...
...
Next Story

చిన్న పిల్లాడిలా ప్రభాస్- సూపర్ స్టార్‌లా ఉండాల‌నుకోడు-సెట్ లో ఇలా: రాజాసాబ్ హీరోపై బాలీవుడ్ సీనియర్ న‌టుడు బోమన్

ది రాజా సాబ్ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు. ప్రభాస్ చిన్న పిల్లాడిలా ఉంటాడని, సూపర్ స్టార్ అనిపించుకోవాలని అనుకోడని ఇరానీ తెలిపాడు.

Published on: Jan 6, 2026, 09:58:04 IST
Advertisement

ఈ సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ పై బోమన్ ఇరానీ ప్రశంసలు కురిపించాడు.

ప్రభాస్ పై ప్రశంసలు

ప్రభాస్ పై బోమన్ ఇరానీ ప్రశంసలు
ప్రభాస్ పై బోమన్ ఇరానీ ప్రశంసలు

రీసెంట్ గా ది రాజాసాబ్ మూవీ ఈవెంట్ లో ప్రభాస్ పై బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ ప్రశంసలు కురిపించాడు. "ఆయన (ప్రభాస్)లో ఒక పెద్ద స్టార్ హోదా ఉన్నప్పటికీ, ఆయన ప్రవర్తన కూడా సూపర్ స్టార్ లా ఉంటుందని మనం ఆశిస్తాం. కానీ అది కాదు! సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభాస్ ఒక యువకుడిలా మాట్లాడతాడు. అతనిలో ఎంతో బాలుడితనం ఉంది. చిన్నపిల్లాడిలా ఉంటాడు’’ అని బోమన్ ఇరానీ అన్నాడు.

సూపర్ స్టార్ లా

‘‘ప్రభాస్ లో ఎంతో అమాయకత్వం ఉంది. అతను తన సూపర్ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తాడు. కానీ దానిని మీపై రుద్దడు. అతను మిమ్మల్ని సూపర్ స్టార్ లా చూడాలని కోరుకోడు" అని బోమన్ తెలిపాడు.

"అతను జోకులు వేయడానికి, నవ్వడానికి ఇష్టపడతాడు. అందరికంటే ముందుగా, అత్యంత గట్టిగా, ఎక్కువ సేపు నవ్వేది అతనే. తాను ఇంకా టీనేజర్ లా ఉన్నానని చెప్పినట్లుగా ఉంటుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఒక స్థాయికి చేరుకుని, ఆ అమాయకత్వాన్ని నిలుపుకున్న వ్యక్తిత్వం అది నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా" అని బోమన్ చెప్పాడు.

ది రాజా సాబ్ గురించి

ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్న హారర్ ఫాంటసీ థ్రిల్లర్ రాజా సాబ్. ఇందులో ముగ్గురు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks