...
...
Next Story

Prime Video: షాకింగ్.. సూపర్ హిట్ సిరీస్ కు ఎండ్ కార్డు వేసిన ప్రైమ్ వీడియో.. ఫ్యాన్స్ కు నిరాశ

Prime Video: ప్రైమ్ వీడియో తన పాపులర్ సూపర్ హీరో సిరీస్ ను రెండు సీజన్లకే పరిమితం చేస్తూ రద్దు చేయడం షాకింగ్ మారింది. అక్టోబర్ 2025లో ఈ సిరీస్ రెండో సీజన్ ముగిసింది. ఇప్పుడీ నిర్ణయం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

Published on: Apr 25, 2026, 06:10:53 IST
Advertisement

Prime Video: ప్రైమ్ వీడియో తన పాపులర్ సూపర్ హీరో డ్రామా 'ది బాయ్స్' స్పిన్-ఆఫ్ సిరీస్ అయిన 'జెన్ వి' (Gen V)కి ముగింపు పలికింది. కేవలం రెండు సీజన్ల తర్వాత ఈ సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గాడోల్కిన్ యూనివర్సిటీ నేపథ్యంలో సాగే ఈ యువ సూపర్ హీరోల కథ ఇకపై సిరీస్‌గా కొనసాగదు.

జెన్ వి సిరీస్

సిరీస్ ను రద్దు చేసిన ప్రైమ్ వీడియో
సిరీస్ ను రద్దు చేసిన ప్రైమ్ వీడియో

జెన్ వి సిరీస్ రెండో సీజన్ అక్టోబర్ 2025లో ఓటీటీలో అదరగొట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఇప్పుడు ఈ సిరీస్ కు ఎండ్ కార్డు వేస్తున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించడం గమనార్హం.

"గాడోల్కిన్‌లో ఈ ప్రయాణాన్ని మరో సీజన్ కొనసాగించాలని మాకూ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి దీన్ని ముగిస్తున్నాం. అయితే 'జెన్ వి'లోని కీలక పాత్రలు 'ది బాయ్స్' సీజన్ 5లోనూ, ఇతర వోట్ సినిమాటిక్ యూనివర్స్ (VCU) ప్రాజెక్టులలోనూ కనిపిస్తాయి" అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఎరిక్ క్రిప్కే, ఇవాన్ గోల్డ్‌బెర్గ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

కారణాలేంటి?

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం జెన్ వి సిరీస్ కు ముగింపు పలుకుతారని ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. సిరీస్ ప్రధాన నటుల్లో ఒకరైన ఆసా జర్మన్.. పారామౌంట్ ప్లస్ రూపొందిస్తున్న 'ఫ్రిస్కో కింగ్' అనే మరో సిరీస్‌లో రెగ్యులర్ పాత్రను దక్కించుకున్నారు. దీంతో జెన్ వి మూడో సీజన్ వచ్చే అవకాశం లేదనే సంకేతాన్ని ముందే వచ్చింది.

సైకిల్ ప్రమాదంలో

2024 మార్చిలో నటుడు ఛాన్స్ పెర్డోమో మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించడం ఈ జెన్ వి సిరీస్ కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనివల్ల రెండో సీజన్ చిత్రీకరణ ఆలస్యమవ్వడమే కాకుండా, కథలో కూడా భారీ మార్పులు చేయాల్సి వచ్చింది. వ్యూయర్‌షిప్ పరంగా చూస్తే.. రెండో సీజన్ ఆరంభంలో 424 మిలియన్ నిమిషాల వీక్షణలతో టాప్ 10లో నిలిచినా, ఆ తర్వాత క్రమంగా ఆ వేగాన్ని అందుకోలేకపోయింది.

కథ ఎక్కడ ముగిసింది?

'ది బాయ్స్' మెయిన్ సిరీస్ మే 20తో ముగియనుండగా, వోట్ యూనివర్స్ మాత్రం విస్తరిస్తూనే ఉంది. 1950ల నాటి సోల్జర్ బాయ్ స్టార్మ్‌ఫ్రంట్ కథతో రానున్న వోట్ రైజింగ్ 2027లో విడుదల కానుంది.

జెన్ వి రద్దుతో ప్రైమ్ వీడియో సూపర్ హీరో యూనివర్స్‌లో ఒక శకం ముగిసినట్లయింది. అయితే ఇంటిగ్రేటెడ్ స్టోరీ టెల్లింగ్ వల్ల, సిరీస్ రద్దయినా ఆ పాత్రలు మాత్రం భవిష్యత్తు కథల్లో మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: జెన్ వి (Gen V) సీజన్ 3 ఉంటుందా?

జవాబు: లేదు, ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ను అధికారికంగా రద్దు చేసింది. కేవలం రెండు సీజన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న: జెన్ వి పాత్రలు మళ్లీ కనిపిస్తాయా?

జవాబు: అవును, ఈ పాత్రలు 'ది బాయ్స్' సీజన్ 5, భవిష్యత్తులో వచ్చే ఇతర స్పిన్-ఆఫ్ ప్రాజెక్టులలో కనిపించే అవకాశం ఉంది.

ప్రశ్న: జెన్ వి నటుడు ఛాన్స్ పెర్డోమో ఏమయ్యారు?

జవాబు: ఆయన 2024లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఆ తర్వాత ఆయన పాత్రను రీప్లేస్ చేయకుండా కథను మార్చారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks