418 Postponed: స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418 ది మూవీ' విడుదల ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను అకస్మాత్తుగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఉత్తరాది ఎగ్జిబిటర్ల స్పెషల్ డిమాండ్.. హిందీలోనూ భారీ రిలీజ్

ఈ 418 సినిమాను అకస్మాత్తుగా వాయిదా వేయడానికి వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ఇటీవలే నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కోసం మేకర్స్ ఒక స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్, షాకింగ్ విజువల్స్ చూసి వారు ఫిదా అయిపోయారు.
కేవలం సౌత్ భాషలకే పరిమితం చేయకుండా, హిందీలో కూడా ఒకేసారి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించవచ్చని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు మేకర్స్‌కు సూచించారు. ఉత్తరాది నుంచి లభించిన ఈ ఊహించని పాజిటివ్ రెస్పాన్స్ చూసి మైత్రీ మూవీ మేకర్స్ తమ రిలీజ్ ప్లాన్‌ను పునరాలోచించుకుని మార్పులు చేసింది.
బాలీవుడ్‌లో హారర్ సినిమాలకు మైండ్ బ్లోయింగ్
ప్రస్తుతం నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర హారర్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇటీవల హిందీలో వచ్చిన హారర్ కంటెంట్ సినిమాలు వందల కోట్ల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంటెంట్ ఉన్న హారర్ చిత్రాలకు తిరుగులేకుండా పోయింది.
ఈ పాన్ ఇండియా ట్రెండ్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తోంది. సౌత్‌తో పాటు హిందీలో కూడా ఒకే రోజున గ్రాండ్‌గా ప్రమోషన్లు నిర్వహించి, పెద్ద ఎత్తున థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేయాలంటే సరైన టైమింగ్ అవసరం. అందుకే ఈ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో విడుదల తేదీని వాయిదా వేశారు.
ప్రశాంత్ నీల్ బ్రాండ్ నేమ్.. కొత్త డైరెక్టర్‌కు మైత్రీ సపోర్ట్
{{/usCountry}}ఈ పాన్ ఇండియా ట్రెండ్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తోంది. సౌత్‌తో పాటు హిందీలో కూడా ఒకే రోజున గ్రాండ్‌గా ప్రమోషన్లు నిర్వహించి, పెద్ద ఎత్తున థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేయాలంటే సరైన టైమింగ్ అవసరం. అందుకే ఈ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో విడుదల తేదీని వాయిదా వేశారు.
ప్రశాంత్ నీల్ బ్రాండ్ నేమ్.. కొత్త డైరెక్టర్‌కు మైత్రీ సపోర్ట్
{{/usCountry}}'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో మొదటి నుంచే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నూతన దర్శకుడు కీర్తన్ నాడగౌడ తెరకెక్కించిన ఈ కథ, స్క్రీన్‌ప్లే ప్రశాంత్ నీల్‌ను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆయన స్వయంగా ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించారు. సరికొత్త కాన్సెప్ట్, వెన్నులో వణుకు పుట్టించే బీజీఎంతో ఈ సినిమా రూపొందింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సరికొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.