింత ఎర్రగా మారుతుంది. చక్రిపై కోపంతో బండి కిక్ రాడ్ గట్టిగా కొట్టడంతో అది స్టార్టవుతుంది. చక్రిని తిట్టి ఆమె వెళ్లిపోతుంది.

మహాను ఫాలో చేసిన చక్రి.. మధ్యలో ఆగిన బండి

అయితే మహాను చక్రి ఫాలో చేస్తాడు. బండి మధ్యలో ఆగిపోతే కష్టమని తాను ఫాలో చేసినట్లు చెబుతాడు. కానీ మహా మాత్రం గోపిక పేరు చెప్పి మరోసారి చక్రిని తిడుతుంది. అయితే నిజంగానే బండి మధ్యలో ఆగిపోతుంది. దీంతో చక్రి ఈ బండిని కేశవ దగ్గరకు తీసుకెళ్దామంటూ తన బండి పక్కన పెట్టి మహా బండిని తోసుకెళ్తాడు.

పెద్ది పెళ్లి మాట విని స్టెప్పులేసిన శైలు

ఇంతలో చక్రి, మహా అక్కడికి వస్తారు. కేశవ వెళ్లి బండికి ఏమైందో చూస్తుండగా.. పెద్ది పెళ్లి గురించి చక్రి, మహాలతో శైలు మాట్లాడుతుంది. వాళ్లు కూడా ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని, ఈ పెళ్లి చేసుకుంటే తమ అన్నయ్య సంతోషంగా ఉండడని అంటారు. తాను కూడా పెళ్లి వద్దని చెప్పడానికి ఎంతో ప్రయత్నించానని, అయినా పెద్ది ఒప్పుకోవడం లేదని మహా చెబుతుంది. తర్వాత బండి బాగవడంతో చక్రి, మహా వెళ్లిపోతారు.

శైలుకి క్లాస్ పీకిన కేశవ.. పెళ్లి జరగకపోయినా సరే అంటూ..

వాళ్లు వెళ్లగానే మీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ కేశవను శైలు తిడుతుంది. ఆయన పెళ్లి చేసుకుంటే మీకేంటి నష్టం.. ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు అని నిలదీస్తుంది. కానీ ఆ అమ్మాయి వ్యవహారం బాగా లేదు.. ఆమెను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేడు అని కేశవ అంటాడు.

సంతోషంగా ఉండలేడని నువ్వెలా చెబుతావ్.. అయినా అది ఆయన సమస్య.. ఆయన చూసుకుంటాడు.. అని శైలు అనడంతో అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావేంటే అని కేశవ అంటాడు. తనకు తన అన్నయ్య సంతోషమే ముఖ్యం.. మన పెళ్లి కోసం ఎవరిని పడితే వాళ్లను చేసుకోమంటావా.. అవసరమైతే నిన్ను పెళ్లి చేసుకోను కానీ మా అన్నయ్య మాత్రం ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని కేశవ అంటాడు. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఇలా ఏవేవో సాకులు చెబుతున్నావంటూ శైలు గొడవ పడి వెళ్లిపోతుంది.

మాధవతో మాట్లాడిన చక్రి.. వెనక్కి తగ్గని పెద్ది..

అటు మాధవ దగ్గరికి వెళ్తాడు చక్రి. పెళ్లి విషయం మరోసారి ఆలోచించాలని అడుగుతాడు. అసలు రెండో పెళ్లి ఒక సమస్య అయితే.. ఆమె తీరు అస్సలు బాగా లేదని, చాలా పొగరుగా ఉందని చక్రి అంటాడు. ఎవరి స్వేచ్ఛ వారిది.. వాళ్లు ఎలా ఉండాలో చెప్పే హక్కు మనకు లేదు.. అయినా ఈ పెళ్లి విషయంలో మరో ఆలోచన లేదు.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతాను అని పెద్ది స్పష్టం చేస్తాడు.

దీంతో చేసేది లేక కనీసం పెళ్లికి ముందు ఆ అమ్మాయి గురించి పూర్తి తెలుసుకోమని అంటాడు. తనకు అన్నీ తెలుసు అని మాధవ అనడంతో ఆమె ఇంటి అడ్రెస్ చెప్పు అని చక్రి అడుగుతాడు. మాధవ తడబడతాడు. పెళ్లికి ముందు ఆమెతో మాట్లాడు అని చక్రి అంటే ఫోన్ నంబర్ లేదంటాడు. దీంతో వెంటనే బ్రోకర్ కు ఫోన్ చేసి జయంతి ఫోన్ నంబర్ పంపించమంటాడు. ఆ నంబర్ ను మాధవ ఫోన్ లో సేవ్ చేసి మాట్లాడమని చెప్పి చక్రి వెళ్లిపోతాడు.

జయంతిని కలిసిన చక్రి, మహా.. పొగరుగా మాట్లాడిన జయంతి

ఆ తర్వాత మహాను కలుస్తాడు చక్రి. ఇద్దరూ కలిసి జయంతిని కలవాలని నిర్ణయించుకుంటారు. అన్నయ్య పెళ్లి విషయంలో తగ్గేలా లేడు.. కనీసం ఆమెను కలిసి మన ఇంటికి సెట్ అవుతుందా లేదా అన్నది మనమే తెలుసుకుందాం.. అందుకే రెస్టారెంట్ కు ఆమెను రమ్మన్నాను అని చక్రి చెబుతాడు. ఇద్దరూ కలిసి వెళ్తారు. అక్కడికి జయంతి వస్తుంది. వచ్చీ రాగానే తనదైన స్టైల్లో పొగరుగా మాట్లాడుతుంది. పెళ్లి తర్వాత కూడా తాను ఇలాగే ఉంటాను.. మారను.. అలవాట్లు మార్చుకోను.. కొత్తవి నేర్చుకోను అని స్పష్టం చేస్తుంది.

మీ మొదటి పెళ్లి ఇందుకే విడాకుల వరకూ వచ్చినట్లుంది.. మీరు మాకు నచ్చలేదని చక్రి కూడా మొహం మీదే చెప్పేస్తాడు. తనకు రెండో పెళ్లి అని ఇష్టం లేదంటున్నారా అని జయంతి అడిగితే.. రెండో పెళ్లి వద్దనే వాళ్లం కాదని, అయితే మా అన్నయ్య చాలా సాఫ్ట్ గా ఉంటారు.. మీరు మాత్రం పొగరుగా ఉన్నారు.. ఇద్దరికీ పొంతనే లేదని చక్రి అంటాడు. కానీ మా అన్నయ్య సంతోషం కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నామని అంటాడు. మరి పెళ్లి తర్వాత మా ఇంటికి వస్తారు కదా.. మా ఇల్లు నచ్చిందా అని అడిగితే.. అస్సలు నచ్చలేదు కానీ తప్పదు కదా అని జయంతి అంటుంది. చూస్తాను.. అవసరమైతే అడ్జెస్ట్ అవుతాను అని చెబుతుంది.

శైలుతో కేశవ గొడవ

అటు బృందావనంలో మాధవ, జయంతి నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇంతలో మాధవను కలిసి శైలు.. పెళ్లి చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది. మీ పెళ్లికి కేశవ ఆ కండిషన్ పెట్టినట్లు తనకు తెలియదని పెద్ది అంటాడు. అయితే ఇదంతా కేశవ వింటాడు. శైలుని బయటకు తీసుకెళ్లి అందరి ముందూ దీని వల్లే అన్నయ్య ఇంత త్వరగా పెళ్లికి అంగీకరించాడని చెబుతాడు. ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అంటాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe