యాక్షన్, సస్పెన్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు 'ప్రిటీ లీథల్' (Pretty Lethal) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ హాలీవుడ్ థ్రిల్లర్ ఇవాళ (మార్చి 25) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విక్కీ జూసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న సౌత్ బై సౌత్ వెస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అక్కడ ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ప్రిటీ లీథల్ ఓటీటీ

హాలీవుడ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రిటీ లీథల్’ ఈ రోజు ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. ఇంగ్లీష్ తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
మూవీ కథ
ఒక బ్యాలెట్ డ్యాన్సర్ల గ్రూప్ ఓ కాంపిటీషన్ కు వెళ్తుంటుంది. ఈ అమ్మాయిల గ్యాంగ్ ఉన్న బస్సు మధ్యలో పాడైపోతుంది. ఆ గడ్డు పరిస్థితుల్లో వారు ఒక సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాల్సి వస్తుంది.
ఒక బంగ్లాలోకి ఈ అమ్మాయిలు వెళ్తారు. అయితే, ఊహించని విధంగా ఒక సాయుధ ముఠా అమ్మాయిలను చంపాలనుకుంటుంది. అప్పుడు ఆ డ్యాన్సర్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ప్రిటీ లీథల్ సినిమా.
డ్యాన్సర్లుగా మార్షల్ ఆర్ట్స్
ఈ సినిమాలో బ్యాలెట్ డ్యాన్సర్లు తమ డ్యాన్స్ శిక్షణను యుద్ధ విద్యగా మలుచుకోవడం హైలైట్ అని చెప్పాలి. శత్రువుల నుండి తప్పించుకోవడానికి వారు చేసే విన్యాసాలు, ఎదురుదాడి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. మాడీ జీగ్లర్, లానా కాండోర్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లలో అద్భుతంగా నటించారు.
భారీ తారాగణం
ప్రముఖ నటి ఉమా థుర్మాన్ ప్రిటీ లీథల్ సినిమాలో డెవోరా కాసిమర్గా కీలక పాత్ర పోషించారు. తొలుత 'బాలెరినా ఓవర్‌డ్రైవ్' అనే పేరుతో 2023లో ప్రకటించిన ఈ చిత్రం, అనేక మార్పుల తర్వాత 'ప్రిటీ లీథల్'గా ప్రేక్షకుల ముందుకు నేరుగా ఓటీటీలో వచ్చింది. సెర్బియా, బుడాపెస్ట్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.
అమెజాన్ భారీ డీల్
{{/usCountry}}ప్రముఖ నటి ఉమా థుర్మాన్ ప్రిటీ లీథల్ సినిమాలో డెవోరా కాసిమర్గా కీలక పాత్ర పోషించారు. తొలుత 'బాలెరినా ఓవర్‌డ్రైవ్' అనే పేరుతో 2023లో ప్రకటించిన ఈ చిత్రం, అనేక మార్పుల తర్వాత 'ప్రిటీ లీథల్'గా ప్రేక్షకుల ముందుకు నేరుగా ఓటీటీలో వచ్చింది. సెర్బియా, బుడాపెస్ట్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.
అమెజాన్ భారీ డీల్
{{/usCountry}}అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ సినిమా గ్లోబల్ రైట్స్ కోసం భారీగా వెచ్చించింది. దాదాపు 11 నుండి 12 మిలియన్ డాలర్లకు అమెరికా పంపిణీ హక్కులను దక్కించుకోవడం విశేషం. ఇప్పటికే రోటెన్ టొమాటోస్ వెబ్‌సైట్‌లో ఈ చిత్రానికి 63% పాజిటివ్ రేటింగ్ లభించింది.
ఓటీటీలో ఎందుకు చూడాలి?
సస్పెన్స్, యాక్షన్ ఇష్టపడే వారికి 'ప్రిటీ లీథల్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మ్యాడీ జీగ్లర్, ఇరిస్ అపటోవ్ నటన సినిమాకు ప్రధాన బలం. సాధారణ డ్యాన్సర్లు ప్రాణాపాయ స్థితిలో ఎలా వీరోచితంగా పోరాడారు అనే అంశం ఉత్కంఠను కలిగిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో చూడాల్సిన బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి.