అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో విడుదల కానున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కొత్త సినిమా 'ది బ్లఫ్' (The Bluff) ప్రమోషన్స్‌లో ఆమె భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనస్ సందడి చేశాడు. ప్రియాంక పాత్రకు తగ్గట్లుగా ఒక కాక్‌టెయిల్ తయారు చేసిన అతడు.. చేతికి మంగళసూత్రాన్ని బ్రేస్‌లెట్‌గా ధరించి ఇండియన్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నారు. ఈ సినిమా కథ, ఇతర స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
ది బ్లఫ్ మూవీ విశేషాలు

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా యాక్షన్-అడ్వెంచర్ మూవీ 'ది బ్లఫ్'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె భర్త నిక్ జోనస్ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ పేరు 'బ్లడీ మేరీ' (Bloody Mary) కావడంతో, దానికి అనుగుణంగా అతడు స్వయంగా ఒక స్పెషల్ కాక్‌టెయిల్ తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
"అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తున్న ప్రియాంక మూవీ 'ది బ్లఫ్' ప్రీమియర్ ఇది. సినిమా అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికే రెండుసార్లు చూశాను. ఇందులో ఆమె క్యారెక్టర్ పేరు బ్లడీ ఎం.. అందుకే నేను బ్లడీ మేరీ కాక్‌టెయిల్ చేస్తున్నాను" అని నిక్ ఆ వీడియోలో తెలిపాడు. ప్రియాంక వ్యక్తిత్వానికి సరిపోయేలా అతడు ఆ డ్రింక్‌లో కొంచెం టబాస్కో కూడా కలిపాడు. ఆ తర్వాత ఆ డ్రింక్‌ను ప్రియాంకకు ఇవ్వగా, ఆమె దాన్ని రుచి చూసి "నీ రెసిపీలు ఎప్పుడూ బెస్ట్" అని ప్రశంసించాడు.
చేతికి మంగళసూత్రం బ్రేస్‌లెట్..
అయితే ఈ వీడియో చూసిన అభిమానుల దృష్టిని మరొక విషయం బాగా ఆకర్షించింది. నిక్ జోనస్ తన చేతికి భారతీయ సంప్రదాయానికి ప్రతీక అయిన ‘మంగళసూత్రాన్ని’ బ్రేస్‌లెట్‌గా ధరించడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా రెడ్ కార్పెట్ ప్రీమియర్‌లో కూడా అతడు ఇదే బ్రేస్‌లెట్‌తో కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
"మన నిక్ జిజు (బావగారు) చేతికి మంగళసూత్రం బ్రేస్‌లెట్ చూశారా.. ఆయన బెస్ట్" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఆ మంగళసూత్రాన్ని గమనిస్తే, నిక్ జిజు ఒక గ్రీన్ ఫారెస్ట్ లాంటి వారని అర్థమవుతుంది" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రియాంక మంగళసూత్రాన్ని ఆయన బ్రేస్‌లెట్‌గా ధరించిన విధానం అద్భుతం" అంటూ ప్రియాంక సంస్కృతి పట్ల ఆయన చూపిస్తున్న గౌరవానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
'ది బ్లఫ్' స్టోరీ..
{{/usCountry}}"మన నిక్ జిజు (బావగారు) చేతికి మంగళసూత్రం బ్రేస్‌లెట్ చూశారా.. ఆయన బెస్ట్" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఆ మంగళసూత్రాన్ని గమనిస్తే, నిక్ జిజు ఒక గ్రీన్ ఫారెస్ట్ లాంటి వారని అర్థమవుతుంది" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రియాంక మంగళసూత్రాన్ని ఆయన బ్రేస్‌లెట్‌గా ధరించిన విధానం అద్భుతం" అంటూ ప్రియాంక సంస్కృతి పట్ల ఆయన చూపిస్తున్న గౌరవానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
'ది బ్లఫ్' స్టోరీ..
{{/usCountry}}'ది బ్లఫ్' విషయానికొస్తే.. ఇది 19వ శతాబ్దం చివర్లో కరేబియన్ నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్. ఇందులో ప్రియాంక 'ఎర్సెల్ - బ్లడీ మేరీ బాడెన్' అనే మాజీ పైరేట్ క్వీన్ పాత్రలో నటిస్తోంది. తన హింసాత్మక గతాన్ని వదిలేసి, ఒక మారుమూల ద్వీపంలో తన కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని ఆమె అనుకుంటుంది.
కానీ పాత పగలు, దొంగతనానికి గురైన బంగారం కోసం ఆమె పాత క్రూ మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పుడు ఆమె తన గతాన్ని ఎలా ఎదుర్కొంది? తన మాజీ కెప్టెన్ అయిన 'కెప్టెన్ కానర్'తో జరిగిన ఆధిపత్య పోరులో ఎలా నెగ్గింది? అనేది ఈ సినిమా కథ.
ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అతడు, జో బల్లారిని కలిసి స్క్రిప్ట్ అందించారు. ఇందులో కెప్టెన్ కానర్‌గా కార్ల్ అర్బన్ నటించగా.. ఇస్మాయిల్ క్రజ్ కార్డోవా, సఫియా ఓక్లీ-గ్రీన్, టెమురా మోరిసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.