Posani Krishna Murali: ఒక్క బూతు గానీ, అసభ్య సన్నివేశం గానీ ఉండదు- పోసాని కృష్ణమురళి కామెంట్స్- ఇది పోసాని 2.ఓ!
Posani Krishna Murali In Operation Aruna Reddy Pre Release Event: టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత పోసాని కృష్ణమురళి రూపొందించిన లేటెస్ట్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ఆపరేషన్ అరుణారెడ్డి. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ అరుణారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పోసాని కృష్ణమురళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Posani Krishna Murali In Operation Aruna Reddy Pre Release Event: టాలీవుడ్ ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు అన్నీ కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం.

ఆపరేషన్ అరుణారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్
హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మంగళవారం (జూలై 14) సాయంత్రం హైదరాబాద్‌లో ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని పోసాని గారు ఎంతో ప్లానింగ్‌తో రూపొందించారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్‌లో డైలాగ్స్‌తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే ఆయన ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కథ విన్నప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనిపించింది. ఇది పోసాని గారికి 2.ఓ గా మారుతుందని చెప్పగలను" అని అన్నారు.
పోసాని 2.ఓగా ఉంటుంది
డీవోపీ సుధాకర్ మాట్లాడుతూ.. "ఇందాక మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్లు "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా పోసాని గారికి 2.ఓ అవుతుంది. ఈ సినిమాకు వర్క్ చేసేప్పుడు పోసాని గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో నాలుగేళ్లుగా ట్రావెల్ చేస్తున్నా. నాతో కలిసి ఎప్పటికీ మూవీస్ చేయాలని పోసాని గారు ఇటీవల చెప్పారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది" అని తెలిపారు.
హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ.. "ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. ఈ నెల 17న థియేటర్స్‌కు వెళ్లి మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.
వందలాది చిత్రాల్లో నటించాను
నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. "మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్‌కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. ఆయన అందించిన సహకారం వల్లే అనుకున్న టైమ్‌కు సినిమాను రిలీజ్ చేస్తున్నా. నేను రైటర్‌గా వంద చిత్రాలు రాశాను. నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను. దర్శక నిర్మాతగా సినిమాలు తెరకెక్కించాను" అని వెల్లడించారు.
"నేను చేసిన అన్ని చిత్రాల్లో ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా రూపొందించినందుకు గర్వంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు" అని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.
ఒక్క బూతు గానీ, అసభ్యమైన సన్నివేశం ఉండదు
"ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. ఎంతో సిన్సియర్‌గా ఈ సినిమాను రూపొందించాను. ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా" అని దర్శకనిర్మాత పోసాని కృష్ణమురిళి తెలిపారు.
ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "పోసాని కృష్ణమురళి నాకు మంచి మిత్రులు. ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నేనూ భాగమవ్వాలని ముందుకొచ్చా. మా కాంబినేషన్‌లో ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయబోతున్నాం. ఆపరేషన్ అరుణారెడ్డి ఒక మంచి మూవీ. మీ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


