...
...
Next Story

Priyanka Chopra: కేన్స్ లయన్స్ వేడుకల్లో ప్రియాంకా చోప్రా డ్రెస్సుల రేటు తెలిస్తే షాకే.. ఆ రెండు డిజైన్ల సీక్రెట్ ఇదీ

Priyanka Chopra: ప్రియాంకా చోప్రా మరోసారి ఇంటర్నేషనల్ వేదికపై తన గ్లామర్ తో అభిమానులను ఫిదా చేసింది. అయితే దీనికోసం ఆమె ధరించిన రెండు డ్రెస్సుల ధర అంతకంటే ఎక్కువ షాక్ కు గురి చేస్తోంది.

Published on: Jun 25, 2026, 13:23:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Priyanka Chopra: గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా జోనస్ ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 'కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ 2026' (Cannes Lions 2026) వేడుకల్లో తన అవుట్‌ఫిట్స్‌తో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ స్టేజ్‌పై అడుగుపెట్టిన ప్రతిసారీ తన గ్లామర్, కాన్ఫిడెన్స్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేయడం ప్రియాంకకు అలవాటే.

Priyanka Chopra: కేన్స్ లయన్స్ వేడుకల్లో ప్రియాంకా చోప్రా డ్రెస్సుల రేటు తెలిస్తే షాకే.. ఆ రెండు డిజైన్ల సీక్రెట్ ఇదీ
Priyanka Chopra: కేన్స్ లయన్స్ వేడుకల్లో ప్రియాంకా చోప్రా డ్రెస్సుల రేటు తెలిస్తే షాకే.. ఆ రెండు డిజైన్ల సీక్రెట్ ఇదీ

ఈ గ్లోబల్ ఈవెంట్ డే 3 సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ధరించిన రెండు డిఫరెంట్ ఫ్లోర్-లెంత్ డ్రెస్సులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ద్వయం వేమన్, మైకా ఈ రెండు లుక్స్‌ను ఎంతో పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. ఈ డ్రెస్సుల డిజైన్ తో పాటు వాటి రేట్లు వింటే సామాన్యుల గుండె గుభేల్ అనడం ఖాయం.

కలర్‌ఫుల్ సిల్క్ శాటిన్ డ్రెస్.. ధర ఏకంగా రూ. 1.8 లక్షలు

ఫెస్టివల్‌లో భాగంగా జరిగిన ఒక ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొనడానికి ప్రియాంకా చోప్రా ‘సిల్వియా చెరాసి డిక్సన్’ (Silvia Tcherassi Dixon) బ్రాండ్‌కు చెందిన ఒక అద్భుతమైన మల్టీ కలర్ స్లిప్ డ్రెస్సులో మెరిసింది. సోషల్ మీడియా ఫ్యాషన్ పేజీల సమాచారం ప్రకారం ఈ సింగిల్ లాంగ్ గౌన్ విలువ అక్షరాలా రూ. 1,81,200 అని తెలుస్తోంది. దీనికి కాంబినేషన్‌గా ఆమె ధరించిన ‘ఫ్రెడ్యా సాల్వడార్ కాట్’ లెదర్ థాంగ్ శాండల్స్ ధర 378 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 35,634 పైనే ఉంటుంది.

ఇక అదే రోజున మరో ఈవెంట్ కోసం ప్రియాంక పూర్తి వింటేజ్ స్టైల్‌లోకి మారిపోయింది. ‘న్యూ స్టూడియో హెలోయిస్’ (Nue Studio Heloïse) కలెక్షన్ నుంచి బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ ప్రింట్స్ ఉన్న ఒక మోనోక్రోమ్ హాల్టర్ గౌన్‌ను సెలెక్ట్ చేసుకుంది. ఈ క్లాసిక్ డ్రెస్ రేటు దాదాపు 1,250 యూరోలు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1,34,476 ఉంటుంది. దీనికి అదనపు అట్రాక్షన్‌గా క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ సరికొత్త సమ్మర్ 2026 కలెక్షన్ నుంచి ఒక వింటేజ్ డార్క్ బర్గండీ రెడ్ కలర్ డియోర్ బ్యాగ్‌ కూడా పట్టుకెళ్లింది.

ఏంటి ఈ కేన్స్ లయన్స్ ఫెస్టివల్?

ఫ్రాన్స్‌లోని కేన్స్ సిటీలో గల ‘పలైస్ డెస్ ఫెస్టివల్స్ ఎట్ డెస్ కాంగ్రెస్’ వేదికగా ప్రతి ఏడాది జూన్ లో ఈ ఐదు రోజుల ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. గ్లోబల్ మార్కెటింగ్, క్రియేటివ్ కమ్యూనిటీ రంగానికి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ గాదరింగ్ ఈవెంట్ ఇది.

ఈ వారం రోజుల్లో వేర్వేరు కేటగిరీల్లో అవార్డుల ప్రదానోత్సవంతో పాటు గ్రాండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ గాలా ఈవెంట్స్ జరుగుతాయి. మన దేశం నుంచి రీసెంట్‌గా బిలియనీర్ ఇషా అంబానీ కూడా తన వైబ్రెంట్ రెడ్ డ్రెస్, తల్లి నీతా అంబానీ రాయల్ జ్యువెలరీతో ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా గ్లోబల్ ప్రాజెక్ట్స్ 'ది బ్లఫ్', 'హెడ్స్ ఆఫ్ స్టేట్' షూటింగ్స్ ముగించుకుని ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe