...
...
Next Story

Preity Zinta: తండ్రి ప్రాణం కోసం సిక్సర్లు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడి కన్నీటి గాథ.. ప్రీతి జింటా ఎమోషనల్ పోస్ట్!

Preity Zinta: పంజాబ్ కింగ్స్ యువ కెరటం ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ లతో దూసుకెళ్తున్నాడు. సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. అయితే ఈ బ్యాటింగ్ వెనుక అతను మోయలేనంత భారం ఉంది. ప్రతి పరుగు వెనుక తండ్రికి సంతోషాన్ని అందించాలనే సంకల్పం ఉంది.

Published on: Apr 18, 2026, 18:01:54 IST
Advertisement

Preity Zinta: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ యంగ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చేసే ప్రతి పరుగు.. అతని తండ్రికి ఊపిరి పోస్తుంది. అతను కొట్టే ప్రతి బౌండరీ.. తన తండ్రికి ఆక్సిజన్ లా మారుతుంది. అతను బాదే ప్రతి సిక్సర్.. తన తండ్రికి మెడిసిన్ లా పని చేస్తుంది. మైదానంలో చెలరేగుతున్న ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మనసులో మోయలేనంత బాధ ఉంది.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బ్యాటింగ్

ప్రీతి జింటా ఎమోషనల్ పోస్ట్
ప్రీతి జింటా ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ 2026లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అదరగొడుతున్నాడు. రీసెంట్ గా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో కేవలం 39 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ప్రభ్‌సిమ్రాన్ ప్రదర్శనపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఈ యువ ఆటగాడి కోసం ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

కన్నీటి కథ

ప్రభ్‌సిమ్రాన్ వ్యక్తిగత జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు రాకమానవు. పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న ప్రభ్‌సిమ్రాన్ తండ్రి సర్దార్ సుర్జిత్ సింగ్ ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రి ఖర్చులు, మెడికల్ అప్పులతో కుంగిపోతున్న ఆ ఇంట్లో కేవలం ప్రభ్‌సిమ్రాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడే వెలుగు కనిపిస్తుంది.

కొడుకు ఆడుతుంటే

తీవ్రమైన అనారోగ్య సమస్యతో ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రభ్‌సిమ్రాన్ తండ్రి తన కొడుకు బ్యాటింగ్ మాత్రం మిస్ కాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉన్న సమయంలో సుర్జిత్ సింగ్ ను అతని ఫ్యామిలీ టీవీ ముందు కూర్చోబెడుతుంది. ఆ సమయంలో తన బాధనంతా మర్చిపోయి కొడుకు బ్యాటింగ్ ను సుర్జిత్ ఆస్వాదిస్తాడు. ప్రభ్‌సిమ్రాన్ సిక్సర్లు కొడితే అక్కడ ఇంట్లో సుర్జిత్ కేరింతలు కొడతాడు.

ప్రీతి జింటా ఎమోషనల్

‘‘బెంచ్‌కే పరిమితమైన రోజుల్లో కూడా ప్రభ్‌సిమ్రాన్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు, ఎప్పుడూ ప్రాక్టీస్‌కు ఆలస్యంగా రాలేదు. ఇలాంటి మంచి వ్యక్తులు విజయం సాధిస్తుంటే చూడటం చాలా సంతోషంగా ఉంది" అని ప్రీతి పేర్కొంది.

ఐపీఎల్ 2026లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇప్పటివరకూ 4 ఇన్నింగ్స్ ల్లో 211 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe