Prakash Raj: వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అతను చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై బెంగళూరులో ఆదివారం (జూన్ 14) 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులో ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు.
ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు

ఈ నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను ‘కాక్‌రోచ్ ఈజ్ బ్యాక్’ అధికారిక సోషల్ మీడియా (X) ఖాతాలో పంచుకున్నారు. ప్రసిద్ధ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో కలిసి ప్రకాష్ రాజ్ ఈ వేదికపై మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, నాయకత్వాన్ని ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టాడు.
అంకుల్స్, ఆంటీలు
"ప్రజలు ఎన్నుకున్న నాయకులు తమ పని తాము సరిగ్గా చేయాలి. మీరేమో రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని ఉద్యోగాలు చేసుకోమంటున్నారు. కానీ ఇప్పుడు దేశంలో సమీకరణాలు మారిపోయాయి. ఈ దేశ యువత తమ హక్కుల కోసం తామే స్వయంగా పోరాడాలని నిశ్చయించుకున్నారు.
దేశ యువతంతా ఒక్కటయ్యారు. రిటైర్మెంట్ వయసు దాటిపోయిన అంకుల్స్, ఆంటీలు ఇంకా ఈ దేశాన్ని పాలిస్తున్నారు. మీరు ఇక తప్పుకోండి. యువత అంతా తమ భవిష్యత్తు కోసం, తమ కలల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడుతోంది" అని ప్రకాష్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కుండపోత వర్షం
కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు నిరసన కోసం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కుకు తరలివచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఉద్యమం
{{/usCountry}}కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు నిరసన కోసం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కుకు తరలివచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఉద్యమం
{{/usCountry}}సామాజిక మాధ్యమాల వేదికగా దేశంలోని యువతను ఏకం చేస్తూ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఈ ఉద్యమాన్ని నడిపిస్తోంది. గతంలో న్యూఢిల్లీలో భారీ నిరసన చేపట్టిన ఈ సంస్థ, నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించింది. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
బెంగళూరు నిరసన కార్యక్రమానికి హాజరయ్యే ముందు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. "యువత చేస్తున్న ఈ న్యాయమైన శాంతియుత పోరాటానికి మద్దతుగా నేను బెంగళూరు వెళ్తున్నా. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, వారిని బాధ్యులను చేయడానికి ప్రతి ఒక్కరూ మాతో కలిసి రావాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: బెంగళూరులో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన సంస్థ ఏది?
జవాబు: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అక్రమాలకు వ్యతిరేకంగా 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో భారీ నిరసన జరిగింది.
ప్రశ్న: ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు?
జవాబు: ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, సామాజిక విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పాల్గొని ప్రసంగించారు.
ప్రశ్న: ప్రదర్శనకారులు ప్రధానంగా ఏ డిమాండ్ చేస్తున్నారు?
జవాబు: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలోని లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.