Prabhas Movie: షాకింగ్.. ప్రభాస్ మూవీ సెట్స్‌లో బాలీవుడ్ నటుడికి ప్రమాదం.. విషపూరితమైన కీటకం కుట్టడంతో హాస్పిటల్‌కు..

Prabhas Fauzi: ప్రభాస్ నటిస్తున్న ఓ భారీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. విషపూరితమైన కీటకం కుట్టడంతో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ హాస్పిటల్ పాలయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Jul 8, 2026, 22:05:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prabhas Fauzi: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా షూటింగ్ సెట్‌లో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్‌లో పాల్గొన్న సీనియర్ బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్ రాజేష్ శర్మ (Rajesh Sharma) ఒక విషకీటకం కాటుకు గురై ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లోని హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన కుడి కాలు మోకాలి దాకా ఇన్ఫెక్షన్ పాకడంతో పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Prabhas Fauzi: షాకింగ్.. ప్రభాస్ ఫౌజీ సెట్స్‌లో బాలీవుడ్ నటుడికి ప్రమాదం.. విషపూరితమైన కీటకం కుట్టడంతో హాస్పిటల్‌కు..
Prabhas Fauzi: షాకింగ్.. ప్రభాస్ ఫౌజీ సెట్స్‌లో బాలీవుడ్ నటుడికి ప్రమాదం.. విషపూరితమైన కీటకం కుట్టడంతో హాస్పిటల్‌కు..

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్యాకప్ అయ్యాక ఏం జరిగిందంటే?

ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నటి సుదీప ఛటర్జీ (Sudipa Chatterjee) వెల్లడించారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా రాజేష్ శర్మ ఫ్యామిలీ తరపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రభాస్ లీడ్ రోల్ లో వస్తున్న ఒక భారీ సినిమా షూటింగ్ కోసం రాజేష్ శర్మ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు.

షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత దట్టమైన చెట్లు, పొదలు ఉన్న ఒక లొకేషన్‌లో ఆయన స్థానిక టెక్నీషియన్లతో క్యాజువల్‌గా మాట్లాడుతుండగా ఒక విషపూరితమైన సాలీడు లేదా ఏదో తెలియని కీటకం ఆయన కుడి కాలు మీద కుట్టింది. ఆ టైమ్‌లో అది పెద్ద సీరియస్ కాదని లైట్ తీసుకుని ఆయన అక్కడే ఉన్నారు.

కానీ సరిగ్గా ఆరు గంటల తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన కుడి కాలు విపరీతంగా వాచిపోయి భయంకరమైన నొప్పి మొదలైంది. ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తున్నప్పటికీ, ఆయన అలాగే కోల్‌కతా వెళ్లే ఫ్లైట్ ఎక్కేశారు. ప్రయాణంలోనే ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చేసింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దాంతో మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు ఆయనను ఢాకూరియాలోని మణిపాల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.

మోకాలి దాకా పాకిన ఇన్ఫెక్షన్.. డాక్టర్ల హెచ్చరిక

హాస్పిటల్‌లో చేరి రోజు గడుస్తున్నా రాజేష్ శర్మ కండిషన్ ఇంకా విషమంగానే ఉంది. ఇన్ఫెక్షన్ కాళ్ళ వేళ్ల నుంచి మోకాలి దాకా పాకేసింది. ఆ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేసాయి. సీనియర్ డాక్టర్ అవజిత్ భట్టాచార్య పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతోంది.

ఆయన ఇంకా డేంజర్ జోన్ నుంచి బయటపడలేదని, ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ క్లాట్స్ (రక్తపు గడ్డలు) ఏర్పడే ఛాన్స్ ఉందని డాక్టర్లు టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ ఆ బ్లడ్ క్లాట్ కనుక ఊపిరితిత్తులకి పాకితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. గురువారం (జులై 9) నాడు వచ్చే అఫీషియల్ హెల్త్ బులెటిన్ తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్.. ఏ సినిమా సెట్ అది?

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో పీరియడ్ ఆర్మీ డ్రామా 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ రీసెంట్‌గా హైదరాబాద్ లోనే స్టార్ట్ అయింది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో మోస్ట్ అవేటెడ్ పోలీస్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (Spirit) కూడా లైనప్ లో ఉంది.

అయితే రాజేష్ శర్మ ఏ సినిమా సెట్‌లో ఈ ప్రమాదానికి గురయ్యాడనేది ప్రస్తుతానికి మేకర్స్ సస్పెన్స్ గా ఉంచారు. రాజేష్ శర్మ రీసెంట్‌గా హిందీలో 'భూత్ బంగ్లా', తెలుగులో 'కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్' సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేశారు. ఈ కష్టకాలంలో బెంగాలీ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ప్రొసేన్‌జిత్ ఛటర్జీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయన ఫ్యామిలీకి అండగా నిలిచారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More