...
...
Next Story

రాజమౌళి, మహేష్ బాబు గ్లోబ్‌ట్రాటర్‌లో మందానికినిగా ప్రియాంకా చోప్రా.. ఫస్ట్ లుక్ రిలీజ్.. చీరలో గన్ను పట్టుకొని..

ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు మూవీ గ్లోబ్‌ట్రాటర్ నుంచి మందాకినిగా ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఎల్లో శారీలో గన్ను పట్టుకొని ఆమె లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సర్‌ప్రైజ్ తో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు.

Published on: Nov 12, 2025, 19:47:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రాజమౌళి, మహేష్ బాబు గ్లోబ్‌ట్రాటర్ నుంచి అభిమానులకు మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ మధ్యే పృథ్వీరాజ్ సుకుమార్ పోషించిన కుంభ అనే విలన్ పాత్రను పరిచయం చేసిన జక్కన్న.. తాజాగా ప్రియాంకా చోప్రా పోషించిన మందాకిని పాత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

మందాకినిగా ప్రియాంకా చోప్రా

రాజమౌళి, మహేష్ బాబు గ్లోబ్‌ట్రాటర్‌లో మందానికినిగా ప్రియాంకా చోప్రా.. ఫస్ట్ లుక్ రిలీజ్.. చీరలో గన్ను పట్టుకొని..
రాజమౌళి, మహేష్ బాబు గ్లోబ్‌ట్రాటర్‌లో మందానికినిగా ప్రియాంకా చోప్రా.. ఫస్ట్ లుక్ రిలీజ్.. చీరలో గన్ను పట్టుకొని..

మహేష్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబీ 29 మూవీ నుంచి ఈ శనివారం (నవంబర్ 15) బిగ్ రివీల్ చేయనున్న నేపథ్యంలో ఆ టీమ్ నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్ ను రాజమౌళితోపాటు మూవీ టీమ్ అంతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. “గ్లోబల్ స్టేజ్ లో ఇండియన్ సినిమా అర్థాన్ని మార్చేసిన మహిళ. వెల్కమ్ బ్యాక్ దేశీ గర్ల్. ప్రియాంకా చోప్రా.. నీ మందాకిని లెక్కలేనన్ని షేడ్స్ ను ప్రపంచం చూడాలని చాలా ఆతృతగా ఉన్నాను” అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

అటు ప్రియాంకా చోప్రా కూడా తన ఫస్ట్ లుక్ ట్వీట్ చేసింది. “ఆమె కంటికి కనిపించేదాని కంటే ఎక్కువే.. మందాకినికి హలో చెప్పండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. “మొత్తానికి ఆమె వచ్చేసింది.. మందాకినిని కలవండి” అనే అన్నాడు.

గ్లోబ్‌ట్రాటర్ సెన్సేషన్

రాజమౌళి ఏం చేసినా ఓ అద్భుతమే అవుతుంది. తన సినిమాలను ప్రమోట్ చేయడంలోనూ అతడు ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తాడు. ఈ గ్లోబ్‌ట్రాటర్ విషయంలోనూ తన సస్పెన్స్ కొనసాగిస్తూ.. ఇప్పుడు ఓ బిగ్ రివీల్ అంటూ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 100 అడుగుల ఎల్ఈడీ తెరపై ఏదో పెద్ద విషయమే చెప్పబోతున్నాడు. ఈ వేడుక శనివారం (నవంబర్ 15) జరగనుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ షోని జియోహాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe