...
...
Next Story

Prabhas Fauzi: ప్రభాస్ ఫౌజీని టెన్షన్ పెడుతున్న నెట్‌ఫ్లిక్స్ కండిషన్.. ఆ టైమ్ లోపు రిలీజ్ చేయకపోతే డీల్ గోవిందా!

Prabhas Fauzi: ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ రిలీజ్‌కు నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ.. ఈ ఏడాది డిసెంబర్ లోపే మూవీని రిలీజ్ చేయాలన్న కండిషన్ పెట్టిందట.

Published on: Jul 3, 2026, 20:32:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prabhas Fauzi: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' రిలీజ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎలాగైనా సరే ఈ ఏడాది డిసెంబర్ లోపు థియేటర్లలోకి తీసుకురావాలని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక స్ట్రాంగ్ డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ ఒక్క కండిషన్ తో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్

Prabhas Fauzi: ప్రభాస్ ఫౌజీని టెన్షన్ పెడుతున్న నెట్‌ఫ్లిక్స్ కండిషన్.. ఆ టైమ్ లోపు రిలీజ్ చేయకపోతే డీల్ గోవిందా!
Prabhas Fauzi: ప్రభాస్ ఫౌజీని టెన్షన్ పెడుతున్న నెట్‌ఫ్లిక్స్ కండిషన్.. ఆ టైమ్ లోపు రిలీజ్ చేయకపోతే డీల్ గోవిందా!

మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫౌజీ మూవీ పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ రైట్స్ ను స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ రికార్డ్ ధరకు దక్కించుకుందట. అయితే ఈ అగ్రిమెంట్ లో సినిమాను కచ్చితంగా ఈ క్యాలెండర్ ఇయర్ పూర్తయ్యేలోపే రిలీజ్ చేయాలనే ఒక కఠినమైన కండిషన్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్ నాటికి ఫౌజీ థియేటర్లలోకి రాకపోతే ఆ నెట్‌ఫ్లిక్స్ డీల్ కు గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

దీంతో ఇప్పుడు ప్రొడక్షన్ టీమ్ మొత్తం ఫుల్ టెన్షన్ లో పడింది. సలార్, కల్కి లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగా మేకర్స్ ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఆ డెడ్‌లైన్ లోపు సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్స్ చేస్తున్నారు.

రెడీ అయిన టీజర్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే

ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఫౌజీ టీజర్ కట్ ఫైనల్ అయిపోయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ గూస్ బంప్స్ తెప్పించే టీజర్ ను రిలీజ్ చేసి, దాంతో పాటే అధికారికంగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.

డెడ్‌లైన్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు మొత్తం బాధ్యత అంతా డైరెక్టర్ హను రాఘవపూడి, అతని టీమ్ పైనే పడింది. ఒకపక్క ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోపక్క భారీ వీఎఫ్ఎక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులను టైమ్ కి పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు.

క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గకుండా టైమ్ కి సినిమాను రిలీజ్ చేసేందుకు టీమ్ అంతా పగలూ రాత్రీ కష్టపడుతోంది. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ లతో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కు భారీ బడ్జెట్ తో మంచి సపోర్ట్ ఇస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks