ప్రకాష్ రాజ్ మరోసారి చెలరేగిపోయాడు. రెహమాన్ కు మద్దతుగా మాట్లాడుతూ తనకు అస్సలు నచ్చని వారిపై ప్రతాపం చూపించాడు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘క్రిమినలైజింగ్ డిసెంట్’ (వ్యతిరేకతను నేరంగా పరిగణించడం) అనే అంశంపై మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, దానిపై వచ్చిన విమర్శలను అతడు చెప్పుకొచ్చాడు.
రెండు ఆస్కార్స్ తెచ్చిన వ్యక్తిని అలా అంటారా?

రెహమాన్ వివాదంపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "ఏఆర్ రెహమాన్ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. 'మా తుజే సలాం', 'జై హో' అంటూ దేశభక్తిని చాటారు. రెండు ఆస్కార్ అవార్డులు తెచ్చినప్పుడు మీరంతా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక నిజం చెప్పారు. గుర్తుంచుకోండి.. మీ దగ్గర పని కోసం ఆయన అడుక్కోవడం లేదు, ఆయన స్థాయి అది కాదు" అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు.
కంగనా 'ఎమర్జెన్సీ'పై సంచలన కామెంట్స్
రెహమాన్‌ను విమర్శించిన కంగనా రనౌత్‌ను ప్రకాష్ రాజ్ ఏకిపారేశాడు. "ఆయన ఒక నిజం మాట్లాడగానే కొందరు మొరగడం మొదలుపెట్టారు. ఒక లేడీ డైరెక్టర్, నటి.. కేవలం ఆయన తన సినిమాకు పనిచేయలేదని రెహమాన్‌ను 'యాంటీ నేషనల్' (దేశద్రోహి) అని పిలుస్తోంది. కంగనా రనౌత్ తన 'ఎమర్జెన్సీ' సినిమాను ఒక క్లాసిక్ అని చెప్పుకుంటోంది. కానీ అదొక ప్రాపగాండా (ప్రచార) మూవీ. అందుకే రెహమాన్ ఆ సినిమా చేయడానికి నిరాకరించారు" అని ప్రకాష్ రాజ్ మండిపడ్డాడు.
అసలేం జరిగింది?
ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్.. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' (Chhaava) మూవీ సమాజంలో చీలిక తెచ్చేలా ఉందని, బాలీవుడ్‌లో తనకు మతపరమైన కారణాలతో అవకాశాలు రావడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. దీనిపై కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్రంగా స్పందించింది.
"నేను ఒక కాషాయ పార్టీకి మద్దతు ఇస్తున్నానని ఇండస్ట్రీలో వివక్ష ఎదుర్కొంటున్నాను. కానీ మీకంటే (రెహమాన్) ద్వేషం నిండిన మనిషిని నేను చూడలేదు. నా 'ఎమర్జెన్సీ' సినిమా కథ వినడానికి కూడా మీరు నిరాకరించారు. ప్రతిపక్ష నాయకులు, విమర్శకులు కూడా నా సినిమాను మెచ్చుకున్నారు. కానీ మీరు మాత్రం ద్వేషంతో గుడ్డివారైపోయారు" అని కంగనా విమర్శించింది.
{{/usCountry}}"నేను ఒక కాషాయ పార్టీకి మద్దతు ఇస్తున్నానని ఇండస్ట్రీలో వివక్ష ఎదుర్కొంటున్నాను. కానీ మీకంటే (రెహమాన్) ద్వేషం నిండిన మనిషిని నేను చూడలేదు. నా 'ఎమర్జెన్సీ' సినిమా కథ వినడానికి కూడా మీరు నిరాకరించారు. ప్రతిపక్ష నాయకులు, విమర్శకులు కూడా నా సినిమాను మెచ్చుకున్నారు. కానీ మీరు మాత్రం ద్వేషంతో గుడ్డివారైపోయారు" అని కంగనా విమర్శించింది.
{{/usCountry}}ఈ వివాదం ముదురుతుండటంతో.. తాను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని, భారత్‌ను, సంగీతాన్ని ప్రేమిస్తున్నానని రెహమాన్ ఒక వీడియో ద్వారా స్పష్టత ఇచ్చాడు.