సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, వెండితెరపై తమ కథను చెప్పాలని కోట్లాది మంది కలలు కంటుంటారు. కానీ, సరైన వేదిక దొరక్క ఎంతోమంది ప్రతిభావంతులు వెనకబడిపోతున్నారు. అలాంటి వారి కోసం ‘బాహుబలి’ ప్రభాస్ ఒక అద్భుతమైన మార్గాన్ని సుగమం చేశారు.
ప్రభాస్‌తో ప్రారంభం

కథకులకు, యువ దర్శకులకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ కల్పించే ఉద్దేశంతో ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ను ప్రభాస్ తాజాగా ప్రారంభించారు. దీంతో కొత్త దర్శకులకు గుడ్ న్యూస్ అందడమే కాకుండా ఇది ఒక బంపర్ ఆఫర్ అని కూడా అనుకోవచ్చు.
కథలే మీ కెరీర్‌ను మారుస్తాయి!
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. "ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనేది కేవలం ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు. ఇది మీ కథలను కెరీర్‌లుగా మార్చే వేదిక. ప్రతి గొంతుకు ఒక ఆరంభం ఉండాలి. ప్రతి కలకూ ఒక అవకాశం దక్కాలి" అని ఎంకరేజింగ్‌గా మాట్లాడారు.
అగ్ర దర్శకుల మద్దతు
థాళ్ల వైష్ణవ్, ప్రమోద్ ఉప్పలపాటి స్థాపించిన ఈ సంస్థ రచయితలు, దర్శకులకు ఒక వారధిలా నిలవబోతోందని తెలుస్తోంది. ఈ వినూత్న ప్రయత్నానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి కూడా మద్దతు పలుకుతూ భాగస్వాములయ్యారు.
సందీప్ రెడ్డి కామెంట్స్
"కాగితం మీద రాసుకున్న కథకు, తెరపై చూసే బొమ్మకు చాలా తేడా ఉంటుంది. కొత్తవారు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిం మేకింగ్ అనేది అత్యంత కీలకమైన అడుగు" అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.
అనుదీప్ అలాగే వచ్చాడు
నాగ్ అశ్విన్ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. "నేను అనుదీప్‌ను ఒక షార్ట్ ఫిలిం ద్వారానే గుర్తించాను. అలా ‘జాతిరత్నాలు’ సాధ్యమైంది. ఫిలిం స్కూల్ కంటే మీ పనితీరే మీకు గుర్తింపు తెస్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోటీ ఎలా ఉంటుంది?
{{/usCountry}}నాగ్ అశ్విన్ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. "నేను అనుదీప్‌ను ఒక షార్ట్ ఫిలిం ద్వారానే గుర్తించాను. అలా ‘జాతిరత్నాలు’ సాధ్యమైంది. ఫిలిం స్కూల్ కంటే మీ పనితీరే మీకు గుర్తింపు తెస్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోటీ ఎలా ఉంటుంది?
{{/usCountry}}ఈ ఫెస్టివల్‌లో పాల్గొనాలనుకునే వారు 2 నిమిషాలకు పైగా నిడివితో ఏ జోనర్‌లో అయినా షార్ట్ ఫిల్మ్ తీసి పంపాలి. ఈ పోటీ సుమారు 90 రోజుల పాటు సాగుతుంది. ప్రేక్షకుల ఓట్లు, లైకులు, రేటింగ్స్ ఆధారంగా ఈ పోటీలో విజేతలను నిర్ణయిస్తారు. టాప్-3 సినిమాలకు ప్రత్యేక బహుమతులతో పాటు, ఇందులోని ఎంట్రీలన్నీ ప్రముఖ నిర్మాణ సంస్థల దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది.
15 మంది ఫిల్మ్ మేకర్స్‌కు
అంతేకాకుండా, ఈ ఫెస్టివల్ భాగస్వామి అయిన ‘క్విక్ టీవీ’ (Quick TV) ఒక అడుగు ముందుకేసి, ఎంపికైన 15 మంది ఫిల్మ్ మేకర్స్‌కు గంటన్నర నిడివి గల సినిమాలను నిర్మించే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. దీనికి కావలసిన పూర్తి నిర్మాణ సహకారాన్ని వారే అందిస్తారు.
సినిమా కలను కంటున్న యువతకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఇంకెందుకు ఆలస్యం? మీలోని సృజనాత్మకతకు పదును పెట్టండి! అంటూ స్క్రిప్ట్ క్రాఫ్ట్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోటీను ప్రకటించారు.