రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తెలుగు సహా వివిధ సినీ పరిశ్రమల ప్రముఖుల నుంచి అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దర్శకుల నుంచి తోటి నటీనటుల వరకు అతని అద్భుతమైన పర్ఫార్మెన్స్‌లకే కాకుండా, ఆ సూపర్ స్టార్ వెనుక ఉన్న వ్యక్తిత్వాన్ని కూడా మెచ్చుకుంటూ సందేశాలు పంపారు. ఇండియన్ సినిమాలో అతని ప్రయాణం, విజయాలు, అతడు చూపిన ప్రభావం గురించి వాళ్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రభాస్‌కు విషెస్ చెప్పిన రిషబ్, తేజ

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన ట్వీట్‌లో ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. "మా డార్లింగ్ ప్రభాస్ గారికి ఆశీర్వాదాలతో కూడిన పవర్ ఫుల్ ఏడాది కావాలని కోరుకుంటున్నాను. మీ అద్భుతమైన ప్రయాణంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ, స్ఫూర్తినిస్తూ ఉండండి. పుట్టినరోజు శుభాకాంక్షలు" అని రాశాడు.
ఇక హనుమాన్, మిరాయ్ నటుడు తేజ సజ్జ కూడా ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. "మా ప్రియమైన రెబల్‌స్టార్ ప్రభాస్ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ఆరా ప్రకాశిస్తూ, మీ చుట్టూ ఉన్న అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండాలి. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ గారు" అని ట్వీట్ చేశాడు.
మరో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. "నా ప్రియమైన స్నేహితుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజా సాబ్ లాగే హృదయాలను, తెరలను ఏలుతూ ఉండండి" అని ఆకాంక్షించాడు.
మంచు బ్రదర్స్ ఇలా..
కన్నప్ప స్టార్ విష్ణు మంచు ట్వీట్ చేస్తూ.. "నా బ్రదర్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ బలం, దయను కలిగి ఉండాలి. మీకు నా విధేయత జీవితాంతం ఉంటుంది. మీకు మరింత శక్తి, శాంతి లభించాలి. బాక్సాఫీస్ వద్ద థండర్ రావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ. హర హర మహాదేవ్. హ్యాపీ బర్త్ డే ప్రభాస్" అని అన్నాడు.
అతని తమ్ముడు, నటుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. "నాకు తెలిసిన అత్యంత మధురమైన వ్యక్తులలో ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరి డార్లింగ్ ప్రభాస్ బాబాయికి ఈరోజు మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రేమ, దయ, ఉదారతతో హృదయాలను గెలుచుకుంటూనే ఉంటారు. మీకు ఎప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి రెబల్ స్టార్" అని అన్నాడు.
రుక్మిణి, మాళవిక కూడా..
{{/usCountry}}అతని తమ్ముడు, నటుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. "నాకు తెలిసిన అత్యంత మధురమైన వ్యక్తులలో ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరి డార్లింగ్ ప్రభాస్ బాబాయికి ఈరోజు మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రేమ, దయ, ఉదారతతో హృదయాలను గెలుచుకుంటూనే ఉంటారు. మీకు ఎప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి రెబల్ స్టార్" అని అన్నాడు.
రుక్మిణి, మాళవిక కూడా..
{{/usCountry}}అటు సాహో, ఓజీ సినిమాల దర్శకుడు సుజీత్ ట్వీట్ చేస్తూ.. "మరొక ప్రత్యేకమైన రోజు.. ప్రభాస్ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సాహో ఎప్పటికీ టైమ్‌లెస్ గా ఉంటుంది. మీరు తీసుకొచ్చిన వైబ్, ఎనర్జీ కేవలం సినిమాను మాత్రమే కాకుండా, ఇంకా చాలా ఎక్కువే చేసింది. సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పటికీ.. నిప్పు ఇంకా ప్రకాశవంతంగా మండుతూనే ఉంది. OG ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది" అని అన్నాడు.
కాంతారా స్టార్ రుక్మిణి వసంత్ కూడా డార్లింగ్ కు విషెస్ చెప్పింది. "ప్రభాస్ సర్, పుట్టినరోజు శుభాకాంక్షలు. కాంతారా సినిమాకు నాకు శుభాకాంక్షలు చెబుతూ మీరు చేసిన స్వీట్ ఫోన్ కాల్ నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఒక అభిమానిగా మీతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని అనడం విశేషం.
మాళవిక మోహనన్ శుభాకాంక్షలు చెబుతూ.. "పుట్టినరోజు శుభాకాంక్షలు కింగ్. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీ రాబోయే సినిమాలన్నీ మెగా బ్లాక్‌బస్టర్‌లుగా మారాలని కోరుకుంటున్నాను. మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. మా సినిమాను అందరూ చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నాను" అని ట్వీట్ చేసింది.
ప్రభాస్ కెరీర్ ఇలా..
ప్రభాస్ 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించాడు. కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆ తర్వాత ఇండియన్ సినిమాలో అతిపెద్ద సూపర్ స్టార్‌లలో ఒకడిగా అతని ప్రయాణం సాగింది. 2002లో ఈశ్వర్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ప్రభాస్.. తర్వాత వర్షం, ఛత్రపతి వంటి సినిమాల ద్వారా క్రమంగా గుర్తింపు పొందాడు.
బాహుబలి సిరీస్ (2015, 2017)తో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియాకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను గెలుచుకునేలా చేసింది. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, కల్కి 2898 ఏడీ, సలార్ వంటి లేటెస్ట్ సినిమాలతో అతడు దేశమంతటా తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి సీక్వెల్ చేస్తున్నాడు.