...
...
Next Story

Naga Vamsi: ఇది అఖిల్ 2.0.. ఈ సినిమా కోసం రక్తం, చెమట చిందించాడు.. మీ ప్రేమతో లెనిన్‌ను ఆశీర్వదించండి: నాగవంశీ

Naga Vamsi: అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్న టైమ్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతోంది. అఖిల్ పై, లెనిన్ మూవీపై ఇందులో అతడు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jul 9, 2026, 21:05:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Naga Vamsi: అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ బ్లాక్ బస్టర్ మూమెంట్ రానే వచ్చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin)తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సరిగ్గా ఈ టైమ్ లో స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఎక్స్ వేదికగా పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

రెండేళ్ల కష్టం.. రక్తం చిందించిన అఖిల్

Naga Vamsi: ఇది అఖిల్ 2.0.. ఈ సినిమా కోసం రక్తం, చెమట చిందించాడు.. మీ ప్రేమతో లెనిన్‌ను ఆశీర్వదించండి: నాగవంశీ
Naga Vamsi: ఇది అఖిల్ 2.0.. ఈ సినిమా కోసం రక్తం, చెమట చిందించాడు.. మీ ప్రేమతో లెనిన్‌ను ఆశీర్వదించండి: నాగవంశీ

గతంలో వచ్చిన 'ఏజెంట్' (Agent) డిజాస్టర్ తర్వాత అఖిల్ ఏకంగా రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్నాడు. ఆ ఫెయిల్యూర్ ఇచ్చిన డిప్రెషన్ నుంచి బయటపడి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రక్తం, చెమట చిందించాడని నాగవంశీ తన ట్వీట్ లో ఓపెన్ గా చెప్పేశాడు. మీ సిసింద్రీ మరో 12 గంటల్లోపే మీ ముందుకు రాబోతున్నాడంటూ అఖిల్ చిన్ననాటి సినిమా గురించి చెప్పాడు. అఖిల్ పడిన కష్టం రేపు స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అక్కినేని ఫ్యామిలీ అనే భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, అఖిల్ ఈసారి గోల్డెన్ స్పూన్ తో పుట్టిన స్టార్ కిడ్ లా రావడం లేదని నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి తపించే ఒక డెబ్యూ హీరోలా మీ ముందుకు వస్తున్నాడని ఎమోషనల్ అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 'అఖిల్ 2.0' వెర్షన్ అందరికీ నచ్చుతుందని నాగవంశీ ప్రామిస్ చేశాడు.

కొత్త హీరోలా ఆదరించండి.. డూ ఆర్ డై సిచువేషన్

గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక రా అండ్ రస్టిక్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చి అఖిల్ కు ఒక మంచి ఓపెనింగ్ ఇవ్వాలని, అది అతనికి మరింత బూస్ట్ ఇస్తుందని నాగవంశీ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశాడు.

డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ స్టోరీని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడని ఇన్ సైడ్ టాక్. అలాగే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కు ప్రాణం పోసిందట. ఏదేమైనా ఈసారి మాత్రం థియేటర్ నుంచి బయటకొచ్చే ఆడియన్స్ కు ఒక పరిపూర్ణమైన మూవీ చూశామనే సంతృప్తి గ్యారెంటీగా దక్కుతుందని మూవీ టీమ్ బలంగా ఫిక్స్ అయింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe