Prakash Raj: ఏపీ పాలిటిక్స్ లో మరోసారి పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆయన.. జనసైనికుల దాడుల గురించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు.

ఎప్పుడూ తన ఐకానిక్ హ్యాష్ ట్యాగ్ #justasking తో పొలిటికల్ లీడర్స్ ను ఇరుకున పెట్టే ప్రకాష్ రాజ్.. ఈసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పాయింట్ ను టచ్ చేస్తూ ఒక ఘాటైన ట్వీట్ చేశారు.
మీ నాన్నను చూసైనా ఆ పనులు ఆపండి
తన మొదటి ట్వీట్ లో ప్రకాష్ రాజ్ పోలీసు వ్యవస్థ గురించి చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. "పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఎన్నో ఏళ్లు సేవలు అందించిన మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో అయినా ఆలోచించండి. మీకు ఒక పవర్ ఫుల్ పదవి రాగానే, మీ పర్సనల్ ఎజెండాలు, కోరికలు తీర్చుకోవడానికి పోలీసు వ్యవస్థను వాడుకోకండి #justasking" అంటూ పవన్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకట్రావు ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసి రిటైర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కరెక్ట్ గా ఆ పాయింట్ నే బేస్ చేసుకుని ప్రకాష్ రాజ్ ఈ ఎమోషనల్, పొలిటికల్ అటాక్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం సరైంది కాదని పదే పదే అన్నారు.
ప్రశ్నిస్తే చంపేస్తారా?
ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రకాష్ రాజ్ మరో సెన్సేషనల్ ట్వీట్ వదిలారు. ఈసారి ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్ ను ట్యాగ్ చేస్తూ జనసేన క్యాడర్ పై విరుచుకుపడ్డారు.
{{/usCountry}}ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రకాష్ రాజ్ మరో సెన్సేషనల్ ట్వీట్ వదిలారు. ఈసారి ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్ ను ట్యాగ్ చేస్తూ జనసేన క్యాడర్ పై విరుచుకుపడ్డారు.
{{/usCountry}}"అసలు మీ జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఈ పనులేంటి? నిలదీసి ప్రశ్నిస్తే చంపేస్తారా? ఈ రౌడీయిజం మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా?" అంటూ ఒక పోస్ట్ ను కోట్ చేస్తూ ఫైర్ అయ్యారు.
దీనికి ఓ వీడియో కూడా యాడ్ చేశారు. “ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు.. జన సైనికులా గూండాలా.. ప్రశ్నించాడని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.. కోర్టు బెయిల్ మీద బెయిల్ ఇస్తోంది.. మీరు అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు.. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులు ఏంటి.. ప్రశ్నించేవాళ్లను ఈ జన సైనికులు చంపేస్తారా ఏంటి? కాస్త జాగ్రత్తగా ఉండండి.. దేశం చూస్తోంది” అని ప్రకాష్ రాజ్ చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
ప్రకాష్ రాజ్ వర్సెస్ జనసేన
గతంలో కూడా పలుమార్లు ఐడియాలజీ పరంగా పవన్ కళ్యాణ్ కు, ప్రకాష్ రాజ్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద కోల్డ్ వారే నడిచింది. గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలో ఉండటం, పవన్ కీలకమైన డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉండటంతో ప్రకాష్ రాజ్ విమర్శలకు నేషనల్ లెవల్ లో అటెన్షన్ దక్కుతోంది.
ప్రస్తుతం ఈ ట్వీట్స్ కి జనసేన అభిమానులు, పార్టీ శ్రేణులు తమ స్టైల్ లో కౌంటర్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్న రేంజ్ లో ట్రోలింగ్ వార్ నడుస్తోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్యలపై వస్తున్న వార్తలకు ప్రకాష్ రాజ్ ట్వీట్స్ తోడవ్వడంతో పాలిటిక్స్ మరింత కాక రేపుతున్నాయి.