బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ కెరీర్లో మరో అదిపెద్ద డిజాస్టర్ ది రాజా సాబ్. హారర్ కామెడీగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని ప్రభాస్ కు ఓ రికార్డు సాధించిపెట్టింది.
ది రాజా సాబ్ బాక్సాఫీస్ కలెక్షన్లు

ప్రభాస్ చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీతో ది రాజా సాబ్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైనా.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినా.. నెగటివ్ రివ్యూలతో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొత్తానికి 14వ రోజు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. వీటిలో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.142.08 కోట్లు కాగా.. గ్రాస్ 167.65 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ లో వచ్చిన రూ.34 కోట్లు కలుపుకుంటే.. మొత్తంగా గ్రాస్ రూ.201.65 కోట్లకు చేరింది.
ప్రభాస్ అరుదైన రికార్డు
ది రాజా సాబ్ తో ప్రభాస్ ఖాతాలో మరో రూ.200 కోట్ల గ్రాస్ సినిమా చేరింది. ఇప్పటికే అతని ఖాతాలో ఈ ఘనత సాధించిన ఆరు సినిమాలు ఉండగా.. ది రాజా సాబ్ తో అది ఏడుకి చేరింది. మరే తెలుగు హీరోకి సాధ్యం కాని రికార్డు ఇది. అంతెందుకు అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు మూడేసి సినిమాలతో తర్వాత స్థానంలో ఉన్నారు.
ప్రభాస్ తొలిసారి బాహుబలి 1తో ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ మూవీస్ కూడా ఈ రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దాటాయి. మధ్యలో రాధేశ్యామ్ మాత్రమే రూ.149 కోట్లతో ఈ మార్క్ కు దూరమైంది. ఇప్పుడు ది రాజా సాబ్ మరోసారి ఆ ఘనత సాధించింది. ఆ లెక్కన బాహుబలి నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒక్క సినిమా మినహాయించి ప్రభాస్ ప్రతి మూవీ రూ.200 కోట్లు దాటడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ రేంజ్ ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయి.
{{/usCountry}}ప్రభాస్ తొలిసారి బాహుబలి 1తో ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ మూవీస్ కూడా ఈ రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దాటాయి. మధ్యలో రాధేశ్యామ్ మాత్రమే రూ.149 కోట్లతో ఈ మార్క్ కు దూరమైంది. ఇప్పుడు ది రాజా సాబ్ మరోసారి ఆ ఘనత సాధించింది. ఆ లెక్కన బాహుబలి నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒక్క సినిమా మినహాయించి ప్రభాస్ ప్రతి మూవీ రూ.200 కోట్లు దాటడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ రేంజ్ ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయి.
{{/usCountry}}