...
...
Next Story

Ekta Kapoor: ఆ హీరో పనికి షాక్ అయ్యా, 31 ఏళ్ల నా కెరీర్‌లో ఎవరు అలా చేయలేదు.. లేడీ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ కామెంట్స్

Ekta Kapoor Speech Bhooth Bangla Trailer Launch: ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన భూత్ బంగ్లా ట్రైలర్ ఏప్రిల్ 6న విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత ఏక్తా కపూర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Published on: Apr 7, 2026, 11:18:46 IST
Advertisement

బాలీవుడ్ ప్రేక్షకులకు 'హేరా ఫేరి', 'భూల్ భులయ్యా' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన అక్షయ్ కుమార్ - ప్రియదర్శన్ జోడీ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ‘భూత్ బంగ్లా’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోమవారం (ఏప్రిల్ 6) భూత్ బంగ్లా సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పాపులర్ బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, అక్షయ్‌తో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయన నిజాయితీని కొనియాడారు.

ఫ్లాప్ సినిమాకు తిరిగి డబ్బులిచ్చిన అక్షయ్!

ఆ హీరో పనికి షాక్ అయ్యా, 31 ఏళ్ల నా కెరీర్‌లో ఎవరు అలా చేయలేదు.. లేడీ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ కామెంట్స్
ఆ హీరో పనికి షాక్ అయ్యా, 31 ఏళ్ల నా కెరీర్‌లో ఎవరు అలా చేయలేదు.. లేడీ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ కామెంట్స్

ముప్పై ఏళ్లకు పైగా తన కెరీర్‌లో అక్షయ్ కుమార్ లాంటి నటుడిని చూడలేదని ఏక్తా కపూర్ ప్రశంసించారు. "చాలా ఏళ్లుగా అక్షయ్ సార్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను. ఒక విషయం చాలా మందికి తెలియదు. మా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి.. 'ఈ సినిమా వల్ల మీరు నష్టపోయారు, ఇదిగో మీ డబ్బులు' అంటూ రిటర్న్ చెక్ ఇచ్చారు" అని ఏక్తా కపూర్ వివరించారు.

అక్షయ్ కుమార్ చేసిన పనికి తాను షాక్‌కు గురయ్యానని ఏక్తా కపూర్ పేర్కొంటూ.. "నా 31 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి పని ఎవరూ చేయలేదు. ఆ డబ్బు తీసుకోవడానికి నేను నిరాకరించాను. దానికి బదులుగా నాతో ఇంకో సినిమా చేయండి, దాని ద్వారా నేను అంతకంటే ఎక్కువ సంపాదిస్తాను అని చెప్పాను. ఆ సినిమానే ఈ 'భూత్ బంగ్లా'" అని ఆమె ఎమోషనల్ అయ్యారు.

'భూత్ బంగ్లా' విశేషాలు

హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తండ్రి ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన భూత్ బంగ్లా చిత్రాన్ని అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అక్షయ్‌తో పాటు పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటించారు.

అయితే, భూత్ బంగ్లా సినిమాను ముందుగా ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందుగా ఏప్రిల్ 16 రాత్రి 9 గంటల నుంచే అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా పెయిడ్ ప్రివ్యూలు (Paid Previews) ప్రదర్శించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe