...
...
Next Story

పూజా హెగ్డేనే డామినేట్ చేసిన చిన్నోడు.. 'మోనికా' సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు.. నోరెళ్లబెట్టిన బ్యూటీ

చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో జరిగిన ఓ ఈవెంట్‌లో హీరోయిన్ పూజా హెగ్డేకు ఊహించని అనుభవం ఎదురైంది. 'కూలీ' సినిమాలోని 'మోనికా' పాటకు ఆమె డ్యాన్స్ చేస్తుండగా, ఓ చిన్నారి స్టేజ్ మీదకు వచ్చి అద్భుతమైన స్టెప్పులతో ఇరగదీశాడు. అతన్ని చూసి పూజా కూడా ముక్కున వేలేసుకుంది.

Published on: Feb 9, 2026, 17:33:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' (Coolie) సినిమాలోని 'మోనికా' (Monica) పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఆ పాటలో పూజా హెగ్డే గ్లామర్ ఒకెత్తయితే, సౌబిన్ షాహిర్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు మరొక ఎత్తు. తాజాగా చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో పూజా హెగ్డే పాల్గొంది. అక్కడ ఆమె ఈ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఓ బుడతడు ఆమెనే డామినేట్ వేసే స్టెప్పులేశాడు.

చిన్నోడు రాక్స్.. పూజా షాక్

పూజా హెగ్డేనే డామినేట్ చేసిన చిన్నోడు.. 'మోనికా' సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు.. నోరెళ్లబెట్టిన బ్యూటీ
పూజా హెగ్డేనే డామినేట్ చేసిన చిన్నోడు.. 'మోనికా' సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు.. నోరెళ్లబెట్టిన బ్యూటీ

ఈవెంట్ మధ్యలో హానీ (Hani) అనే ఓ చిన్న కుర్రాడు స్టేజ్ పైకి వచ్చి పూజా హెగ్డేతో కలిసి స్టెప్పులేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా.. సినిమాలో సౌబిన్ షాహిర్ వేసిన కష్టమైన స్టెప్పులను ఆ కుర్రాడు అలవోకగా రీక్రియేట్ చేశాడు. అతని డ్యాన్స్ చూసి పూజా హెగ్డే అవాక్కయింది. అతని టాలెంట్ చూసి ముచ్చటపడిన ఆమె.. డ్యాన్స్ ఆపేసి ఆ కుర్రాడిని హైలైట్ చేయడానికి పక్కకు తప్పుకుంది. అంతేకాదు, అతన్ని అనుసరిస్తూ కొన్ని స్టెప్పులు వేయడానికి కూడా ప్రయత్నించింది.

జాఫర్ సాదిక్ శిష్యుడా?

'విక్రమ్', 'జైలర్' సినిమాలతో ఫేమస్ అయిన నటుడు, డ్యాన్సర్ జాఫర్ సాదిక్ ఈ పిల్లాడికి మెంటర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వైరల్ వీడియోపై జాఫర్ స్పందిస్తూ.. "నీ స్కిల్స్‌ని నువ్వు నమ్మితే, ఈ విశ్వం నీకు దారి చూపిస్తుంది. నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. చాలా గర్వంగా ఉంది" అంటూ హానీని ఆకాశానికెత్తేశాడు.

నెటిజన్ల కామెంట్స్..

ఈ వీడియో చూసిన నెటిజన్లు పూజా హెగ్డే కంటే ఆ పిల్లాడే బాగా చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. “వీడియోలో పూజాని అస్సలు పట్టించుకోకుండా ఇరగదీశాడు” అని ఒకరు.. "నిజంగా గ్రేట్.. పూజా హెగ్డేనే డామినేట్ చేశాడు" అని మరొకరు.. "సినిమాలో సౌబిన్ షాహిర్ షాక్ ఇస్తే.. ఇక్కడ ఈ చిన్నోడు షాక్ ఇచ్చాడు" అంటూ ఇంకొరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పూజా హెగ్డే సినిమాలు..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe