...
...
Next Story

అలాంటి సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు ఇస్తున్నారు.. వాళ్లకు మమ్ముట్టి విలువ తెలియదు: ప్రకాష్ రాజ్ విమర్శలు

ప్రకాష్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, నేషనల్ అవార్డుల ఎంపికపై విరుచుకుపడ్డాడు. ఆ అవార్డులు తమ వాళ్లకే ఇస్తున్నారన్నట్లుగా నేషనల్ అవార్డులు రాజీ పడ్డాయని అతడు అనడం గమనార్హం. అలాంటి వాళ్లకు మమ్ముట్టి విలువ తెలియదని అన్నాడు.

Published on: Nov 3, 2025, 19:55:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ అయిన ప్రకాష్ రాజ్ ఘాటు కామెంట్స్ చేశాడు. సోమవారం (నవంబర్ 3) సాయంత్రం 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించారు. ఈ జాబితాలో 'మంజుమ్మెల్ బాయ్స్', 'భ్రమయుగం' వంటి సినిమాలు పలు అవార్డులను గెలుచుకున్నాయి. ఈ ఏడాది అవార్డులకు జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహరించాడు. అవార్డుల ప్రకటన అనంతరం ప్రెస్ మీట్ లో అతడు నేషనల్ అవార్డులపై ఘాటు కామెంట్స్ చేశాడు.

జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

అలాంటి సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు ఇస్తున్నారు.. వాళ్లకు మమ్ముట్టి విలువ తెలియదు: ప్రకాష్ రాజ్ విమర్శలు (X/@prakashraaj)
అలాంటి సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు ఇస్తున్నారు.. వాళ్లకు మమ్ముట్టి విలువ తెలియదు: ప్రకాష్ రాజ్ విమర్శలు (X/@prakashraaj)

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా తన అనుభవాన్ని, అలాగే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మమ్ముట్టిని పట్టించుకోకపోవడంపై ప్రకాష్ రాజ్‌ ప్రశ్నించాడు. దీనికి అతడు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

"జాతీయ చలనచిత్ర అవార్డులు రాజీ పడుతున్నాయని చెప్పడానికి నేను అస్సలు సందేహించను. కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే, వారు నన్ను పిలిచినప్పుడు.. అనుభవం ఉన్న ఒక బయటి వ్యక్తి అవసరమని, తాము ఈ ప్రక్రియలో తల దూర్చబోమని, నిర్ణయాధికారం పూర్తిగా నాకే ఉంటుందని చెప్పారు" అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశాడు.

ఈ అంశంపై అతడు మాట్లాడుతూ.. "అయితే నేషనల్ అవార్డుల్లో ఇది జరగడం లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఒకే రకమైన వ్యక్తుల ఫైళ్లు, పైల్స్‌కు అవార్డులు వస్తున్నాయి. అలాంటి జ్యూరీ, అలాంటి జాతీయ ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు.. మమ్ముకా (మమ్ముట్టిని ఆప్యాయంగా పిలిచే పేరు)కు అలాంటి అవార్డులు అవసరం లేదు" అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మమ్ముట్టి రికార్డు

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గతంలో 'మథిలుకళ్', 'ఒరు వడక్కన్ వీరగాథ', 'పొంతన్ మద', 'విధేయన్', 'డా. బాబాసాహెబ్ అంబేద్కర్' వంటి చిత్రాలకుగాను ఉత్తమ నటుడి విభాగంలో మూడుసార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు.

నటుడు మోహన్‌లాల్, నటి ఊర్వశి ఆరుసార్ల చొప్పున ఈ అవార్డును గెలుచుకుని రెండో స్థానంలో ఉన్నారు. ఇక సర్వైవల్ డ్రామాగా రూపొందిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చిదంబరం ఉత్తమ దర్శకుడు అవార్డును దక్కించుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe