అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలన్న వివాదం ముదురుతోంది. బన్నీ టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించిన తర్వాత.. సదరు పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి వీడియోను డిలీట్ చేసింది. అయితే అల్లు అర్జున్ టీమ్ తనను, తన గెస్ట్‌ను వేధిస్తోందంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. వారిని 'లూజర్స్' అని అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
పీఆర్ టీమ్, బాట్స్ దాడి చేస్తున్నాయి..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న '42 రూల్స్' వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన ఆరోపణలు నిరాధారమని, ఆమెపై పరువు నష్టం దావా వేస్తామని అల్లు అర్జున్ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి (Sweekriti) స్పందించింది. వీడియోను తొలగిస్తూనే.. బన్నీ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
మంగళవారం (ఫిబ్రవరి 10) సాయంత్రం స్వీకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను (YouTube, Instagram నుంచి) తొలగించినట్లు తెలిపింది. దీనికి కారణం చెబుతూ.. "నా గెస్ట్ (కావేరీ)పై పీఆర్ మిషనరీ, బాట్ అకౌంట్స్ (Bot accounts) ద్వారా మూకుమ్మడిగా దాడి జరుగుతోంది. ఆమె ఒక ప్రముఖ సంస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆన్‌లైన్ బూతులతో ఆమె కెరీర్ నాశనం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే వీడియో తీసేసాను" అని రాసుకొచ్చింది.
"అల్లు అర్జున్ టీమ్ పవర్ హంగ్రీ.."
వీడియో తీసేసినా ఆమె తగ్గలేదు. "మా చర్చ వాస్తవాల ఆధారంగానే జరిగింది. పరువు తీయడానికి కాదు. కానీ అల్లు అర్జున్, ఆయన టీమ్ జవాబుదారీగా ఉండకుండా.. అధికారాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. వాళ్లు కేవలం ‘లూజర్స్’. అధికార దాహం ఉన్నవాళ్లు" అంటూ స్వీకృతి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
"నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది.."
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడి గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "ఒక మహిళ ఇంటర్నెట్లో ప్రశాంతంగా కంటెంట్ చేసుకోలేదా? బన్నీ పీఆర్ టీమ్ నాపై దాడి చేస్తోంది. నన్ను తిట్టినంత మాత్రాన నన్ను కిందకు లాగలేరు. నిజం మాట్లాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది" అని ఆమె పేర్కొంది. బన్నీ అభిమానులు పెడుతున్న అసభ్యకర కామెంట్ల స్క్రీన్ షాట్లను కూడా ఆమె షేర్ చేశారు.
అసలు వివాదం ఇదీ..
{{/usCountry}}సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడి గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "ఒక మహిళ ఇంటర్నెట్లో ప్రశాంతంగా కంటెంట్ చేసుకోలేదా? బన్నీ పీఆర్ టీమ్ నాపై దాడి చేస్తోంది. నన్ను తిట్టినంత మాత్రాన నన్ను కిందకు లాగలేరు. నిజం మాట్లాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది" అని ఆమె పేర్కొంది. బన్నీ అభిమానులు పెడుతున్న అసభ్యకర కామెంట్ల స్క్రీన్ షాట్లను కూడా ఆమె షేర్ చేశారు.
అసలు వివాదం ఇదీ..
{{/usCountry}}'స్వీకృతి టాక్స్'లో కావేరీ బారువా మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను కలవడానికి వెళ్లినప్పుడు 42 కండిషన్లు పెట్టారని, కళ్ళల్లోకి చూడకూడదని చెప్పారని ఆరోపించారు. దీనిపై బన్నీ టీమ్ స్పందిస్తూ ఇవన్నీ అబద్ధాలని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం కావేరీ తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసుకున్నారు.