Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జయంతితో ఇల్లు, మాధవ గురించి చక్రి, మహాలక్షి మాట్లాడుతారు. నా మొదటి భర్త నన్ను అన్నింటికి గ్రాంటెడ్‌గా తీసుకున్నాడు. తను వదిలేస్తే నాకు పెళ్లి కాదన్నాడు. అది నేను తప్పని నిరూపించాలి. విడాకులు తీసుకున్న వెంటనే రెండో పెళ్లి చేసుకోవాలి. అది కూడా తనకంటే ముందే నా పెళ్లి జరగాలి. అంతకుమించి పెళ్లి మీద ఎలాంటి ఆశలు లేవు అని తన పంతం గురించి చెబుతుంది జయంతి.
రెండో పెళ్లి ప్రయోగం

జయంతి వెళ్లిపోతుంది. ఈవిడ మొదటి మొగుడు మీద పగ తీర్చుకోడానికి ఈ రెండో పెళ్లి అనే ప్రయోగం చేస్తున్నట్లు అనిపిస్తోంది నాకు అని చక్రి అంటాడు. అవును, ఇలాంటి పొగరు, అహంకారం, ఆవేశం, స్వార్థం ఇన్ని ఉన్న అమ్మాయిని సున్నితమైన పెద్ది తట్టుకోలగడా, భరించగలడా. సరే ఏం చేద్దాం. కొంత టైమ్ తీసుకుందామని మహా అంటుంది.
మరోవైపు శైలు కంగారుపడుతుంది. కేశవకు కాల్ చేసి ఉదయం పడిన గొడవకు ఇప్పటివరకు ఎందుకు కాల్ చేయలేదని, ఈ బుస్సు మీద కొంచెమైనా ప్రేమ అనురాగం ఉందా అని తిడుతుంది శైలు. నేనే నీ వెంట పడాలి, ప్రేమించాలి. చివరికి నేనే అవమానపడాలి అని తిట్లపురాణం మొదలుపెడుతుంది శైలు. ముందు నాకు సారీ చెప్పురా అని ఆర్డర్ వేస్తుంది శైలు.
ఉదయం నన్ను సెల్ఫిష్ అన్నందుకు సారీ చెప్పమని శైలు అంటుంది. కేశవ చెప్పనంటాడు. మాధవ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. నాకు ఇద్దరు ముఖ్యమే అంటాడు కేశవ. కావాలనే పెళ్లి వాయిదా వేస్తున్నావని గొడవ పడుతుంది శైలు. నీలాంటి వాన్ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని శైలు అంటే.. ముందు ఆ పని చేయి. బుర్రకు పట్టిన బూజు పోతుందని కేశవ అంటాడు.
మీరే విడిపోతున్నారు
ఆ మాటలు విన్న శైలు అన్న సురేష్ సంతోషిస్తాడు. మిమ్మల్ని ఎలా విడదీయాలని ఆలోచిస్తుంటే మీరే విడిపోతున్నారు. గొడవ పడ్డారుగా అని సురేష్ అంటాడు. శైలు తిడుతుంది. ఇంతలో తల్లి పిలవడంతో సురేష్ వెళ్లిపోతాడు. మరుసటి రోజు చక్రి, మహాలక్ష్మి ఇంటికి కావాల్సిన వస్తువుల షాపింగ్ చేస్తారు. మహా చేసిన పనులు చూసి ఇదేం శాడిజం అనుకుంటాడు చక్రి.
{{/usCountry}}ఆ మాటలు విన్న శైలు అన్న సురేష్ సంతోషిస్తాడు. మిమ్మల్ని ఎలా విడదీయాలని ఆలోచిస్తుంటే మీరే విడిపోతున్నారు. గొడవ పడ్డారుగా అని సురేష్ అంటాడు. శైలు తిడుతుంది. ఇంతలో తల్లి పిలవడంతో సురేష్ వెళ్లిపోతాడు. మరుసటి రోజు చక్రి, మహాలక్ష్మి ఇంటికి కావాల్సిన వస్తువుల షాపింగ్ చేస్తారు. మహా చేసిన పనులు చూసి ఇదేం శాడిజం అనుకుంటాడు చక్రి.
{{/usCountry}}అదే షాప్‌కి గోపిక వస్తుంది. పైనుంది తీసుకోలేకపోతుంది. అది చూసి ఇస్తాడు చక్రి. గోపికను చూసి మీరా అని ఆశ్చర్యపోతాడు చక్రి. కావాలనే మహాకు వినిపించేలా గోపికతో మాట్లాడుతాడు చక్రి. ఆ మాటలు విన్న మహా పక్కనున్న వస్తువుతో బలంగా కొడుతుంది. ఏంటా సౌండ్ అని గోపిక అడిగితే.. అల్ట్రా సౌండ్ అని పక్కకు వెళ్దామంటాడు చక్రి.
ఇంకా ఏం కావాలో తీసుకో గోపిక. బిల్ నేనే కడతానని చక్రి అంటాడు. వద్దు అని సిగ్గుపడుతుంది. సూపర్ మార్కెట్‌కు నన్ను చూసే వచ్చావుగా అని చక్రి అంటాడు. మళ్లీ చక్రిని కొడుతుంది మహాలక్ష్మి. తర్వాత నేనేంటీ ఇంత పొసెసివ్ అవుతున్నాను అని పక్కకు వెళ్లిపోతుంది మహా. కాఫీ, జ్యూస్ ఇలా వెళ్దామని గోపిక అంటే.. ఇప్పుడు కాదని చక్రి అంటాడు.
జయంతిపై ఎంక్వైరీ
బాగా చదువుకుని పాస్ అవ్వు. అప్పుడే నాకిష్టం అని చక్రి అని గోపికను పంపిస్తాడు. తర్వాత గోపిక విషయం మహాకు చెబుతాడు. ఇవన్ని ఎందుకుని చక్రి అడిగితే.. పెద్ది పెళ్లికి అని బిల్ కట్టి తీసుకుంటుంది మహాలక్ష్మి. జయంతి గురించి చుట్టుపక్కల ఇళ్లలో ఎంక్వైరీ చేయండని చక్రికి చెబుతుంది మహాలక్ష్మి.
నా భార్యల మాట్లాడుతుంది. దూరం పెడుతుంది అని చక్రి అనుకుంటాడు. జయంతి ఇంటి దగ్గరికి వెళ్తారు ఇద్దరు. జయంతి వాళ్లకు తెలియకుండా ఎంక్వైరీ చేయాలనుకుంటారు. ఒకావిడ ముగ్గేస్తుంటుంది. ఆవిడను అడుగుదామని మహా అంటే.. మీరెందుకు నేను వెళ్తానంటాడు చక్రి. ఆడ వాసన తగిలితే చాలు ఎగురుకుంటూ వెళ్తారు అని మహాలక్ష్మి అంటుంది.
రెండు కొప్పులు కలవవండి. నేను కనుక్కుని వస్తాను అని చక్రి వెళ్లిపోతాడు. ఎందుకు ఎడమ కన్ను అదురుతుంది. ఎందుకైన మంచిది పారిపోయేందుకు రెడీగా ఉండాలని మహా అనుకుంటుంది. ఆంటీ దగ్గరికి వెళ్లిన చక్రి ముగ్గు బాగుంది. మీరు కూడా సూపర్‌గా ఉన్నారు ఆంటీ అని చక్రి అంటాడు. దాంతో లోపలికి వెళ్లిన ఆంటీ చక్రిపైకి కత్తి పట్టుకుని వస్తుంది.
చక్రిపై కత్తితో ఆంటీ
దాంతో చక్రి పరుగెత్తుతాడు. మహా, చక్రి ఇద్దరు తప్పించుకుంటారు. ముందు పొగడాలని సూపర్‌గా ఉన్నారని అన్నాను. కత్తి పట్టుకుని వచ్చిందని చక్రి చెబుతాడు. దాంతో మహాలక్ష్మి నవ్వుతుంది. ఇప్పుడు నేను వెళ్తానని మహాలక్ష్మి వెళ్తుంది. అక్కడ ఆజన్మ బ్రహ్మచారి. ఆడవాళ్లకు ప్రవేశం లేదు అని రాసి ఉంటుంది. అది చక్రి చూస్తాడు. మహాకు చెప్పేందుకు ప్రయత్నిస్తే వినిపించుకోకుండా ఇంట్లోకి వెళ్తుంది. కట్ చేస్తే మహా పరుగెత్తుకుంటూ వస్తుంది.
మహాపై పసుపు నీళ్లు పడేస్తాడు బ్రహ్మాచారి. దాంతో మహాను చూసి చక్రి నవ్వుతాడు. ఇస్త్రీ షాపు వాడికి అన్ని తెలుస్తాయంటని వెళ్లి చక్రి అడుగుతాడు. ఫొటో చూపించి జయంతి గురించి అడుగుతారు. అమ్మో ఈవిడ, మొగుడుతో కాపురం చేసిందే లేదు. ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. ఈవిడ తల్లి నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. అల్లున్ని పోరా ఎధవ అని తిడుతుందని ఇస్తీ వాడు చెబుతాడు.
ఇంటికొస్తే తల్లీకూతుళ్లు కలిసి ఎగబడి మరి వెళ్లగొడుతారు. ఆ అల్లుడు ఒక పిచ్చిమాలోకం. అల్లుడిని విడగొట్టి వేరే కాపురం పెట్టించారు అని ఇస్త్రీ వాడు చెబుతాడు. అప్పుడే ఇస్త్రీవాడి భార్య వస్తుంది. ఆవిడ కూడా జయంతి గురించి చెడుగానే చెబుతుంది. నాతో కలిపి ఇప్పటికీ 20 మంది పని మనుషులు మారారు అని అంటుంది.
వేరు కాపురం పెట్టిస్తా
ఆమెను పెళ్లి చేసుకుంటే ఇల్లు ముక్కలు చేస్తుంది అని ఆవిడ చెబుతుంది. ఎలాగైనా ఈ సంబంధం క్యాన్సిల్ చేయాలని చక్రి, మహా అనుకుంటారు. బన్సీ ఇంటికి మాధవ వెళ్తాడు. అక్కడ బన్సీ చెల్లి మనీషా ఉంటుంది. లోపలికి రండి మాధవజీ అంటూ తీసుకెళ్తుంది. బన్సీ వచ్చి మాట్లాడుతాడు. మనీషా టీ పెడుతుంటుంది. రేపు నా ఎంగేజ్‌మెంట్ అని మాధవ చెబుతాడు.
ఆ మాట విన్న మనీషా హార్ట్ బ్రేక్ అవుతుంది. షాక్‌తో టీ గ్లాస్ కింద పడేస్తుంది. ఏమైందని బన్సీ అడుగుతాడు. ఏం కాలేదని చెబుతుంది మనీషా. మాధవను మనీషా ప్రేమించినట్లుగా అర్థమైపోతుంది. తర్వాత మాధవ ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. పెళ్లయ్యాకా మాధవతో వేరు కాపురం పెడతానుగా అని తమ్ముడితో జయంతి అంటుంది.
చెరో దిక్కు అవుతారు
తర్వాత జయంతి మాజీ భర్తను పరిచయం చేస్తాడు జయంతి తమ్ముడు. ఇప్పుడే అందరిని బాగా చూసుకోండి. పెళ్లయ్యాకా వరదల్లో కొట్టుకుపోయినట్లు చెరో దిక్కు అవుతారని జయంతి మాజీ భర్త హెచ్చరిస్తాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.