Poonam Pandey: సెలబ్రిటీల పబ్లిక్ లైఫ్, పాపారాజీ కల్చర్, ఫ్యాన్ బౌండరీస్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం పూనమ్ పాండే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఫ్యాన్ సెల్ఫీ పేరుతో ఆమెను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించినట్లు ఆ వీడియోలో ఉంది.
పూనమ్ పాండేకు ముద్దు

ముంబైలో పూనమ్ పాండే ఎప్పటిలాగే మీడియా కెమెరాలకు ఫోజులిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక గుర్తుతెలియని వ్యక్తి సెల్ఫీ తీసుకోవాలనే సాకుతో ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. పూనమ్ అతడికి ఫోజ్ ఇస్తుండగా, ఒక్కసారిగా ఆ వ్యక్తి ఆమెను పబ్లిక్‌గా కిస్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో పూనమ్ పాండే షాక్ అయింది.
వీడియో వైరల్
సెల్ఫీ పేరుతో వచ్చిన ఫ్యాన్ కిస్ పెట్టాలని ట్రై చేయడంతో పూనమ్ తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకు గురైంది. వెంటనే అతడిని గట్టిగా పక్కకు తోసేసింది. ఆమె ముఖంలో కనిపించిన ఆ టెన్షన్, కోపం మీడియా కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే విపరీతమైన వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వెళ్లింది.
స్క్రిప్ట్ అంటూ సెటైర్లు
సాధారణంగా ఇలాంటి పబ్లిక్ హాస్పాట్ ఘటనలు జరిగినప్పుడు సదరు మహిళా సెలబ్రిటీకి నెటిజన్ల నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. కానీ పూనమ్ పాండే విషయంలో ఇండస్ట్రీలో ఒక భిన్నమైన చర్చ నడుస్తోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను ఒక ‘స్క్రిప్టెడ్ డ్రామా’ లేదా పబ్లిసిటీ స్టంట్‌గా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఆ డ్రామాలతో
{{/usCountry}}సాధారణంగా ఇలాంటి పబ్లిక్ హాస్పాట్ ఘటనలు జరిగినప్పుడు సదరు మహిళా సెలబ్రిటీకి నెటిజన్ల నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. కానీ పూనమ్ పాండే విషయంలో ఇండస్ట్రీలో ఒక భిన్నమైన చర్చ నడుస్తోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను ఒక ‘స్క్రిప్టెడ్ డ్రామా’ లేదా పబ్లిసిటీ స్టంట్‌గా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఆ డ్రామాలతో
{{/usCountry}}పూనమ్ పాండేకు జరిగిన ఈ చేదు అనుభవం నిజమైనదే కావొచ్చు. అయినప్పటికీ, నెటిజన్లు దీనిని నమ్మకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో ఆమె సర్వికల్ క్యాన్సర్ అవేర్‌నెస్ పేరుతో తను చనిపోయినట్లు ఒక పెద్ద ఫేక్ డ్రామా ఆడి తన ఓన్ క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకుంది. అంతే కాకుండా తాను ప్రెగ్నెంట్ అని చెప్పి, ఆ తర్వాత ఏప్రిల్ ఫూల్ అనేసింది.
ఆ పాత చేదు జ్ఞాపకాల వల్లే ఇప్పుడు పూనమ్ పాండే నిజంగానే ఒక పబ్లిక్ వేధింపునకు గురైనా కూడా జనాలు దానిని కేవలం ‘పాపారాజీ ప్రాంక్’ లేదా అటెన్షన్ కోసం చేసిన ప్లాన్డ్ స్టంట్‌గా చూస్తున్నారు. సెలబ్రిటీలు పదే పదే ఫేక్ పబ్లిసిటీ స్టంట్స్ చేయడం వల్ల, భవిష్యత్తులో నిజమైన ముప్పు వచ్చినప్పుడు కూడా సమాజం ఎంత నిర్లిప్తంగా స్పందిస్తుందో చెప్పడానికి ఈ ప్రస్తుత ట్రోలింగ్ ఒక క్లాసిక్ ఉదాహరణ.