Poonam Kaur: నటి కోసం భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టిన గురూజీ- మరో బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్
Poonam Kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి బాంబ్ పేల్చింది. తెలుగు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చూస్తూ సంచలన ఆరోపణలు చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పూనమ్ పెట్టిన కామెంట్లు టాలీవుడలో ప్రకంపనలు రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Poonam Kaur: టాలీవుడ్లో మరోసారి వివాదాల సెగలు రేపుతోంది నటి పూనమ్ కౌర్ (Poonam Kaur). సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఇండస్ట్రీలోని లోపాలను ఎండగట్టే పూనమ్, ఈసారి నేరుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) టార్గెట్‌గా ఇవాళ (అక్టోబర్ 15) ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో పెట్టిన పోస్టులు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

త్రివిక్రమ్‌లో మునుపటి ఫన్ లేదు
పూనమ్ కౌర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ స్టైల్‌ను ఎండగట్టింది. ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే క్లాసిక్ ఎంటర్టైన్మెంట్, పంచ్ డైలాగులు, మునుపటి ఫన్ ఇప్పుడు ఆయనలో అస్సలు కనిపించడం లేదని పూనమ్ ఘాటుగా ట్రోల్ చేసింది. త్రివిక్రమ్ కేవలం ఒక బ్రాండ్‌గా మారిపోయారే తప్ప, కంటెంట్‌లో పస తగ్గిందంటూ ఇన్ డైరెక్ట్‌గా సెటైర్లు వేసింది.
‘‘నీలో ఫన్ లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ ప్లేస్ కు నువ్వు మళ్లీ వెళ్లలేవు’’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పూనమ్ కౌర్ రాసుకొచ్చింది.

భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టారా..?
పూనమ్ కౌర్ పెట్టిన మరో పోస్ట్ టాలీవుడ్‌ని ఒక్కసారిగా షేక్ చేసింది. "ఒక నటి కోసం భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టిన వ్యక్తిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'గురూజీ' అని పిలుస్తున్నారు" అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

నా ఫ్యామిలీ బలహీనతను వాడుకున్నారు
ఈ సంచలన వ్యాఖ్యలతో పాటు, రీసెంట్గా తన కుటుంబాన్ని త్రివిక్రమ్ వాడుకున్నాడంటూ పూనమ్ కౌర్ చేసిన పాత కామెంట్లు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి. "త్రివిక్రమ్ శ్రీనివాస్ మా కుటుంబ బలహీనతను ఆసరాగా చేసుకుని, వారితో బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పించారు" అని ఆమె గతంలో ఆరోపించింది.
తన కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు పారిపోయి, అవసరం రాగానే ఇలా వాడుకోవడం చాలా దుర్మార్గమని, ఆ బలవంతపు ప్రకటనలకు తాను ఎంతమాత్రం కట్టుబడి ఉండబోనని పూనమ్ ఖరాకండీగా తేల్చి చెప్పింది.
'మా' అసోసియేషన్ మౌనంపై ప్రశ్నలు!
ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని పూనమ్ ప్రశ్నించింది. పెద్ద పెద్ద డైరెక్టర్లపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదని, ఎంతమంది జీవితాలు నాశనం కావాలని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ పెట్టిన ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, సంచలన కామెంట్లు టాలీవుడ్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


