The Bluff OTT: ఓటీటీని షేక్ చేస్తున్న ప్రియాంక చోప్రా థ్రిల్లర్.. ఎగబడి చూసేస్తున్న జనాలు.. అత్యధిక మంది చూసిన సినిమా
The Bluff OTT: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది బ్లఫ్’. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైన ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. అత్యధిక మంది చూసిన ఒరిజినల్ సినిమాగా ఓటీటీని షేక్ చేస్తోంది.
ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. అత్యధిక మంది చూసిన ఒరిజినల్ ఫిల్మ్ గా ది బ్లఫ్ నిలిచింది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాను జనాలు తెగ చూసేస్తున్నారు.

ది బ్లఫ్ ఓటీటీ
వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ మూవీ ‘ది బ్లఫ్’. ఈ పైరేట్ అడ్వెంచర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో 'బ్లడీ మేరీ'గా ప్రియాంక చోప్రా అదరగొట్టింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న ఓటీటీలో రిలీజైంది. ఒరిజినల్ ఫిల్మ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది ది బ్లఫ్ మూవీ.
మోస్ట్ వాచ్డ్
ది బ్లఫ్ మూవీకి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. అయినా ఓటీటీలో ఈ సినిమాను ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు ఓటీటీలో అత్యధిక మంది చూసిన ఒరిజినల్ మూవీగా ది బ్లఫ్ నిలిచింది. 'వెరైటీ' ప్రకారం 'ది బ్లఫ్' సినిమాకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు 300.3 మిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చాయి.
టాప్ లో
ఓటీటీలో 'స్ట్రీమింగ్ ఒరిజినల్స్: ఫిల్మ్' చార్ట్‌లో ది బ్లఫ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ‘అక్యూజ్డ్’ సినిమా రెండో ప్లేస్ లో ఉంది. ఫిబ్రవరి 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘అక్యూజ్డ్’ మూవీకి అనుభూతి కశ్యప్ డైరెక్టర్. ఈ చిత్రం 213.1 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది.
డేవిడ్ విక్టోరీ దర్శకత్వంలోని 'ఫైర్‌బ్రేక్' (నెట్‌ఫ్లిక్స్- 177.2 మిలియన్), మోర్గాన్ నెవిల్లే దర్శకత్వం వహించిన 'పాల్ మెక్‌కార్ట్నీ: మ్యాన్ ఆన్ ది రన్' (అమెజాన్ ప్రైమ్ వీడియో- 156.2 మిలియన్), ఏంజెల్ మాన్యుయెల్ సోటో దర్శకత్వంలోని 'ది వ్రెకింగ్ క్రూ' (ప్రైమ్ వీడియో- 110.6 మిలియన్) వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి.
ఫ్యాన్స్ రియాక్షన్
ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాగా ‘ది బ్లఫ్’ కొనసాగుతుండటంతో ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘‘ఆమె (ప్రియాంక చోప్రా) దీనికి పూర్తిగా అర్హురాలు.. ఆమె చాలా కష్టపడింది’’ అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. ‘‘అద్భుతం. ఆమె దీనికి అర్హురాలు’’ అని మరో ఫ్యాన్ రాసుకొచ్చాడు. ‘‘ది బ్లఫ్ అదరగొట్టింది’’, ‘‘ది బ్లఫ్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా’’ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


