రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు. శుక్రవారం (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది రాజా సాబ్' థియేటర్ల వద్ద అభిమానులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చూడటానికి వస్తూ ఫ్యాన్స్ తమ వెంట 'మొసళ్లను' తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అవి బొమ్మ మొసళ్లు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
థియేటర్లో మొసళ్ల గోల.. ఎందుకంటే?

మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమా ది రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ చేసిన ఈ వినూత్న స్టంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. అభిమానులు పెద్ద పెద్ద మొసలి బొమ్మలను భుజాన వేసుకుని, నినాదాలు చేస్తూ థియేటర్లలోకి పరిగెత్తడం కనిపిస్తోంది.
'ది రాజా సాబ్' ట్రైలర్‌లో ప్రభాస్ ఒక మొసలిని పట్టుకుని విసిరేసే ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్ చూసి ఇన్‌స్పైర్ అయిన ఫ్యాన్స్ ఇలా థియేటర్లకు డమ్మీ మొసళ్లతో వచ్చి హల్చల్ చేశారు. ఇది చూసిన మిగతా ఆడియెన్స్ మొదట షాక్ అయినా తర్వాత ఎంజాయ్ చేశారు.
ది రాజా సాబ్‌కు నెగటివ్ రివ్యూలు
భారీ అంచనాల మధ్య రిలీజైన ది రాజా సాబ్ సినిమాకు నెగటివ్ రివ్యూలు వస్తుండటం అభిమానులకు మింగుడు పడటం లేదు. ప్రభాస్ రేంజ్ సినిమా కాదని.. డైరెక్టర్ మారుతి దారుణంగా ఫెయిలయ్యాడని కామెంట్స్ వస్తున్నాయి. పైగా రన్ టైమ్ మూడు గంటలకుపైగా ఉండటం కూడా సినిమాకు మైనస్ గా మారింది.
ఇక బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం.. శుక్రవారం (జనవరి 9) ఉదయం నుంచే కలెక్షన్ల వర్షం మొదలైంది. ఈ రిపోర్ట్ రాసే సమయానికి ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 8.26 కోట్లు వసూలు చేసింది. ఈవెనింగ్ షోలకు ఈ నెంబర్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ది రాజా సాబ్ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ది రాజా సాబ్ కథేంటంటే?
{{/usCountry}}ఇక బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం.. శుక్రవారం (జనవరి 9) ఉదయం నుంచే కలెక్షన్ల వర్షం మొదలైంది. ఈ రిపోర్ట్ రాసే సమయానికి ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 8.26 కోట్లు వసూలు చేసింది. ఈవెనింగ్ షోలకు ఈ నెంబర్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ది రాజా సాబ్ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ది రాజా సాబ్ కథేంటంటే?
{{/usCountry}}జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడే తన అమ్మమ్మతో కలిసి ఉండే 'రాజా' (ప్రభాస్) కథ ఇది. తప్పిపోయిన తన తాతయ్యను వెతకాలని అమ్మమ్మ కోరడంతో.. రాజా ఒక పాత భవంతిలోకి అడుగుపెడతాడు. అక్కడ అతనికి ఎదురైన అతీంద్రియ శక్తులు, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ట్విస్టులే ఈ సినిమా కథ. ఇందులో ప్రభాస్ తోపాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు.