Producer vs Director: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. కానీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకముందే బడ్జెట్ లెక్కలు తేడా కొట్టి అటకెక్కిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి (డాన్ ఫేమ్) కథను నానికి వినిపించడం, ఆయనకు నచ్చి నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ దగ్గరకు పంపడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే ముహూర్తం షాట్ పడకముందే బడ్జెట్ కొండలా పెరిగిపోవడంతో ఈ సినిమా వివాదానికి కేంద్రబిందువైంది.
రూ.65 కోట్ల నుంచి 150 కోట్లకు.. ఎలా?

నాని నటించాల్సిన ఈ సినిమాను రెమ్యూనరేషన్లు కాకుండా కేవలం రూ.65 కోట్లతో పూర్తి చేస్తానని దర్శకుడు సిబి చక్రవర్తి నిర్మాతకు హామీ ఇచ్చారు. ఈ లెక్క నిర్మాతకు కూడా ఓకే అనిపించడంతో, చెన్నైలో ఆఫీస్ ఓపెన్ చేసి మరీ రైటర్ల టీమ్‌ను దర్శకుడికి అప్పగించారు చిత్తూరి శ్రీనివాస్.
కథా చర్చలు ముగిసి మరోసారి నరేషన్ ఇచ్చాక హీరో నాని కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కథ సిద్ధమయ్యాక బడ్జెట్ అమాంతం రూ.150 కోట్లకు చేరుతుందని దర్శకుడు చెప్పడంతో నిర్మాత ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రూ.65 కోట్లు ఎక్కడ.. 150 కోట్లు ఎక్కడ? అని ప్రశ్నిస్తే, అందుకు సంబంధించిన సరైన లెక్కలు కూడా దర్శకుడు చూపించలేదని సమాచారం.
"ముహూర్తానికే ఇలా ఉంటే.. విడుదల నాటికి ఇంకెంత?"
"ముహూర్తం కూడా జరగకుండానే బడ్జెట్ రూ.65 కోట్ల నుంచి 150 కోట్లకు పెరిగితే, సినిమా పూర్తయ్యేసరికి అది ఇంకెక్కడికి వెళ్తుందో ఊహించడం కష్టం," అని నిర్మాత తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ రిస్క్‌లో పడుతుందని గ్రహించిన నిర్మాత.. హీరోతో మాట్లాడి పరస్పర అంగీకారంతో ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకున్నారు. అయితే గత రెండున్నర ఏళ్లుగా ఈ సినిమా కోసం ఆఫీస్ ఖర్చులు, అడ్వాన్స్‌లు, జీతాలు, వడ్డీల రూపంలో దాదాపు రూ. 5 కోట్లు ఖర్చయ్యాయని నిర్మాత వాదిస్తున్నారు.
తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు
ఈ రూ.5 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ చిత్తూరి శ్రీనివాస్ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. అయితే దర్శకుడు సిబి చక్రవర్తి మాత్రం కేవలం తను తీసుకున్న అడ్వాన్స్‌ను మాత్రమే తిరిగి ఇస్తానని, మిగిలిన ఖర్చులతో తనకు సంబంధం లేదని చెబుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్శకుడు సిబి చక్రవర్తి ఇటీవలే రజనీకాంత్ #Thalaivar173 ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాని ఇంకా ఆశతోనే ఉన్నారా?
{{/usCountry}}ఈ రూ.5 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ చిత్తూరి శ్రీనివాస్ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. అయితే దర్శకుడు సిబి చక్రవర్తి మాత్రం కేవలం తను తీసుకున్న అడ్వాన్స్‌ను మాత్రమే తిరిగి ఇస్తానని, మిగిలిన ఖర్చులతో తనకు సంబంధం లేదని చెబుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్శకుడు సిబి చక్రవర్తి ఇటీవలే రజనీకాంత్ #Thalaivar173 ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాని ఇంకా ఆశతోనే ఉన్నారా?
{{/usCountry}}నిర్మాత చిత్తూరి శ్రీనివాస్‌తో గొడవ జరిగినప్పటికీ.. నానికి మాత్రం సిబి చక్రవర్తి రాసుకున్న కథపై ఇంకా నమ్మకం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కథను ఎలాగైనా వెండితెరపైకి తేవాలని, అందుకే మరో నిర్మాతను ఈ దర్శకుడితో టచ్‌లో ఉండమని నాని కోరినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఎలా సర్దుమణుగుతుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సిబి చక్రవర్తి, చిత్తూరి శ్రీనివాస్ మధ్య వివాదం ఏంటి?
సినిమా బడ్జెట్‌ను మొదట చెప్పిన దానికంటే (65 కోట్లు) రెట్టింపు కంటే ఎక్కువగా (150 కోట్లు) దర్శకుడు పెంచేయడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీని కోసం పెట్టిన 5 కోట్ల రూపాయల ఖర్చును తిరిగి ఇవ్వాలని నిర్మాత కోరుతున్నారు.
2. నాని సినిమా ఎందుకు ఆగిపోయింది?
నేచురల్ స్టార్ నాని ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా నటించాల్సి ఉంది. కథ నచ్చినప్పటికీ బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్ట్ రద్దయింది.
3. #Thalaivar173 సినిమా నుంచి సిబి చక్రవర్తిని తీసేశారా?
అవును, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ 173వ సినిమా బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు లేదంటే తీసేసినట్లు సమాచారం.