Actress: 17 ఏళ్ల‌కే సల్మాన్ ఖాన్‌తో సినిమా.. ఇప్పుడు టిఫిన్ సెంట‌ర్‌ లో పని.. మ‌న‌సును క‌దిలించే హీరోయిన్ క‌న్నీటి గాథ‌

Actress: 17 ఏళ్ల వయసులో బాలీవుడ్ లో అడుగుపెట్టిన పూజా దద్వాల్.. ప్రస్తుతం ముంబైలోని చిన్న గదిలో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కన్నీటి గాథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

Published on: May 4, 2026, 05:57:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actress: 1995లో విడుదలైన 'వీర్గతి' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించిన పూజా దద్వాల్ జీవితం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ఈ నటి.. ప్రస్తుతం ముంబైలోని ఓ చిన్న గదిలో నివసిస్తూ, జీవనోపాధి కోసం టిఫిన్ సెంటర్ నడిపిస్తోంది.

పూజ దద్వాల్ (x/Nalini Unagar)
పూజ దద్వాల్ (x/Nalini Unagar)

17 ఏళ్లకే

పూజా తన 17 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'వీర్గతి' సినిమాతో కలల ప్రపంచంలోకి ప్రవేశించింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించడం ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ హీరోయిన్ నటనకు మాత్రం మంచి స్పందన దక్కింది. భవిష్యత్తులో మంచి కెరీర్ ఉంటుందని అందరూ భావించారు. అయితే, ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.

టీవీలోకి పూజ

వీర్గతి తర్వాత సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో పూజ దద్వాల్ టెలివిజన్ రంగం వైపు మళ్లింది. 'ఆషీకి', 'ఘరానా' వంటి సీరియళ్లలో నటించినప్పటికీ, ఆమెకు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. చివరకు యాక్టింగ్ కు దూరమై వివాహం చేసుకుని గోవాకు వెళ్లిపోయింది. అక్కడ తన భర్తతో కలిసి క్యాసినో నడిపించింది.

టీవీ వ్యాధితో

2018వ సంవత్సరం పూజ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమెకు తీవ్రమైన క్షయ (టీబీ) వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ భయంకరమైన వ్యాధి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక, ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఆ కష్టకాలంలో ఆమె భర్త, అత్తమామలు ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. దీంతో ఎటువంటి సహాయం లేకుండా ముంబైలో పూజ ఒంటరిగా మిగిలిపోయింది.

సల్మాన్ సాయం

ఆ కష్ట సమయంలో ఓ మంచి మనిషి సాయంతో పూజ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. తనను ఆదుకోవాలని కోరుతూ ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో చూసి నటుడు రవికిషన్, సల్మాన్ ఖాన్ స్పందించారు.

"సల్మాన్ ఖాన్ దాదాపు ఆరు నెలల పాటు నా వైద్య ఖర్చులను భరించారు. ఆ సాయం నా ప్రాణాలను కాపాడింది" అని పూజా దద్వాల్ పలు సందర్భాల్లో కృతజ్ఞతలు తెలిపింది.

పని మనిషిగా

వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా పూజ కష్టాలు తీరలేదు. ముంబైలోని చిన్న గదిలోకి మారి, బతుకుదెరువు కోసం ఇళ్లల్లో పని మనిషిగా చేసింది. 2020లో పంజాబీ చిత్రం 'శుక్రానా: గురు నానక్ దేవ్ జీ కా'తో రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించినా, ఆ మూవీ పూజ కెరీర్ ను మలుపు తిప్పలేకపోయింది.

ప్రస్తుతం పూజదద్వాల్ చాలా సాధారణ జీవితం గడుపుతోంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా, ముంబైలో చిన్న టిఫిన్ సర్వీస్ నడుపుకుంటూ తన రోజువారీ అవసరాలను తీర్చుకుంటోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More