Prabhas Fauzi: ప్రభాస్ బర్త్‌డే నాడు ఫౌజీ నుంచి వస్తున్న సర్‌ప్రైజ్ ఇదే.. బాహుబలి రేంజ్‌లో ఊహించుకోవద్దన్న నిర్మాత

Prabhas Fauzi: రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఫౌజీ' (Fauzi) చిత్రం నుంచి ప్రత్యేక అప్‌డేట్ సిద్ధమైంది. కథా నేపథ్యం, ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌ను పరిచయం చేస్తూ షార్ట్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు.

Published on: Oct 21, 2026, 17:46:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Prabhas Fauzi: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు వేడుకలకు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఉత్సాహం అంబరాన్ని తాకుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రాబోయే ప్రాజెక్ట్‌ల నుంచి వరుస అప్‌డేట్‌ల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'సీతా రామం' ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi) సినిమా నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్ రాబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

Prabhas Fauzi: ప్రభాస్ బర్త్‌డే నాడు ఫౌజీ నుంచి వస్తున్న సర్‌ప్రైజ్ ఇదే.. బాహుబలి రేంజ్‌లో ఊహించుకోవద్దన్న నిర్మాత
Prabhas Fauzi: ప్రభాస్ బర్త్‌డే నాడు ఫౌజీ నుంచి వస్తున్న సర్‌ప్రైజ్ ఇదే.. బాహుబలి రేంజ్‌లో ఊహించుకోవద్దన్న నిర్మాత

తాజాగా ఈ బర్త్‌డే ట్రీట్‌కు సంబంధించిన అధికారిక వివరాలను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ఈ మైత్రీ మూవీ మేకర్సే నిర్మించిన హారర్ చిత్రం '418' ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఈ ప్రత్యేక వీడియోను వెండితెరపై ప్రదర్శించనుండటం విశేషం.

అసలు వీడియోలో ఏముండబోతోంది? మైత్రీ నిర్మాత వ్యాఖ్యలు

మౌళి తనుజ్ హీరోగా నటించిన 'దొంగ నా కొడుకు' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్.. ప్రభాస్ 'ఫౌజీ' అప్‌డేట్‌పై స్పష్టత ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ బర్త్‌డే కానుకగా ఒక ప్రత్యేక షార్ట్ వీడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో ద్వారా సినిమా ప్లాట్ (కథా నేపథ్యం) ఏంటి? దర్శకుడు హను రాఘవపూడి ఎలాంటి ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు? ప్రభాస్ పాత్ర స్వభావం ఎలా ఉండబోతోందనే విషయాలపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని చెప్పారు. అయితే, అభిమానులు మరీ ఆకాశాన్ని తాకే రేంజ్‌లో అంచనాలు, బాహుబలి రేంజ్ లో ఊహించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేయడం గమనార్హం.

'418' థియేటర్లలో బిగ్ స్క్రీన్ సర్‌ప్రైజ్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో బిగ్ సర్‌ప్రైజ్ ఏమిటంటే.. ఈ ప్రత్యేక వీడియో గ్లింప్స్‌ను కేవలం డిజిటల్ మాధ్యమాల్లోనే కాకుండా వెండితెరపై కూడా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తొలి హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ఈ శుక్రవారం (అక్టోబర్ 23) విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

'418' సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ప్రభాస్ 'ఫౌజీ' వీడియో గ్లింప్స్‌ను పెద్ద తెరపై వేయనున్నారు. ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆస్వాదించాలనుకునే అభిమానులు వెంటనే '418' థియేటర్లకు వెళ్లాలని మేకర్స్ సూచించారు.

చారిత్రక నేపథ్యంలో 'ఫౌజీ' మ్యాజిక్

1940ల నాటి రజాకార్ల కాలం, స్వతంత్ర సమర నేపథ్యంతో ఈ చిత్రాన్ని హను రాఘవపూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. 'సీతా రామం' వంటి విజయం తర్వాత హను తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో అపారమైన అంచనాలు ఉన్నాయి.

మొత్తానికి అక్టోబర్ 23న రాబోయే ఈ స్పెషల్ వీడియో ప్రభాస్ అభిమానులకు ఎలాంటి పూనకాలు తెప్పిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More