రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. మేకర్స్ మెల్లగా సినిమా ప్రమోషన్లను పెంచారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ వచ్చింది.
ది రాజా సాబ్ సాంగ్ ప్రోమో

ది రాజా సాబ్ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా క్రిస్మస్ రోజు మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
“మెర్రీ క్రిస్మస్ డార్లింగ్స్.. మా నుంచి ఓ చిన్న ఫెస్టివ్ ట్రీట్ రాజే యువరాజే ప్రోమో. 2026 సీజన్లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ ను తీసుకురాబోతోంది. అంతే” అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ ట్వీట్ చేసింది.
ఈ ప్రోమో మొదట్లోనే శాంటా క్లాజ్ కు ప్రభాస్ పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రేయసిని వెతుకుతూ చర్చిలోకి వెళ్తారు. మీ ప్రేమ కోసం తాను ప్రేయర్ చేస్తానని అక్కడి నన్ చెబుతుంది. తమన్ అందించిన మ్యూజిక్ డిఫరెంట్ ఫీల్ తో సాగిపోయింది. ఈ మధ్యే ఈ మూవీ నుంచి సహన సహన అనే సాంగ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..
ది రాజా సాబ్ నుంచి రాజే యువరాజే ప్రోమో చూసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని ఒకరు, సూపర్ అని మరొకరు.. ఇప్పటి వరకూ రాజా సాబ్ నుంచి వచ్చిన వాటిలో బెస్ట్ అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ కూడా చెబితే బాగుండేది కదా అని ఓ అభిమాని అన్నారు. ప్రభాస్ చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కొందరు అంటున్నారు. ఇక ఈ పాటకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ను కూడా ప్రశంసిస్తూ కామెంట్స్ వస్తున్నాయి.
ది రాజా సాబ్ మూవీ గురించి..
మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీగా ఈ ది రాజా సాబ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సంక్రాంతికి రానున్న తొలి సినిమా ఇదే కాగా.. మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.
{{/usCountry}}మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీగా ఈ ది రాజా సాబ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సంక్రాంతికి రానున్న తొలి సినిమా ఇదే కాగా.. మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.
{{/usCountry}}