...
...
Next Story

Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌పై తీవ్ర ఉత్కంఠ.. అక్టోబర్ లేక డిసెంబరా? మేకర్స్ ప్లాన్ ఏంటీ?

Fauzi Release Date: రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ విడుదల తేదీపై నెట్టింట సరికొత్త చర్చ మొదలైంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌లో వస్తుందా లేదా డిసెంబర్ 3న విడుదల కానుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఓటీటీ డీల్ ఎఫెక్ట్ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.

Published on: Jul 4, 2026, 14:38:15 IST
Advertisement

Fauzi Release Date: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టావంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది.

ఫౌజీ రిలీజ్ డేట్

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌పై తీవ్ర ఉత్కంఠ.. అక్టోబర్ లేక డిసెంబరా? ఓటీటీ డీల్ ఎఫెక్ట్! (x/hanurpudi)
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌పై తీవ్ర ఉత్కంఠ.. అక్టోబర్ లేక డిసెంబరా? ఓటీటీ డీల్ ఎఫెక్ట్! (x/hanurpudi)

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఫౌజీ చిత్రం డిసెంబర్ 3, 2026న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ తేదీపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫౌజీ మూవీ మాత్రం 2026లోనే రిలీజ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.

ఓటీటీ డీల్

ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ కోసం మేకర్స్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ను పాపులర్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. ఆ నెట్ ఫ్లిక్స్ కండీషన్ ప్రకారం ఫౌజీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాలని సమాచారం. అయితే దసరా రేసులో ఇప్పటికే భారీ సినిమాలున్నాయి.

ఆ నాలుగు సినిమాలు

2026 దసరా బాక్సాఫీస్ రేసు ఇప్పటికే హీట్ పెంచుతోంది. విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’, తలైవా రజనీకాంత్ ‘జైలర్ 2’ అఫీషియల్ గా దసరా రేసులో నిలిచాయి. ఇక చిరంజీవి మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వంభర’, నాని రా అండ్ రస్టిక్ డ్రామా ‘ది ప్యారడైజ్’ కూడా దసరాను టార్గెట్ చేశాయని అంటున్నారు.

అందుకే డిసెంబర్ లో

ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్‌లతో విపరీతమైన బిజీగా గడుపుతున్నాడు. గత మూడు నెలలుగా ఆయన ఏకధాటిగా రెండు ప్రాజెక్టుల షెడ్యూల్స్ మారుస్తూ నటిస్తున్నాడు. రాబోయే మరో నాలుగు నెలల పాటు ఆయన డైరీ పూర్తిగా లాక్ అయిపోయింది.

వేర్వేరు జానర్ల సినిమాలు కావడంతో ప్రభాస్ దీని కోసం కఠినమైన మేకోవర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. 2026లో ఆయన డేట్స్ అస్సలు ఖాళీ లేనప్పటికీ, ఈ ప్లానింగ్ అంతా సక్సెస్ అయితే 2027 ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఇయర్‌గా మారనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks