...
...
Next Story

Bunny Vasu Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ ఛేంజ్ చేస్తారా? బన్నీ వాసు సంచలన రియాక్షన్.. ఆ ట్రోల్స్ కు గట్టి కౌంటర్!

Bunny Vasu Idupu Kayitham: ప్రియదర్శి హీరోగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రాంతీయ వివాదంపై నిర్మాత బన్నీ వాసు తీవ్రంగా స్పందించారు. నెగెటివ్ ట్రోల్స్‌కు చెక్ పెడుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు. టైటిల్ ఛేంజ్ చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది.

Published on: Jun 27, 2026, 16:06:09 IST
Advertisement

Bunny Vasu Idupu Kayitham: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (బన్నీ వాస్ వర్క్స్), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్) సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి, యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. అయితే మూవీ టైటిల్ కారణంగా రచ్చ రేగింది.

బన్నీ వాసు ఘాటు రియాక్షన్

ఇడుపు కాయితం టైటిల్ ఛేంజ్ చేస్తారా? బన్నీ వాసు సంచలన రియాక్షన్
ఇడుపు కాయితం టైటిల్ ఛేంజ్ చేస్తారా? బన్నీ వాసు సంచలన రియాక్షన్

ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై తాజాగా ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తనను కొంత టెన్షన్‌కు గురిచేసిందని ఆయన అంగీకరించారు.

"కథను బట్టి మాత్రమే మేము ఈ టైటిల్‌ను ఎంచుకున్నాం. దానిపై ఇంత కాంట్రవర్సీ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సినిమా దర్శకుడు వంశీరెడ్డి జమ్మికుంట (తెలంగాణ) నుంచి వచ్చాడు. ఆయన తన ప్రాంతం, మూలాల నేపథ్యంలోనే ఈ ఎమోషనల్ కథను రాసుకున్నాడు. కథకు వంద శాతం న్యాయం చేసేందుకే 'ఇడుపు కాయితం' అని పేరు పెట్టాం" అని బన్నీ వాసు వివరించారు.

హాలీవుడ్ సినిమాలు

"ఈ సినిమా విడుదలయ్యాక ఆంధ్రా వాళ్లకి, తెలంగాణ వాళ్లకే కాదు.. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ ప్రాంతాల వారీగానే సినిమాలు చూడాలనుకుంటే.. ఎక్కడో విదేశాల్లో తీసిన హాలీవుడ్ సినిమాలు ఇక్కడి ప్రేక్షకులు ఎందుకు చూస్తారు? నేను కేవలం కథను మాత్రమే నమ్ముతాను. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇలాంటి వాటిపై మాట్లాడేటప్పుడు నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలి, ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకువచ్చేలా పోస్టులు పెట్టొద్దు" అని బన్నీ వాసు స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు.

పేరు మార్చేదే లేదు

'ఇడుపు కాయితం' అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వాడుక భాషలో ‘విడాకుల పత్రం’ అని అర్థం. కోర్టుల చుట్టూ తిరగకుండా, గ్రామ పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో రాసుకునే సాంప్రదాయక విడాకుల పత్రాన్ని ఇడుపు కాయితం లేదా ఇడుసు కాయితం అంటారు. తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ ఎమోషనల్ కథను సిద్ధం చేశారు. అందుకే ఇడుపు కాయితం అని పేరు పెట్టుకున్నారు.

టైటిల్ పై ట్రోల్స్

ఇడుపు కాయితం టైటిల్ అనౌన్స్ చేయగానే కొందరు ఆంధ్రా ప్రాంతానికి చెందిన నెటిజన్లు సోషల్ మీడియాలో వెటకారంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. "ఈ సినిమాను ఆంధ్రా తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా?", "మాకు అర్థం కావట్లేదు సబ్‌టైటిల్స్ వేయండి" అంటూ కొందరు ట్రోల్స్ చేశారు. దీనికి కౌంటర్‌గా తెలంగాణ నెటిజన్లు కూడా గట్టిగా స్పందించడంతో.. ఈ వివాదం కాస్తా సోషల్ మీడియా వేదికగా 'ఆంధ్రా వర్సెస్ తెలంగాణ' ప్రాంతీయ భాషా యుద్ధంగా మారిపోయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks