...
...
Next Story

ప్రభాస్ రేంజ్ ఇదీ.. ముంబైలో 'ఆదిపురుష్' షూటింగ్.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో వేడి వేడి భోజనం.. డైరెక్టర్‌కే షాక్

ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు.. అద్భుతమైన భోజన ప్రియుడు కూడా. తాజాగా 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అతడు.. ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ కోసం చెన్నై నుంచి ఫ్లైట్‌లో భోజనం ఎలా తెప్పించాడో ఫన్నీగా వివరించాడు.

Published on: Feb 21, 2026, 11:51:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి అతని సినిమాల తర్వాత ఎక్కువగా వినిపించే మాట.. అతని ఫుడ్ లవ్. భోజనం విషయంలో ప్రభాస్ ఎంత ఇష్టంగా ఉంటాడో.. తన సహనటులకు ఎంతలా తినిపిస్తాడో అందరికీ తెలిసిందే. ఇంటర్వ్యూలలో చాలా సిగ్గుపడుతూ, మితంగా మాట్లాడే మన డార్లింగ్.. భోజనం టాపిక్ వస్తే మాత్రం ఎంతో ఉత్సాహంగా ఓపెన్ అయిపోతాడు.

ప్రభాస్ రేంజ్ ఇదీ.. ముంబైలో 'ఆదిపురుష్' షూటింగ్.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో వేడి వేడి భోజనం.. డైరెక్టర్‌కే షాక్
ప్రభాస్ రేంజ్ ఇదీ.. ముంబైలో 'ఆదిపురుష్' షూటింగ్.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో వేడి వేడి భోజనం.. డైరెక్టర్‌కే షాక్

ఇటీవల సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటరాక్షన్‌లో ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఫుడ్ క్రేవింగ్స్ గురించి, ముఖ్యంగా తన 'చీట్ డేస్' (డైట్ పక్కనపెట్టి ఇష్టమైనది తినే రోజు)లో ఇతర రాష్ట్రాల నుంచి 'స్విగ్గీ' ద్వారా ఫుడ్ ఎలా తెప్పించుకుంటారో వివరించాడు.

ఓం రౌత్‌కు షాక్.. గంటల తరబడి నిరీక్షణ

ఈ చిట్-చాట్‌లో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. "మీకు ఏది తినాలనిపిస్తే అది ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్ చేస్తారట నిజమేనా?" అని ప్రభాస్‌ను సరదాగా అడిగాడు. దీనికి ప్రభాస్ నవ్వుతూ అవునని బదులిచ్చాడు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

"ముంబైలో 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం అది. ఆ రోజు నా చీట్ డే. డైరెక్టర్ ఓం రౌత్ నాతోనే ఉన్నాడు. అతనికి ముంబై ఫుడ్ కాకుండా, వేరే ఎక్కడి నుంచైనా స్పెషల్ ఫుడ్ తెప్పిస్తానని చెప్పాను. ముఖ్యంగా చెన్నై ఫుడ్ తినిపిస్తానని అన్నాను. నా మాట విని అతడు ఫుడ్ కోసం ఆకలితో ఎదురుచూస్తూనే ఉన్నారు.. గంటలు గడిచిపోతున్నాయి. ఈలోపు అతన్ని నేను మరేమీ తిననివ్వలేదు" అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

విమానంలో క్యారేజీ.. అసలైన రుచి కోసమే!

"ఆ మాట విని ఆయన షాక్ అయ్యారు. ముంబైలోని ఏదైనా ఒక చెన్నై రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశానని ఆయన అనుకున్నారు. కానీ ఎవరో ఒకరు చెన్నై నుంచి విమానంలో మనకోసం వేడి వేడి భోజనాన్ని క్యారేజీలో తీసుకొస్తున్నారని చెప్పాను. అది వినగానే ఓం రౌత్.. 'నా జీవితంలో నీలాంటి వాడిని ఎప్పుడూ చూడలేదు' అన్నాడు. ఆ వ్యక్తి విమానంలో క్యారేజీతో ఎక్కాడు, దాని నుంచి మసాలా వాసన వస్తున్నా సరే, ఆ ఫుడ్ చల్లారిపోకుండా వేడి వేడిగా మాకు తీసుకొచ్చాడు" అని ప్రభాస్ వివరించాడు.

ఇతర ప్రాంతాల నుంచి ఫ్లైట్‌లో భోజనం ఎందుకు తెప్పిస్తారో కూడా ప్రభాస్ వివరించాడు. "హైదరాబాద్‌లో కూడా ఆయా రకాల ఫుడ్ దొరుకుతుంది. కానీ ఆయా ప్రాంతాల నుంచి వచ్చే అసలైన రుచి ఇక్కడ మిస్ అవుతుంది. అందుకే నా చీట్ డే వచ్చినప్పుడల్లా.. ఈసారి నా భోజనం ఏ రాష్ట్రం నుంచి వస్తుందో అని మా వాళ్లు సరదాగా జోకులు వేసుకుంటారు" అని అతడు చెప్పాడు.

ప్రభాస్ రాబోయే ప్రాజెక్ట్‌లు

సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ఇటీవల సంక్రాంతి కానుకగా 'ది రాజా సాబ్' అనే హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 208 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ప్రస్తుతం ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' (Fauzi), సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' (Spirit) సినిమాలను లైన్‌లో పెట్టారు. అంతకుముందు 2024లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్‌లతో కలిసి అతడు నటించిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే గతేడాది మంచు విష్ణు సినిమా 'కన్నప్ప'లో అతిథి పాత్రలో నటించడమే కాకుండా, తేజ సజ్జా సినిమా ‘మిరాయ్’కు అతడే నెరేటర్‌గా కూడా వ్యవహరించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks