Rajesh Sharma: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ సెట్‌లో విలక్షణ నటుడు రాజేష్ శర్మకు విష పురుగు కుట్టి ఆసుపత్రి పాలయ్యారంటూ ఇటీవల వైరల్ అయిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ సెట్‌లో తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, విష పురుగు కుట్టడం వల్లే ఆసుపత్రిలో చేరాననే వార్తల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
అసలు ఆసుపత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చింది?

ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో రాజేష్ శర్మ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా పంచుకున్నారు. తను చాలా కాలంగా కుడి కాలికైన తీవ్రమైన చర్మ సమస్యతో (Skin Infection) బాధపడుతున్నట్లు తెలిపారు.
ఆ సమయంలో తనకు షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం, దాన్ని ప్రారంభంలో సరైన విధంగా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ కాస్త తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. ప్రస్తుతం కోల్ కతాలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పూర్తయిందని, త్వరలోనే డిశ్చార్జ్ అయి వారం రోజుల్లో తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేశారు.
"ప్రభాస్ టీమ్‌కు దీనితో సంబంధం లేదు!"
హైదరాబాద్‌లో ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తాను కోల్ కతా వెళ్లిన తర్వాతే పరిస్థితి దారుణంగా మారిందని రాజేష్ శర్మ తెలిపారు. విషపు పురుగు కుట్టిందంటూ తన స్నేహితురాలు, నటి సుదీప ఛటర్జీ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ పై స్పందిస్తూ.. ఆమె ఆందోళనతోనే ఆ పోస్ట్ పెట్టినప్పటికీ, ఆమెకు తప్పుడు సమాచారం అందిందని చెప్పారు.
ప్రభాస్ కానీ, ఆయన మూవీ ప్రొడక్షన్ యూనిట్ కానీ ఎవరూ ఈ విషయానికి బాధ్యులు కారని, వాళ్లంతా చాలా మంచివాళ్లని స్పష్టం చేశారు. అనవసరంగా ఈ విషయంలో ప్రభాస్ టీమ్‌ను నిందించవద్దని కోరారు.
ప్రభాస్ 'ఫౌజీ', రాజేష్ శర్మ 'హైవాన్' అప్‌డేట్స్
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' మూవీకి కూడా ప్రభాస్ లైన్ అప్ సిద్ధం చేస్తున్నారు. ఫౌజీ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. స్పిరిట్ వచ్చే ఏడాది రానుంది. ఫౌజీలో ప్రభాస్ సరసన ఇమాన్వి, స్పిరిట్ లో తృప్తి డిమ్రి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.
{{/usCountry}}హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' మూవీకి కూడా ప్రభాస్ లైన్ అప్ సిద్ధం చేస్తున్నారు. ఫౌజీ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. స్పిరిట్ వచ్చే ఏడాది రానుంది. ఫౌజీలో ప్రభాస్ సరసన ఇమాన్వి, స్పిరిట్ లో తృప్తి డిమ్రి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.
{{/usCountry}}ఇక రాజేష్ శర్మ విషయానికి వస్తే, ఆయన నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'హైవాన్' సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, సయామీ ఖేర్ ముఖ్య పాత్రల్లో నటించారు.