Varanasi: వారణాసి సెట్స్‌లో 20 నిమిషాలే లంచ్ బ్రేక్.. నన్ను డైరెక్ట్ చేసిన బెస్ట్ యాక్టర్ రాజమౌళే: పృథ్వీరాజ్ సుకుమారన్
Varanasi: వారణాసి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. రాజమౌళి డైరెక్టరే కాదు బెస్ట్ యాక్టర్ అని చెప్పడంతోపాటు సినిమా షూటింగ్ సెట్స్ లో లంచ్ బ్రేక్ కేవలం 20 నిమిషాలే అంటూ షాకిచ్చాడు.
Varanasi: మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మేకింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మ్యాగ్నమ్ ఓపస్ 'వారణాసి' (Varanasi) సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే ఒక పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ ఇంటర్వ్యూలో.. నటులుగా ఉంటూ డైరెక్షన్ చేసే బెస్ట్ టాలెంట్స్ గురించి మాట్లాడుతూ రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. తన కెరీర్‌లో లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ డైరెక్షన్‌లో కొద్దిరోజులు వర్క్ చేసిన తర్వాత, మళ్లీ ఆ రేంజ్ నటుడిని తాను రాజమౌళిలోనే చూశానని పృథ్వీరాజ్ ఓపెన్ అయ్యారు.
కేవలం 20 నిమిషాల లంచ్ బ్రేక్.. జక్కన్న క్రేజీ రూల్స్
రాజమౌళి కేవలం కెమెరా వెనుక ఉండే టెక్నీషియన్ మాత్రమే కాదని, ఆయనలో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడని పృథ్వీరాజ్ కొనియాడారు. షూటింగ్ స్పాట్‌లో జక్కన్న యాక్టర్స్ నుంచి అవుట్‌పుట్ ఎలా రాబట్టుకుంటారో లైవ్ ఎగ్జాంపుల్స్‌తో వివరించారు.
'వారణాసి' సినిమా సెట్స్‌లో టైమింగ్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయో పృథ్వీరాజ్ ఈ సందర్భంగా పంచుకున్నారు. అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు కూడా రాజమౌళి టైమ్ అస్సలు వేస్ట్ చేయరని చెప్పారు.
"సెట్స్‌లో అందరికంటే ఫస్ట్ వచ్చేది రాజమౌళి సారే. అలాగే ప్యాకప్ చెప్పిన తర్వాత అందరికంటే లాస్ట్ వెళ్లేది కూడా ఆయనే. షూటింగ్ స్పాట్‌లో మాకు ఇచ్చే లంచ్ బ్రేక్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది (నవ్వుతూ). ఏదో లైఫ్ లో తన ఫస్ట్ సినిమా తీసుకుంటున్న యంగ్ డైరెక్టర్‌లాగా ఆయనలో కసి, ఎనర్జీ కనిపిస్తాయి." అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
రాజమౌళి బెస్ట్ యాక్టర్
ఈ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ తన గత ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడారు. మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'బరోజ్' (Barroz) లో తాను మొదట ఒక క్యారెక్టర్ చేయాల్సి ఉందని, కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్స్ సెట్ కాకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.
అయితే ఆ ప్రాజెక్ట్ కోసం మోహన్ లాల్ డైరెక్షన్‌లో చేసిన ఆరు ఏడు రోజుల షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఆ తర్వాత అంతటి గొప్ప నటుడిగా అనిపించిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మాత్రమేనని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు.
"రాజమౌళి సర్ సెట్స్‌లో ఏదైనా సీన్ వివరించేటప్పుడు ఆ క్యారెక్టర్‌లో లీనమై స్వయంగా యాక్ట్ చేసి చూపిస్తారు. అయితే మనం దాన్ని బ్లైండ్‌గా కాపీ కొట్టాలని ఆయన కోరుకోరు. ఆ సీన్‌కు కావాల్సిన పిచ్, ఎమోషన్ ఏ లెవెల్‌లో ఉండాలో యాక్టర్స్‌కు అర్థం కావడానికే ఆయన అలా చేసి చూపిస్తారు. అది చూశాక నటుడిగా మనం దాన్ని మన స్టైల్‌లో తిరిగి చేసి చూపించాలి" అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
రాజమౌళితో నా లోపల ఒక యుద్ధమే నడిచింది
షూటింగ్ టైమ్‌లో కొన్నిసార్లు రాజమౌళి చెప్పే ఎమోషన్స్ తనకు పీక్స్‌లో ఉన్నట్లు అనిపించేవని పృథ్వీరాజ్ చెప్పారు. ఒక్కోసారి నాలోని నటుడు ఆయన విజన్‌తో విభేదించేవాడని, లోపల ఒక పెద్ద యుద్ధమే నడిచేదని అన్నారు. కానీ రాజమౌళి లాంటి మాస్టర్ స్టోరీటెల్లర్‌ను గుడ్డిగా నమ్మడం ఒక్కటే మన పని అని తాను ఫిక్స్ అయినట్లు చెప్పారు.
"మనం లొకేషన్‌లో నటిస్తున్నప్పుడు అసలు ఆ సీన్ ఏంటనేది మనకు అర్థం కాదు. వారణాసి లాంటి భారీ కాన్వాస్ ఉన్న సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్‌ను పూర్తిగా నమ్మేయాలి. షూట్ అయిపోయాక ఎడిట్ రూమ్‌లో చూసినప్పుడు జక్కన్న విజన్ ఏంటో అర్థమై నా మైండ్ బ్లాక్ అయింది. ఆయన అనుకున్న పర్ఫెక్ట్ మీటర్‌లో సీన్ సెట్ అయింది" అని వివరించారు.
కుంభ పాత్రపై డౌట్స్.. క్లారిటీ ఇచ్చే వరకు వదలరు
సినిమాలో తన క్యారెక్టర్ అయిన 'కుంభ' (Kumbha) ప్రవర్తన గురించి రాజమౌళిని చాలా ప్రశ్నలు అడిగేవాడినని పృథ్వీరాజ్ రివీల్ చేశారు. సర్ ఈ సీన్‌లో కుంభ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదేమో అని అడిగితే.. రాజమౌళి చాలా ఓపికగా కూర్చోబెట్టి సీన్ వెనుక ఉన్న ఆలోచన విధానం మొత్తం వివరించేవారట. యాక్టర్స్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌కు ఆయన చాలా విలువ ఇస్తారని, ఒకవేళ నటుడికి ఇంకోలా చేయాలనిపిస్తే 'సరే నీ స్టైల్‌లో చేద్దాం, ఇంకో టేక్ తీసుకుందాం' అంటూ ఎంతో స్వేచ్ఛ ఇస్తారని పృథ్వీరాజ్ కొనియాడారు.
టైమ్ ఎంత అవుతుందనేది రాజమౌళి అస్సలు పట్టించుకోరని, యాక్టర్స్ నుంచి పర్ఫెక్ట్ ఎమోషన్ వచ్చే వరకు వాళ్లతోనే టైమ్ గడుపుతూ కూర్చుంటారని చెప్పారు. వారణాసి సినిమాలో మోషన్-క్యాప్చర్ లాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడుతున్నప్పటికీ, రాజమౌళి ప్రైమరీ ఫోకస్ మాత్రం నటీనటుల పెర్ఫార్మెన్స్ పైనే ఉందని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఈ సినిమా జర్నీ ముగిసేసరికి ఒక యాక్టర్‌గా, మేకర్‌గా, ఒక మంచి మనిషిగా తాను ఎంతో మారిపోయానని పృథ్వీరాజ్ ఎమోషనల్ నోట్‌తో ముగించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


