పెద్దమ్మ పాత్రలో ప్రియాంక చోప్రా.. రీల్ లైఫ్‌లో కాదు రియల్ లైఫ్ క్యారెక్టర్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్
తన కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులకు మగబిడ్డ పుట్టిన సందర్భంగా ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తెగ సంతోషం వ్యక్తం చేశారు. ఇతర బాలీవుడ్ సెలబ్రిటీల రియాక్షన్స్ కూడా వైరల్ గా మారాయి.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పెద్దమ్మగా కొత్త రోల్ పోషించబోతున్నారు. అది రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో. ఆమె కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా తల్లి కావడమే అందుకు కారణం. నటి పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా తమ జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టారు. ఈ జంట తమ మొదటి బిడ్డ, ఒక అబ్బాయికి స్వాగతం పలికారు.

ఆనందంలో ప్రియాంక
పరిణీితి చోప్రా, రాఘవ్ చద్దాకు బాబు పుట్టాడనే వార్తతో ప్రియాంక చోప్రా సంతోషంలో తేలిపోతుంది. ఎంతో ఉత్సాహంగా ఉన్న పెద్దమ్మ ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పరిణీతి చోప్రా, రాఘవ్‌ల ప్రకటన పోస్ట్‌ను షేర్ చేసి, ఆ జంటకు "కంగ్రాచ్యులేషన్స్" అని రాసి అభినందనలు తెలిపారు. ఆమె తన అంకుల్, ఆంటీ అయిన రీనా, పవన్ చోప్రాలను కూడా ట్యాగ్ చేసి, మొత్తం కుటుంబానికి తన ప్రేమను పంపింది.

అమ్మమ్మ కామెంట్
పరిణీతి, రాఘవ్ ఆదివారం (అక్టోబర్ 20) నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ శుభవార్తను ప్రకటించారు. వారి పోస్ట్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల నుండి వచ్చిన అభినందన సందేశాలతో నిండిపోయింది. అమ్మమ్మ రీనా చోప్రా కూడా కామెంట్ సెక్షన్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. "మేము చాలా ఆనందంగా ఉన్నాము, దేవునికి కృతజ్ఞతలు!! మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము!! మీ అందరినీ చాలా ప్రేమిస్తున్నాము. మమ్మల్ని తాతయ్య, అమ్మమ్మలను చేసినందుకు ధన్యవాదాలు" అని ఆమె రాశారు.
సెలబ్రిటీల రియాక్షన్
నటి జెన్నిఫర్ వింగెట్ ఏమో "హే! హే! కంగ్రాచ్యులేషన్స్! మీకు నా ప్రేమ, ఆలింగనాలు పంపుతున్నాను" అని రాయగా, హర్లీన్ సేథి "కంగ్రాచ్యులేషన్స్" అని పంచుకుంది. కృతి సనన్, ఆయుష్మాన్ ఖురానా కూడా కామెంట్ సెక్షన్‌లో "కంగ్రాచ్యులేషన్స్" అని రాశారు. భూమి పెడ్నేకర్ "కంగ్రాచ్యులేషన్స్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా" అని షేర్ చేసింది.
అబ్బాయి వచ్చేశాడు
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా తమ బాబు రాకను ప్రకటించారు. ఆదివారం పరిణీతి, రాఘవ్ తమ బాబు పుట్టిన వార్తను ప్రకటించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉమ్మడి నోట్‌ను పంచుకున్నారు. ఆ నోట్‌లో, "అతను చివరకు వచ్చేశాడు! మా అబ్బాయి" అని ఉంది. "అతను రాకముందు జీవితం ఎలా ఉండేదో మేము నిజంగా గుర్తుచేసుకోలేకపోతున్నాము! చేతులు నిండుగా ఉన్నాయి, మా హృదయాలు మరింత నిండుగా ఉన్నాయి. మొదట మాకు మేము ఉన్నాము, ఇప్పుడు మాకు సర్వస్వం ఉంది" అని ఆ నోట్‌లో జతచేశారు.
పరిణీతి, రాఘవ్‌లకు మే 2023లో న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో వారు వివాహం చేసుకున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


