Preity Zinta Deepfake Case: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ దుర్వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతీ జింటా (Preity Zinta) తన ప్రమేయం లేకుండా అంతర్జాలంలో సర్క్యులేట్ అవుతున్న AI డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, చాట్‌బాట్ సంభాషణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
బాంబే కోర్టుకు ప్రీతి జింటా

తన అనుమతి లేకుండా తన పేరు, రూపురేఖలు, గొంతును కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ ప్రీతి జింటా దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కేసులో ప్రీతీ జింటా గూగుల్ ఎల్‌ఎల్‌సీ (Google LLC), మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms Inc), డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లతో పాటు పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై లీగల్ యాక్షన్ తీసుకునేలా పిటిషన్ దాఖలు చేసింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తన ముఖాన్ని పోలిన అసభ్యకర మార్ఫింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
లీగల్ టీమ్ ఆరోపణలు ఏంటి?
ప్రీతీ జింటా తరఫున సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ బాంబే హై కోర్టులో వాదనలు వినిపిస్తూ కీలక అంశాలను లేవనెత్తారు. "ఏఐ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందడంతో డీప్‌ఫేక్ వీడియోలు అచ్చం నిజమైన వాటిలాగే కనిపిస్తున్నాయి. దీనివల్ల సాధారణ ప్రేక్షకులు ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించలేకపోతున్నారు.
ప్రీతీ జింటా అనుమతి లేకుండానే నకిలీ ప్రకటనలు, ప్రమోషనల్ మెటీరియల్‌కు ఆమె రూపాన్ని వాడుకుంటున్నారు. ఇది ఆమె వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కులు, ప్రైవసీ హక్కుకు పూర్తి భంగం కలిగించడమే" అని లాయర్ పేర్కొన్నారు.
లింక్ లు అందిస్తే
ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవ్ జమ్దార్ ధర్మాసనం సమక్షంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గూగుల్, మెటా తరఫు న్యాయవాదులు కోర్టుకు తమ వివరణ ఇచ్చారు. నటి ఆరోపిస్తున్న అభ్యంతరకర లేదా మార్ఫింగ్ చేసిన కంటెంట్ లింక్‌లను తమకు అందిస్తే, వాటిని వెంటనే తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కీలక ఆదేశాలు
{{/usCountry}}ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవ్ జమ్దార్ ధర్మాసనం సమక్షంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గూగుల్, మెటా తరఫు న్యాయవాదులు కోర్టుకు తమ వివరణ ఇచ్చారు. నటి ఆరోపిస్తున్న అభ్యంతరకర లేదా మార్ఫింగ్ చేసిన కంటెంట్ లింక్‌లను తమకు అందిస్తే, వాటిని వెంటనే తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కీలక ఆదేశాలు
{{/usCountry}}జస్టిస్ మాధవ్ జమ్దార్ ఒక బ్యాలెన్స్ డ్ అప్రోచ్ తో వెళ్లాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేవలం అభ్యంతరకరమైన కంటెంట్‌ను మాత్రమే తొలగించేలా, చట్టబద్ధమైన సాధారణ ఆన్‌లైన్ కంటెంట్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఒక ‘టేక్‌డౌన్ మెకానిజం’ రూపొందించాలని గూగుల్, మెటాతో పాటు పిటిషనర్ లీగల్ టీమ్‌ను కోర్టు ఆదేశించింది. ఈ ప్రతిపాదనలతో జూలై 6న తిరిగి విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
కోర్టుకెక్కిన సెలబ్రిటీలు
సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఇటీవల కాలంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి లెజెండరీ నటులు కూడా తమ పేరు, వాయిస్, ఐకానిక్ మేనరిజమ్స్‌ను ఏఐ టూల్స్ లేదా కమర్షియల్ ప్రయోజనాల కోసం నకిలీ రూపంలో వాడకుండా కోర్టుల నుంచి ఇంజంక్షన్ ఆర్డర్స్ సాధించారు.