ప్రభాస్ రాజా సాబ్ మూవీలోని ముగ్గురు భామలు-అందాల హీరోయిన్ల క్యారెక్టర్లు ఇవే
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాజా సాబ్ ఇవాళ రిలీజైంది. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు ఏ క్యారెక్టర్లు చేశారు? వాళ్ల పాత్రలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేయండి.
రాజా సాబ్ అంటూ హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ తో థియేటర్లలోకి వచ్చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడిపోయాయి. రాజా సాబ్ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు ఆడిపాడారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిది కుమార్ లు సినిమాలో ఏ క్యారెక్టర్ చేశారో ఓ లుక్కేయండి.

నన్ బెస్సీగా
రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్ ‘బెస్సీ’ క్యారెక్టర్ ప్లే చేసింది. ఇందులో నన్ పాత్ర పోషించింది ఈ అందాల భామ. తన డ్యూటీపై శ్రద్ధతో ఉండే ఈ అమ్మాయి ప్రభాస్ ను కలిశాక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ప్రభాస్ ప్రేమ కోసం తపిస్తుంది. ప్రభాస్ తో రొమాంటిక్ సాంగ్ లోనూ అదరగొట్టింది నిధి అగర్వాల్.
భైరవిగా మాళవిక
మరో అందాల భామ మాళవిక మోహనన్ రాజా సాబ్ సినిమాలో భైరవి క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో ఆమె ప్యాలెస్ అకౌంటెంట్, సముద్రఖని మనవరాలిగా కనిపించింది. రాజా సాబ్ లో ఆమె స్మార్ట్ లుక్ యాక్టింగ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.
రిద్ది కుమార్ అనితగా
రాజా సాబ్ మూవీలో అనితగా అదరగొట్టింది మరో హీరోయిన్ రిద్ది కుమార్. ఈ సినిమాలో మిగతా ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తో పోలిస్తే రిద్ది కుమార్ స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉంది. ఆమె ఈ మూవీలో ప్రభాస్ కజిన్ గా నటించింది.
ముగ్గురు భామలతో సాంగ్
రాజా సాబ్ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తో ఆడిపాడాడు ప్రభాస్. ‘నాచే నాచే’ సాంగ్ లో ఈ భామల అందాలు, ప్రభాస్ తో డ్యాన్స్ తెగ వైరల్ గా మారింది. ఈ ముగ్గురు రాజా సాబ్ మూవీకి గ్లామర్ అద్దడమే కాకుండా యాక్టింగ్ తోనూ అలరించారు.
రాజా సాబ్ రివ్యూ
ప్రభాస్ హీరోగా వచ్చిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ రాజా సాబ్ కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఇవాళ (జనవరి 9) రిలీజైంది. దీనికి మారుతి డైరెక్టర్. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఓ ఫన్, సరదాగా ఉండే క్యారెక్టర్ చేశాడు. వింటేజీ ప్రభాస్ ఈ సినిమాలో కనిపించాడని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. రాజా సాబ్ మూవీలో సంజయ్ దత్ కూడా కీలక పాత్ర పోషించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


