OTT: క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను చూసి చూసి మొనాటనీ వచ్చిందా? ఓటీటీలో మంచి ఫీల్ గుడ్ మూవీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ‘ప్రియమైన అంజలికి’ మూవీ మీ కోసమే. ఈ సండే రోజు స్పెషల్ గా, తక్కువ టైమ్ లో అయిపోయే మూవీ చూడాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్.
ప్రియమైన అంజలికి

తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీ ‘ప్రియమైన అంజలికి’ ఈ రోజు (జూన్ 28) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ చిత్రం డిజిటల్ ఆడియన్స్ ముందుకు నేరుగా ఓటీటీ రిలీజ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
ప్రతి సండే
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి సండే కథా సుధాలో భాగంగా ఓ చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ రోజు ‘ప్రియమైన అంజలికి’ మూవీ వచ్చింది. ఈ మూవీ నిడివి కేవలం 37 నిమిషాలే. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది.
ప్రియమైన అంజలికి స్టోరీ ఇదే
ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ మూవీ ప్రియమైన అంజలికి ఇప్పటికే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ అమ్మాయి, అబ్బాయి ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటారు. హీరోను ఆమె ప్రేమిస్తుంది. కానీ అతనికి పెద్ద ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటుంది. సినిమాలో హీరోకు పెద్ద ఫ్యామిలీనే ఉంటుంది.
ఆ ట్విస్ట్
నిజానికి హీరో ఓ అనాథ, కానీ అతనికి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. అది ఎలా సాధ్యం? పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ తన చేతిని కోసుకుని ఎందుకు చనిపోవాలనుకుంది? అనేదే ఈ ప్రియమైన అంజలికి సినిమాలో ట్విస్ట్. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా చూపించారు. మ్యూజిక్, డైలాగ్స్, హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగుందనే టాక్ వినిపిస్తోంది. స్టోరీ పాయింట్ ఫ్రెష్ గా ఉందని అంటున్నారు.
{{/usCountry}}నిజానికి హీరో ఓ అనాథ, కానీ అతనికి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. అది ఎలా సాధ్యం? పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ తన చేతిని కోసుకుని ఎందుకు చనిపోవాలనుకుంది? అనేదే ఈ ప్రియమైన అంజలికి సినిమాలో ట్విస్ట్. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా చూపించారు. మ్యూజిక్, డైలాగ్స్, హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగుందనే టాక్ వినిపిస్తోంది. స్టోరీ పాయింట్ ఫ్రెష్ గా ఉందని అంటున్నారు.
{{/usCountry}}ప్రియమైన అంజలికి సినిమాలో అభినవ్ మణికంఠ, సునీత, లిఖిత, దినేశ్ కౌశిక, వినయ్, సత్య, దేవి ప్రసాద్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు డైరెక్టర్. సండే రోజు ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునే వాళ్లు ప్రియమైన అంజలికి చిత్రంపై ఓ లుక్కేయండి.