...
...
Next Story

Priyanka Chopra: ఆ విషయంలో నాకంటే మా ఆయనే ఫాస్ట్.. బ్రేకప్స్ అప్డేట్స్ అన్నీ ముందే తెలుస్తాయి: నిక్‌పై ప్రియాంకా చోప్రా

Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గాసిప్స్ విషయంలో చాలా స్లో అట. ఈ విషయంలో తన కంటే తన భర్త నిక్ జోనస్ చాలా ఫాస్ట్ అని, బాలీవుడ్ లో ఎవరు ఎవరితో ప్రేమలో ఉన్నారు.. ఎవరు విడిపోయారన్నది అతడే తనకు చెబుతాడని ఆమె వెల్లడించడం విశేషం.

Published on: Jul 15, 2026 01:51 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తన భర్త, పాప్ సింగర్ నిక్ జోనస్ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీల మధ్య బ్రేకప్ అయింది, అసలు అక్కడ ఏం జరుగుతోందనే గాసిప్స్ తనకంటే ముందే నిక్ తెలుసుకుని తనకు చెప్తాడంటూ ప్రియాంక బాంబు పేల్చింది. జోనస్ బ్రదర్స్ హోస్ట్ చేసిన 'హే జోనస్' పాడ్‌కాస్ట్‌లో ఈ క్రేజీ జంట ఈ విషయాలను బయటపెట్టింది.

నాకంటే నిక్‌కే ఎక్కువ తెలుసు!

Priyanka Chopra: ఆ విషయంలో నాకంటే మా ఆయనే ఫాస్ట్.. బ్రేకప్స్ అప్డేట్స్ అన్నీ ముందే తెలుస్తాయి: నిక్‌పై ప్రియాంకా చోప్రా
Priyanka Chopra: ఆ విషయంలో నాకంటే మా ఆయనే ఫాస్ట్.. బ్రేకప్స్ అప్డేట్స్ అన్నీ ముందే తెలుస్తాయి: నిక్‌పై ప్రియాంకా చోప్రా

ఈ పాడ్‌కాస్ట్‌లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. తను గత ఎనిమిదేళ్లుగా ప్రియాంకతో కలిసి ఉంటున్న టైమ్‌లో బాలీవుడ్ గాసిప్స్‌ను ఫాలో అవ్వడం బాగా అలవాటు చేసుకున్నానని నవ్వుతూ చెప్పాడు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. "ఇది అక్షరాలా నిజం, నాకంటే ఎక్కువ విషయాలు నిక్‌కే తెలుసు. నేను ఎవరికైనా మెసేజ్ చేస్తూ వాళ్ల పార్ట్‌నర్ గురించి అడిగితే.. వెంటనే నిక్ జోక్యం చేసుకుని వాళ్లిద్దరికీ ఎప్పుడో బ్రేకప్ అయిపోయిందని హింట్ ఇస్తాడు" అని చెప్పుకొచ్చింది.

నిక్ జోనస్ ఈ బాలీవుడ్ సీక్రెట్స్ కోసం కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నాడట. హాలీవుడ్‌లో సెలబ్రిటీ గాసిప్స్ లీక్ చేసే 'DeuxMoi' తరహాలోనే బాలీవుడ్‌కు సంబంధించిన సీక్రెట్ అకౌంట్లను తను 'ఘోస్ట్ ఫాలో' (వేరే పేరుతో ఫాలో అవ్వడం) చేస్తానని నిక్ ఒప్పుకున్నాడు. అందులో వచ్చే ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్స్ ట్రాక్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

బాలీవుడ్ లో ఆ ఎక్స్‌ట్రా పనులు

పాడ్‌కాస్ట్ లో ప్రియాంక నవ్వుతూ "అయ్యో దేవుడా, నన్ను ఎలాంటి వివాదాల్లో నెట్టకు" అంటూ భర్తను వారించే ప్రయత్నం చేసింది. కానీ నిక్ ఏమాత్రం తగ్గకుండా.. బాలీవుడ్ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, అక్కడ కొందరు పెళ్లయ్యాక కూడా చేసే 'ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్' (వ్యక్తిగత అఫైర్స్) ట్రాక్ చేయడం తనకు భలే తమాషాగా అనిపిస్తుందని చెప్పాడు. దీనికి ప్రియాంక కూడా ఏకీభవిస్తూ, ఒకే వ్యక్తికి చాలా యాక్టివిటీస్ ఉన్న కేసుల గురించి మాట్లాడుకున్నామని హింట్ ఇచ్చింది.

ఈ క్రేజీ కపుల్ లవ్ స్టోరీ 2017లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అదే ఏడాది వానిటీ ఫెయిర్ ఆస్కార్స్ ఆఫ్టర్ పార్టీలో కలిశారు. 2018 జులై 19న గ్రీస్‌లోని క్రేట్ ఐలాండ్‌లో నిక్ ప్రియాంకకు ప్రపోజ్ చేశాడు. అదే ఏడాది చివర్లో ఉదయ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో వీళ్ల గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. జనవరి 2022లో సరోగసీ ద్వారా వీరికి మాల్తీ మేరీ చోప్రా జోనస్ జన్మించింది.

ప్రస్తుతం ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్స్ 'ది బ్లఫ్', 'హెడ్స్ ఆఫ్ స్టేట్' సినిమాలతో బిజీగా ఉంది. అటు నిక్ జోనస్ తన వరల్డ్ టూర్స్, సరికొత్త మ్యూజిక్ ఆల్బమ్స్‌తో బిజీగా గడుపుతున్నాడు. ఈ బిజీ లైఫ్‌లో కూడా నిక్ జోనస్ ఇలా బాలీవుడ్ గాసిప్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe