GU OTT: శాపంలో చిక్కుకునే చిన్నారి..రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్.. మోహన్ లాల్ సపోర్ట్.. వణికించే మూవీ

GU OTT: థియేటర్లలో విలక్షణమైన కాన్సెప్ట్‌తో మెప్పించిన మలయాళ ఫాంటసీ హారర్ చిత్రం 'గు' (GU) ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్స్‌పైకి వచ్చేసింది. మోహన్‌ లాల్ వాయిస్ ఓవర్ అందించిన ఈ మూవీ రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చింది? దీని ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ చూసేయండి. 

Published on: Jun 19, 2026, 05:46:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

GU OTT: మలయాళ చిత్ర పరిశ్రమ రూటెడ్ ఫోక్‌లోర్, జానపద ఆచారాలు, ఫాంటసీ హారర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి సినిమాలు తీయడంలో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది. ఆ కోవలోనే వచ్చి, విభిన్న చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న 'గు' (GU) మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లో రిలీజైన రెండేళ్ల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావడం గమనార్హం.

శాపంలో చిక్కుకునే చిన్నారి..రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్ (x/manorama_max)
శాపంలో చిక్కుకునే చిన్నారి..రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్ (x/manorama_max)

గు ఓటీటీ రిలీజ్

2024 మే నెలలో థియేటర్లలో రిలీజ్ అయి, అదే ఏడాది జూలైలో మళ్లీ రీ-రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ ‘గు’మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడీ మూవీ రెండేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు రావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇవాళ (జూన్ 19) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'మనోరమ మ్యాక్స్' లో ఈ మిస్టరీ డ్రామా అధికారికంగా ప్రసారమవుతోంది.

పూర్వీకుల ఇల్లు.. పురాతన శాపం!

మను రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ ‘గు’ చిత్రం కేరళ సంస్కృతి, పురాతన నమ్మకాల నేపథ్యంలో సాగుతుంది. మిన్నా అనే ఎనిమిదేళ్ల చిన్నారి (దేవా నంద) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సెలవుల కోసం తన పూర్వీకుల ఇళ్లకు వెళ్లిన ఆ పాప, అక్కడ ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న ఒక పురాతన శాపంలో చిక్కుకుంటుంది.

అసలు ఆ శాపం ఏంటీ? ఆ భయంకరమైన మిస్టరీని ఆ చిన్నారి ఎలా ఎదుర్కొంది? నటుడు సైజు కురుప్ పాత్ర ఇందులో ఎలా హెల్ప్ అయింది? అనేది దర్శకుడు ఉత్కంఠభరితంగా చూపించాడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌ లాల్ గంభీరమైన వాయిస్ ఓవర్ అందించడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్.

2 ఏళ్లు ఎందుకు పట్టింది?

సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్ రిలీజ్ అయిన 4 నుంచి 8 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ 'గు' సినిమా స్ట్రీమింగ్ కు రావడానికి 2024 నుంచి 2026 వరకు టైం పట్టడం వెనుక బలమైన బిజినెస్ కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి గ్లోబల్ ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ రేట్లను భారీగా తగ్గించడమే కాకుండా, కేవలం స్టార్ హీరోలు లేదా థియేట్రికల్ రన్ బాగున్న చిత్రాలనే కొనుగోలు చేస్తున్నాయి. 'గు' లాంటి కల్ట్/ఫాంటసీ ప్రయోగాలకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి సరైన వాల్యుయేషన్ దక్కలేదు.

చివరకు, మలయాళ కంటెంట్‌ను నమ్ముకునే రీజినల్ ప్లాట్‌ఫామ్ 'మనోరమ మ్యాక్స్', ఈ చిత్రం కేరళ జానపద అంశాలతో కూడి ఉండి పిల్లలకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు లాంగ్-టర్మ్ వ్యూవర్‌షిప్ ఇస్తుందని గుర్తించి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. లేట్ అయినా హోమ్ స్క్రీన్స్‌పై ఈ వీకెండ్‌కు ఇది ఒక సాలిడ్ ఆప్షన్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More