Prashanth Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ ఇప్పటికే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో తారక్ క్యారెక్టరైజేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఒప్పుకోవడం ఆయన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి అని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితమే తాను ఎన్టీఆర్‌ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన కోర్ ఐడియాను చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీల్ ఏమన్నారో చూడండి.
నా కెరీర్‌లోనే 'డార్కెస్ట్' క్యారెక్టర్ ఇది
ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"ఇది కేవలం ట్రైలర్ లేదా గ్లింప్స్‌లో కనిపించే ఎలివేషన్స్ గురించి కాదు. సినిమాలో ఉండే బలమైన డ్రామా గురించి. ఇంతటి భారీ స్టార్‌డమ్ ఉన్న ఒక హీరో.. ఇలాంటి పాత్రను పోషించడానికి ఒప్పుకోవడం నిజంగా ఒక పెద్ద నిర్ణయం. సినిమా ముగిసే సమయానికి ప్రేక్షకులకు అది అర్థమవుతుంది. ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నా సినిమాల్లో నేను రాసిన అన్ని పాత్రల కంటే ఇది అత్యంత క్రూరమైన, డార్కెస్ట్ క్యారెక్టర్. బహుశా కాదు కచ్చితంగా నేను రాసిన వాటిలో ఇదే మోస్ట్ డార్క్ రోల్" అని ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బహుశా ఇదే అతిపెద్ది దేశభక్తి సినిమా
అంతేకాదు ఈ డ్రాగన్ ద్వారా ఓ అతిపెద్ద దేశభక్తి సినిమాను అందించబోతున్నట్లు కూడా ప్రశాంత్ నీల్ చెప్పడం విశేషం. నిజానికి ఆ మాట వినగానే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కూడా షాక్ తిన్నారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని అన్నారు. డ్రాగన్ ఓ దేశభక్తి మూవీ అన్న మాటే చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంది.
తారక్ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న.. 3 ఏళ్ల కసరత్తు
{{/usCountry}}అంతేకాదు ఈ డ్రాగన్ ద్వారా ఓ అతిపెద్ద దేశభక్తి సినిమాను అందించబోతున్నట్లు కూడా ప్రశాంత్ నీల్ చెప్పడం విశేషం. నిజానికి ఆ మాట వినగానే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కూడా షాక్ తిన్నారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని అన్నారు. డ్రాగన్ ఓ దేశభక్తి మూవీ అన్న మాటే చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంది.
తారక్ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న.. 3 ఏళ్ల కసరత్తు
{{/usCountry}}ఇంతటి నెగెటివ్ షేడ్స్ ఉన్న రిస్కీ క్యారెక్టర్ చేయడానికి ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నారనే విషయాన్ని కూడా దర్శకుడు వివరించారు. కథ విన్న తర్వాత ఎన్టీఆర్ పెద్దగా కండిషన్లు ఏమీ పెట్టలేదని, కానీ ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్న అడిగారని నీల్ చెప్పారు.
"ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనుక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?" అని తారక్ అడిగినట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఆ పాత్ర ప్రవర్తనను, అది చేసే పనులను జస్టిఫై చేయడానికి, దాని వెనుక ఉన్న బలమైన కారణాన్ని స్క్రీన్‌ప్లే రూపంలో తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ అండ్ టీమ్‌కు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టిందట.
ఒకసారి ఆ బలమైన కారణం, డ్రామా సిద్ధమైన తర్వాత, ఎన్టీఆర్ ఏమాత్రం వెనుకాడకుండా.. "నేను ఈ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు కూడా నీల్ చెప్పారు.
ఎన్టీఆర్ లాంటి భారీ క్రేజ్ ఉన్న గ్లోబల్ స్టార్ ఇలాంటి రిస్కీ పాత్రను పోషించడం సాధారణ విషయం కాదని, సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు తాను చెప్పిన మాటల్లోని తీవ్రత ప్రేక్షకులకు పూర్తిగా అర్థమవుతుందని, ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాదని ప్రశాంత్ నీల్ నమ్మకంగా చెప్పారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.