...
...
Next Story

Suyodhana Teaser: దుర్యోధనుడిలా కనిపించే ఆత్మ- కొత్త కాన్సెప్ట్‌తో ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్- సుయోధన టీజర్ అదుర్స్!

Priyadarshi Suyodhana Teaser Released: ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సుయోధన. సాయి కుమార్ కీలక పాత్ర పోషించిన సుయోధన టీజర్ ఇవాళ (మార్చి 15) విడుదల అయింది. దుర్యోధనుడు ఆత్మలా కనిపించే కొత్త కాన్సెప్ట్‌తో సుయోధన టీజర్ ఆకట్టుకుంటోంది.

Published on: Mar 15, 2026, 18:32:43 IST
Advertisement

టాలీవుడ్‌లో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా సుయోధన. ప్రియదర్శి హీరోగా ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. సుయోధన సినిమాకు వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సుయోధన టీజర్ రిలీజ్

దుర్యోధనుడిలా కనిపించే ఆత్మ- కొత్త కాన్సెప్ట్‌తో ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్- సుయోధన టీజర్ అదుర్స్!
దుర్యోధనుడిలా కనిపించే ఆత్మ- కొత్త కాన్సెప్ట్‌తో ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్- సుయోధన టీజర్ అదుర్స్!

బోసుబాబు నిడిమోలు నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సుయోధన సినిమా మార్చి 27న వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ (మార్చి 15) సుయోధన టీజర్ విడుదల అయింది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుయోధన టీజర్ అదిరిపోయింది.

దుర్యోధనుడి ఆత్మ వెంటాడటం

"ఇదొక రియల్ స్టోరీ వరుణ్" అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. హీరోను దుర్యోధనుడి ఆత్మ వెంటాడటం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రియదర్శి వెంట దుర్యోధనుడి ఆత్మ వెంటపడటం, అతనెవరో తెలుసుకునేందుకు హీరో ప్రయత్నించడం, సుయోధన అని పిలవడం వంటి సీన్లతో ఆసక్తికరంగా సాగింది.

భార్య కోసం ఎంక్వైరీ

ఓ హాస్పిటల్‌లో దుర్యోధనుడి గురించి తెలుసుకునేందుకు అతని భార్య కోసం ఎంక్వైరీ చేయడం, అసలు అతను ఎవరు?, హీరో వెంట ఎందుకు పడుతున్నాడు? ప్రియదర్శిని సుయోధన అని ఎందుకు పిలుస్తున్నాడు? అనే ఆసక్తికర అంశాలతో సుయోధన సాగినట్లు తెలుస్తోంది.

దుర్యోధనుడిగా సాయి కుమార్

కాగా సుయోధన టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అదిరిపోయాయి. జై క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమాలో దుర్యోధనుడి గెటప్‌లో సాయి కుమార్ అదరగొట్టారు. ఇదిలా ఉంటే సుయోధన టీజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్

ఎడిటర్ చోటా కె ప్రసాద్ మాట్లాడుతూ.. "ప్రియదర్శి నాకు మంచి మిత్రుడు. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నాను. మంచి సినిమాలు చేస్తూ గొప్ప స్థాయికి వచ్చాడు. ఈ సినిమా ఆయనకు మరింత పేరు తెస్తుంది" అని అన్నారు.

పోలీస్ స్టోరీ మనందరి ఫేవరెట్

"అలాగే సాయి కుమార్ గారి పోలీస్ స్టోరీ సినిమా మనందరికీ ఫేవరెట్ మూవీ. సాయికుమార్ గారిలోని డైలాగ్ డెలివరీని, పర్‌ఫార్మెన్స్‌ను ఈ సినిమాలో ఉపయోగించుకునే అవకాశం మా డైరెక్టర్ మాధవ్‌కు దక్కడం సంతోషంగా ఉంది" అని ఎడిటర్ చోటా కె ప్రసాద్ పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe