పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ కాప్ డ్రామా 'స్పిరిట్' (Spirit). ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ ఐకాన్ కాజోల్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
కరీనా ప్లేస్‌లో కాజోల్?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మూవీ అంటేనే ఎంతో ఆసక్తి రేపుతోంది. దీనికి స్పిరిట్ అనే టైటిల్, ఈ మధ్య వచ్చిన ఆడియో ఇంట్రడక్షన్ గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ఇందులో బాలీవుడ్ నటి కాజోల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మొదట బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆమె ఆ పుకార్లను ఖండించడంతో ఆ ప్రచారం సద్దుమణిగింది. ఇప్పుడు ఆ స్థానంలో సీనియర్ నటి కాజోల్‌ను తీసుకోవడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాజోల్ ఇప్పటికే కథ విన్నారని, ఆ పాత్ర పట్ల ఆమె చాలా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది.
ఒకవేళ ఇది నిజమైతే, 'స్పిరిట్' సినిమాకు ఇది అదనపు బలాన్ని చేకూరుస్తుంది. కాజోల్ వంటి స్టార్ నటి ఉండటం వల్ల సినిమాకు నార్త్ ఇండియాలో మరింత క్రేజ్ రావడమే కాకుండా, నార్త్-సౌత్ నటీనటుల కలయికతో సినిమా స్థాయి మరింత పెరుగుతుంది.
కాజోల్‌కు తొలి తెలుగు సినిమా
కాజోల్ గతంలో 'వీఐపీ 2', 'మెరుపు కలలు' వంటి తమిళ చిత్రాల్లో నటించారు. కానీ ఆమె ఇప్పటివరకు ఒక్క పూర్తి స్థాయి తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఒకవేళ 'స్పిరిట్'లో ఆమె నటిస్తే ఇదే ఆమెకు టాలీవుడ్ అరంగేట్రం అవుతుంది. ఇది కేవలం అతిథి పాత్ర కాదని, కథలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బరువైన పాత్ర అని ఇండస్ట్రీ టాక్. ఈ పాత్ర సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ను ఇస్తుందని భావిస్తున్నారు.
{{/usCountry}}కాజోల్ గతంలో 'వీఐపీ 2', 'మెరుపు కలలు' వంటి తమిళ చిత్రాల్లో నటించారు. కానీ ఆమె ఇప్పటివరకు ఒక్క పూర్తి స్థాయి తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఒకవేళ 'స్పిరిట్'లో ఆమె నటిస్తే ఇదే ఆమెకు టాలీవుడ్ అరంగేట్రం అవుతుంది. ఇది కేవలం అతిథి పాత్ర కాదని, కథలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బరువైన పాత్ర అని ఇండస్ట్రీ టాక్. ఈ పాత్ర సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ను ఇస్తుందని భావిస్తున్నారు.
{{/usCountry}}'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాజోల్ ఎంట్రీపై చిత్ర బృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.